Muchata

రాజశేఖర్..! కారెక్కితే చాలు కంట్రోల్ ఉండదు… తనపైనా, కారుపైనా..!!

November 13, 2019

కారు చూశారుగా… ముందు భాగం నుజ్జునుజ్జు… అది బెంజ్ కాబట్టి… సమయానికి బెలూన్లు ఓపెన్ అయ్యాయి కాబట్టి… రాజశేఖర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు… ఎదురుగా వచ్చే కారు వాళ్లెవరో తనను గుర్తుపట్టి, విండ్ షీల్డ్ నుంచి బయటికి తీశారని తనే చెబుతున్నాడు… అక్కడ రాజశేఖర్ కాదు, ఇంకెవరో అనామకుడు ఉన్నా సరే, ఎదుటి కారులో వాళ్లకు మానవత్వం ఉంటే బయటికి లాగుతారు, అది హీరో రాజశేఖరే కానక్కర్లేదు… ప్రేమతో రక్షించటానికి..! నిజంగా గ్రేటు… అది మామూలు కారు గనుక అయి ఉంటే, ఇప్పుడు మనం రాసుకునే వార్తలు వేరేగా ఉండేవి…

జీవిత చెబుతున్నది ఏమిటంటే… రాత్రి ఒంటిగంటన్నర ప్రాంతంలో రామోజీ ఫిలిమ్ సిటీ నుంచి వస్తుంటే టైర్ పగిలిందట, దాంతో డివైడర్‌ను ఢీకొని, పల్టీ కొట్టిందట… సరే, ఆమె ఏదో చెబుతుంది కానీ….

అసలు రాజశేఖర్‌కు ఏమైంది..? తను కారు ఎక్కితే చాలు… డ్రైవింగు రాదా..? స్పీడ్ కంట్రోల్ ఉండదా..? ఏదైనా మత్తులో ఉంటాడా..? అసలు ఔటర్‌పై 100 స్పీడు దాటితే ఫైన్లు… మరి అలాంటిది 180 కిలోమీటర్ల స్పీడ్ ఏమిటసలు..? వోకే… మరీ అంత నుజ్జు నుజ్జు అయ్యేలా కంట్రోల్ ఎలా తప్పింది..? అసలు తన కంట్రోల్‌లో లేడా..? ఓవర్ స్పీడ్ చలాన్లు మూడు ఆల్ రెడీ పెండింగు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు… ఇంకా నయం, అది ఔటర్ కాబట్టి వోకే… అదే మెయిన్ రోడ్లపై అదే స్పీడ్ మెయింటెయిన్ చేసి ఉంటే, వెనక వచ్చేవాళ్లకో, ముందు వచ్చేవాళ్లకో పరిస్థితి ఏమిటి..?

సందర్భం కాబట్టి మరొకటీ చెప్పుకుందాం… 2017లో, అక్టోబరులో… ఓరోజు రాత్రి పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే మీద ప్రయాణిస్తున్న ఇంకో కారుతో తన కారును గుద్దేశాడు… ఆరోజు బాగా తాగి డ్రైవింగులో ఉన్నాడనీ, అసలు మన సోయిలోనే లేడని బాధితులు ఫిర్యాదు చేశారు… అఫ్ కోర్స్, తను తాగి లేడని డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేసి తేల్చారు… స్పాటులో పరీక్షలు చేస్తే ఫలితం ఎలా ఉండేదో గానీ… ఆరోజు ఏ చిక్కులూ లేకుండా బయటపడ్డాడు…

మళ్లీ అదే సీన్… అంత ఘోరంగా కారు నుజ్జునుజ్జు అయ్యిందంటే తను ఏ స్పీడులో, ఏ స్థితిలో డ్రైవింగులో ఉన్నాడో అర్థమవుతూనే ఉంది… తను నిజంగా లక్కీ… జస్ట్, చిన్న చిన్న గాయాలతో బయటపడిపోయాడు… అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగినట్టు పోలీసులు కేసు పెట్టారట… అబ్బే, ఆ కేసులతో ఏమవుతుందీ అంటారా…? అంతకన్నా పోలీసులు మాత్రం ఏం చేయగలరు..? అసలు ఔటర్ ఎక్కారంటే చాలు, సెలెబ్రిటీల కార్లకు ఏ కంట్రోలూ ఉండటం లేదు కదా… ఓ చిన్న సందేహానికి జీవిత సమాధానం చెప్పాలి… ఎలాగూ రాజశేఖర్ ఏమీ చెప్పడు… అంత పెద్ద హీరో కదా… తన కారుకు కనీసం డ్రైవర్ ఉండడా..? తను ఏ స్థితిలో ఉన్నాడనేది వదిలేద్దాం… తనపై తనకు కంట్రోల్ లేనప్పుడు కారు నడపడం దేనికి..? తనను తాను రిస్కులో పెట్టుకోవడం మాటెలా ఉన్నా, ఇదే సిట్యుయేషన్ ఔటర్ గాకుండా మిగతా రూట్లలో గనుక ఎదురైతే పరిస్థితి ఏమిటి…? మీ బెంజ్ సరే, ఎదుటి కారు బెంజ్ అయి ఉండాలని ఏమీ లేదు కదా జీవితమ్మా… అమ్మ తల్లీ… కంట్రోల్ ప్లీజు… మీతో కొట్లాడే సిట్యుయేషన్ ఓ సామాన్యుడికి రాకపోవచ్చు… అందుకే…

Filed Under: main news

Recent Posts

  • మామాంగం..! తెలుగు ప్రేక్షకుడు కనెక్ట్ కాలేని ఓ కేరళ వేడుక..!!
  • అనవసర వివాదాలతో బోలెడంత హైప్, ప్రచారం… కానీ ఏముందని ఇందులో..!
  • సాయిరెడ్డి కేంద్ర షిప్పింగ్ శాఖ, నందిగం సురేష్‌కూ చాన్స్… ఇంకా..?!
  • KCR ప్రభుత్వాన్ని ఇరికిస్తారా..? బహుశా ఎదురుతన్నే ప్రమాదం..!
  • అబ్బో, భారీ యవ్వారమే..! టీడీపీ పెద్దలపై జగన్ మరో పెద్ద దెబ్బ..!!
  • హాటు సీన్లు, ఘాటుతనం… ఈసారి బూతు సినిమా పూర్తిగా రిజెక్టెడ్…
  • ఛపాక్ దీపిక పడుకోన్‌కన్నా ముందే ఓ పార్వతి సాహసం..!
  • గన్స్‌తో చుట్టుముట్టారు… గజ్జున వణికిపోయిన శ్రియ..!
  • పాపం శివసేన..! కాంగ్రెస్ స్వారీ తెలిసొచ్చింది…! పౌరసత్వ బిల్లే ఉదాహరణ..!!
  • రుణానందలహరి
  • ప్రి-వెడ్డింగు షూట్లు- రికార్డింగ్ డాన్సులపై నిషేధం… ఎందుకు..?!
  • తెగించినోడికి తెడ్డే లింగం..! ‘‘ఇంకా తీవ్రమైన శిక్ష ఏం వేయగలరు నాకు..?!’’
  • ఫాఫం సాక్షి..! తన బాస్ ధోరణే పెద్ద ఇష్యూ అయిపోయింది మళ్లీ..!!
  • ఈ అమ్మపాల వైరల్ ఫోటో వెనుక..! తెలుసుకోవాల్సినవి ఇంకా బోలెడు..!!
  • ఈనాడుకు సర్టిఫికెట్టు దేనికి జగన్..? సాక్షే కాదు, అదీ తప్పే రాసింది కదా…!!

Follow

Subscribe to notifications

Handcrafted with by All Tech Media. All Rights Reserved Muchata.