Muchata

లక్ష కోట్ల హామీలు ఇచ్చినా… ఈ దరిద్రం మాత్రం కాంగ్రెస్‌ను వదలదు…!

December 2, 2018

అన్నం వండిపెడతామహో… ముద్దలు కలిపి నోట్లో పెడతామహో… — కడిగి పెడతామహో…. అన్నట్గుగా రాజకీయ పార్టీల హామీలు అరచేతిలో వైకుంఠం ఏం ఖర్మ…. వంద వైకుంఠాలు చూపిస్తున్నాయి తెలుసు కదా… అదేనండీ, తెలంగాణ ఎన్నికల్లో…. ఇక్కడ జగన్ హామీల గురించి కాదు, అసలు ఏ హామీలు ఇవ్వని పవన్ గురించి కాదు, హామీల అమలు పట్టని చంద్రబాబు గురించి కాదు…! మీరు పనీపాటా లేకుండా ఇంట్లో కూర్చొండి, ఒక్కో ఇంటికి పది వేల దాకా పంపిస్తాం, బ్యాంకులో వేస్తాం అన్నట్టుగా ఉంటున్నయ్ మేనిఫెస్టోలు… ఈ పార్టీల దరిద్రాన్ని మరీ అంత లోతుగా విశ్లేషించుకుంటే… ఎన్ని ‘ఎర్రగడ్డ’లైనా సరిపోవు కానీ… ఒకటీ రెండు ఉదాహరణలతో తేల్చేసుకుని, మనస్సు నిమ్మళం చేసుకుని, పార్టీల మేనిఫెస్టోలు, ప్రకటనలకు దూరంగా ఉంటే మానసిక ఆరోగ్యానికి ఎంతైనా భేష్… సరే, ఇక్కడ ఓ చిన్న ఉదాహరణకు వద్దాం… కాంగ్రెసోడు ఇందిరమ్మ ఇళ్ల పేరిట లక్షల ఇళ్లతో కొన్ని వేల కోట్లను కాజేసి, భోంచేసి, వాతాపి జీర్ణం అన్నారు అని కదా కేసీయార్ ఆరోపణ… ఈ నాలుగున్నరేళ్లు నాకు చేతకాలేదు గానీ, వచ్చే నాలుగున్నరేళ్లలో ఒక్కొక్కడి తాటతీస్తా అంటున్నాడు కదా… ఆ కోట్ల అక్రమాల ఇందిరమ్మ ఇళ్లకే కాంగ్రెస్ మరో హామీ యాడ్ చేసి పారేసింది… అర్థమైనోడికి అర్థమైనంత… ఆ మేనిఫెస్టర్లకు ఉన్న బుర్ర అంత..!

ఇందిరమ్మ ఇళ్లు ఆల్‌రెడీ ఉంటే, అదనపు గది కోసం లక్షో, రెండు లక్షలో పారేస్తారట…. అంటే… ఆల్‌రెడీ అక్రమాలు చేశారు కదా, దానికి బోనస్ ఇస్తాము అని చెబుతున్నారన్నమాట…. వోకే, వోకే, అది వదిలేద్దాం… కేసీయార్ డబుల్ బెడ్రూం స్కీంకు కౌంటర్‌గా ఓ ప్రచారం ప్రారంభించారు… (అఫ్ కోర్స్, కేసీయార్ ఈ డబుల్ బెడ్రూం అమలులో అట్టరాతి ఫ్లాపు అనేది వేరే సంగతి….) ఇంటికోసం స్థలం ఉంటే 5 లక్షలు ఇస్తాం, ఎస్సీ-ఎస్టీలకు అయితే 6 లక్షలు ఇస్తామహో అని కాంగ్రెస్ నమ్మబలుకుతున్నది… ఇవ్వలేకపోతే ఇంటి అద్దె ఇస్తామనీ చెబుతున్నది… అవును, సంకల్పానికి దరిద్రం దేనికి..? అంతటి అక్రమాల ఇళ్లకే అదనంగా మరింత ధనం ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్ ఇప్పుడు తన ప్రకటనల్లో ఏం చెబుతున్నదో తెలుసా..? తను చేసేది ఉచితసాయం కాదట… జస్ట్, రుణమేనట… ఎహె, ఊరుకొండి సారూ… ఆ రుణాలు ఎవడు రీపే చేస్తాడు, ఉచితంగా ఇచ్చినట్టే కదా అంటారా..? మరి అలాంటప్పుడు ఉచితసాయం అని ఎందుకు ప్రకటించలేకపోయింది..? లక్ష కోట్ల హామీలు ఎలా ఆచరణసాధ్యమో ఎలాగూ చెప్పలేరు… కేసీయార్ లక్షన్నర కోట్ల అప్పులు చేస్తేనే ఆ డబుల్ బెడ్రూం ఇళ్ల హామీని నెరవేర్చుకోలేక చేతులెత్తేశాడు… మరి అలాంటప్పుడు ఏదో ఓ హామీ ఇవ్వటానికి దరిద్రం దేనికి..? కాంగ్రెస్ మేనిఫెస్టో చూడగానే కేసీయార్ ఉలిక్కిపడి తనూ ఓ హామీ ఇచ్చాడు గుర్తుంది కదా… ఈ ప్రభుత్వ స్థలాల్లో తనే ఇళ్లు కట్టివ్వడం అనేది ఇక తన వల్ల కాదు అని చెప్పలేక… మీ సొంత స్థలం ఉంటే డబ్బులిచ్చేస్తాను అని చెబుతున్నాడు… ఈరోజు విడుదల చేసిన మేనిఫెస్టోలో కూడా అదే పెట్టాడు… కానీ చాలా తెలివిగా అది రుణమో, ఉచితమో మాత్రం చెప్పలేదు… ప్చ్… మొత్తానికి ఈ పార్టీలకు తెలంగాణ జనం రుణగ్రస్తులే సుమా… ఇంటి రుణాలు కాదు… అలవిమాలిన హామీలతో ఎడాపెడా ప్రజలను ఎంటర్‌టెయిన్ చేస్తున్నందుకు…!

Filed Under: main news

Comments

  1. Vinod Kumar awala says

    December 3, 2018 at 12:16 am

    Totally false promises they no longer fulfilled

    Reply
  2. Ram says

    December 2, 2018 at 11:38 pm

    telangana govt is uttarathi failed anav kada…can you prove it.
    May be they hv not delivered in time…that doesn’t mean it is failed…
    U first check the status of the scheme…and tell…

    Reply
  3. uchitam says

    December 2, 2018 at 9:23 pm

    నేను సీఎం అయితే

    1. మీకు ఇంట్లోకి కావలసిన అన్ని సరుకులు, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ ఉచితం
    2. స్త్రీ లకి వంటింటి భారం తగ్గిస్తాం, మీ వంటను మేమె మీ ఇంట్లో తయారు చేసి పెడతాం . మీరు తినడమే మీ వంతు . మీ ప్లేట్స్ మేమె కడుగుతాం
    3. ఉద్యోగస్తులందరికి మధ్యాహ్న భోజనం ఉచితం
    4. ప్రతి పండగకి ఇంటికి వెళ్లే ఆడపడుచులకు, చిన్న పిల్లలకి బస్సు ,ట్రైన్ , విమాన టికెట్స్ ఉచితం .
    5. అన్ని రకాల తెలుగు సీరియల్స్ కలిగిన ఒక డీవీడీ ఇస్తాం ఉచితం
    6. మగవారికి హరి కట్టింగ్ ఉచితం
    7. చిన్న పిల్లలకి birthday సెలెబ్రేషన్స్ ఉచితం

    ఇంకా ఏంన్నో ఉచిత పతకాలు

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Archives

Recent Posts

  • రంగులద్ద‌కుండా… ల‌య‌బ‌ద్ధంగా..!!
  • 10 టీవీ సరే… మరి ఆంధ్రజ్యోతి చేసిందేమిటట… అదే కథ కదా…
  • ప్రేమంటే పెళ్లికాని వాళ్లకేనా? మాకూ వుంటాయండీ…
  • ఔనా… మోడీ భాయ్ ఇమ్రాన్ ఖాన్ కలిసి ఈ ‘ఉగ్ర కుట్ర’ చేశారా..?
  • ఓ లేడీడాన్… బడా సెక్స్ ట్రేడర్… కానీ ఆమే కూడా ఓ ‘అమ్మే’..!
  • సీపీఎంలో టెన్‌టీవీ ప్రకంపనలు… జాతీయ కమిటీ సీరియస్..!!
  • జగన్ పత్రిక, తోకపత్రిక… మరీ బజారు స్థాయి కార్యకర్తల్లా వీళ్లు కూడా..!!
  • ‘యాత్ర’ రాజేసిన చిచ్చు… గౌరు చరిత సీన్, ఆ డైలాగుతో రుసరుసలు…
  • నిరసనకు, ధిక్కారానికీ నలుపు కదా… కాదు, చంద్రబాబు మార్చేశాడు..!
  • మరుగుదొడ్లకూ లింగసమానత్వం..! మన వర్శిటీల్లో కొత్త చైతన్య దీప్తులు..!
  • మోడీకి ఇక సన్యాసమేనట… అమిత్ షాకు శంకరగిరి మాన్యాలేనట..!
  • ఎప్పుడు? ఎందరు? ఎవరెవరు? కేసీయార్ కేబినెట్‌పై అంతా సస్పెన్సే..!
  • సినిమా ఫట్… తెర వెనుక ‘పెద్ద తలల’ నడుమ ఫటాఫట్… దేనికి..?
  • ‘నడత మార్చిన నడక’… యాత్ర సినిమాపై ఓ డిఫరెంటు రివ్యూ…
  • ఊరెళ్లే ప్రయాణమంటే మాటలా మరి..? అబ్బో, ఎంత ప్రయాస..?!

Handcrafted with by All Tech Media. All Rights Reserved Muchata.