Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

header-new-unit-muchata.com
  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నెంబర్ వన్… లేదా నంబర్ టూ… ఇదే బీజేపీ తాజా రాజకీయ దిశ…

December 25, 2020 by M S R

అయితే ప్రభుత్వంలో… లేదంటే ప్రధాన ప్రతిపక్షంలో…! ఇదే బీజేపీ నయా పాలసీ… ఇతర పార్టీలను కూడా ఆ దిశలోనే నెట్టేయబోతోంది అది… ఉదాహరణ… తెలంగాణ..! తదుపరి దశలో ఏపీ… మెల్లిగా తెలుగుదేశాన్ని తొక్కేయడం… సేమ్, ఒడిశా, బెంగాల్… అధికారంలోకి వస్తారా రారా అనేది వేరే సంగతి… బలమైన ఉనికి దానికి ముఖ్యం… ఎటొచ్చీ ఆల్‌రెడీ రెండు బలమైన పక్షాలున్నచోట అది చొరబడలేకపోతోంది… ఉదాహరణ… తమిళనాడు, కేరళ…! ఈ దిశలో అది ఫస్ట్ కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తుంది… సమాంతరంగా ప్రాంతీయ పార్టీలను కూడా..!

ఇక కాశ్మీర్‌కు వస్తే… చాలామంది బీజేపీకి భంగపాటు, ఆర్టికల్ 370 ఎత్తివేతకు ప్రజల నిరసన అని విశ్లేషణలు సాగిస్తున్నారు, రాసేస్తున్నారు… కానీ అది నిజం కాదు… అక్కడ బీజేపీ వర్సెస్ యాంటీ బీజేపీ పోరాటం సాగింది మొన్నటి డీడీసీ ఎన్నికల్లో… డీడీసీ అంటే జిల్లా అభివృద్ధి మండళ్లు… ఒకరకంగా స్థానిక ఎన్నికలు…

ఏడు పార్టీలు కలిసి, సీట్లు పంచుకుని, యాంటీ-బీజేపీ వోట్లు చీలకుండా జాగ్రత్తపడినా సరే… బీజేపీ వాళ్లందరికన్నా ఎక్కువ సీట్లు, ఎక్కువ వోట్లు గెలుచుకుంది… ఆ గుప్కార్ కూటమి పార్టీలు విడివిడిగా పోటీ చేసి ఉంటే..? బీజేపీకి ఇంకా బలం పెరిగేది… సో, బీజేపీ హేపీగా ఉంది ఈ ఫలితాల పట్ల…!

నిజానికి ఈ ఫలితాలను ఆర్టికల్ 370 కోణంలో చూడాల్సిన పనిలేదు… దేశసమగ్రత కోణంలో లోతుగా ఆలోచించి తీసుకున్న ఓ మార్మిక అడుగు… పైగా ఈ స్థానిక ఎన్నికలు బీజేపీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల రెఫరెండమ్ కూడా కాదు… అసలు అక్కడ దాదాపు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడమే ఓ అచీవ్‌మెంట్ ఇప్పటి స్థితిలో… ప్రజలు పోలింగులో భారీగా పాల్గొన్నారు అంటేనే… ఏ నిరసనా వ్యక్తీకరించలేదంటేనే… కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 ఎత్తివేత ఆలోచనల నుంచి ప్రజల్ని మళ్లించినట్టే లెక్క…

మేం ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయం అంటూనే ముఫ్తీ పార్టీ, ఒమర్ పార్టీ ఇతర పార్టీలతో కలిసి కూటమిలో చేరింది… మళ్లీ ఇప్పుడు మేం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోం అని ముఫ్తీ మాట్లాడుతోంది… తీరా ఎన్నికలొచ్చేసరికి ఈ మాట ఉంటుందా, మారుతుందా చెప్పలేం, అలాగే ముఫ్తీ, ఒమర్ పార్టీల నడుమ ఇప్పటి స్నేహం… ఈ కూటమి రాజకీయం ఉంటుందా పోతుందా చెప్పలేం… ఎన్నేళ్లుగానో ఆ రెండు వర్గాల నడుమే కదా అక్కడ రాజకీయం అంటే…!

నిన్న ఎక్కడో మాట్లాడుతూ… బీహార్ ఆర్జేడీ తేజస్వి యాదవ్ ‘‘ప్రతిచోటా మహాకూటమి నిర్మాణం జరగాలి’’ అని అభిప్రాయపడ్డాడు… తన ఉద్దేశం యాంటీ బీజేపీ ఘట్ బంధన్… అవును, బీజేపీ కోరుకునేదీ అదే… అన్ని పార్టీలు అది కోరుకున్న దిశలోనే కదులుతున్నయ్… ‘‘బీజేపీ లేదా యాంటీ బీజేపీ…’’ ఎక్కడైనా రాజకీయం ఇలా సాగాలనేదే దాని కోరిక… కాకపోతే అన్నిచోట్లా అది ఇప్పటికిప్పుడు కుదరదు… ఉదాహరణ… బెంగాల్… లెఫ్ట్, కాంగ్రెస్ ఒక్కటయ్యాయి… కానీ టీఎంసీతో అవి కలవలేవు… సో, త్రిముఖం తప్పదు… అయితే తేజస్వి చెప్పిందే అంతిమం… బీజేపీ దూకుడుని నిలువరించాలంటే ప్రస్తుతానికి అదొక్కటే రాజకీయ అనుసరణీయ మార్గం… ఆ దిశలో వైరిపక్షాలు కూడా చేతులు కలపాల్సి ఉంటుంది… రాజీలు పడాల్సి ఉంటుంది… అయితే… ఒకే దేశం, ఒకే ఎన్నిక అనే దిశలో జమిలి ఎన్నికలు సుసాధ్యం చేయగలిగితే… తన వైరిపక్షాలు ఒక్కటవుతుంటేనే తన ఉనికి మరింత బలంగా విస్తరిస్తుంది అనేది బీజేపీ విశ్వాసం, అదే ప్రయత్నం… కానీ అదంత వీజీ కాదు… ఎందుకో తరువాత మరో కథనంలో చెప్పుకుందాం… 

ఇది ప్రజాశక్తి విశ్లేషణ… ఈమధ్య ఈ పత్రిక వింతవింత వార్తలకు దిగుతోంది… మొన్న 25 వేల మంది జవాన్లు శౌర్యచక్ర అవార్డులు వాపస్ ఇచ్చేస్తున్నారు అని రాసి, చెంపలేసుకుని, సవరణ రాసుకున్నది తెలుసు కదా… ఇప్పుడు కాశ్మీర్‌లో బీజేపీ గెలుపు శాతం తక్కువే అంటూ ఓ విశ్లేషణ రాసుకొచ్చింది… గ్రాఫ్ మాత్రం గుప్కార్ కూటమిలోని పార్టీల గెలుపు శాతం విడివిడిగా ఇవ్వడమే తప్పు… అన్ని సీట్లలో పోటీచేసిన బీజేపీకి సహజంగానే గెలుపు శాతం తక్కువ ఉంటుంది… సెలెక్టెడ్‌గా, పొత్తులో వచ్చిన మాత్రమే మిగతా పార్టీలు నిలబడ్డాయి కాబట్టి గెలుపు శాతం ఎక్కువ ఉంటుంది… బీజేపీకి, గుప్కర్‌కు స్థూలంగా పోల్చాలి… మా సీపీఎం బాగా ఊడబొడిచిందోచ్ అని చెప్పడానికి ఈ టక్కుటమారం దేనికి..?

Follow Us


Share this Article


Search On Site

Advertisement

Latest Articles

  • హిమ స్వర్ణం..! ఇండియన్ సోషల్ మీడియా సంబరం… చాలా అరుదు..!
  • సోప్ వేసిన సోప్ ప్రకటన..! తెల్లటి మాయకు తెలివైన ప్రయాస..!!
  • చెక్ నితిన్..! ఎంత ఏలేటి అయితేనేం… కమర్షియల్ లెక్కల్లో బోల్తా…!!
  • వజ్రాన్ని నేను…! నీరవ్ మోడీ అంతరాత్మ బహిరంగ లేఖ..!
  • ఇంట్రస్టింగు తీర్పు…! మహిళ పుట్టింటివారికీ ఆస్తిలో వారసత్వహక్కు..!!!
  • డంకీ బిర్యానీ… డంకీ కబాబ్స్… డంకీ బర్గర్స్… లొట్టలేస్తున్నారట ఏపీజనం..!!
  • లెఫ్ట్, రైట్ కలిసి… రైట్ రైట్..! బెంగాల్‌లో బద్ధవైరుల నయా దోస్తానా..!!
  • బాబోయ్… ఇదేం వార్తారచన తండ్రీ… ఈనాడును ఏదో పాము కాటేసింది…
  • రైల్వే ప్రయాణాలు తగ్గించండి… లేకపోతే చార్జీలు ఇంకా పెంచేస్తాం…
  • దక్షిణ కుంభకోణం..! పూజారుల భారీ మోసాల్ని పట్టేసిన కేరళ సర్కారు..!!

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now