.
BT Govinda Reddy
…….. కొంప ముంచిన కిస్ కెమెరా…. కింది ఫోటోల్లో కుడి వైపున ఇద్దరు నడివయస్కులు ఒకరినొకరు హత్తుకుని ఉన్న ఫోటో గత రెండ్రోజులుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో విశేషం ఏముంది అంటే… వారిద్దరికి పెద్ద కష్టమే వచ్చిపడింది.
ఏం జరిగిందంటే… యాండీ బైరన్ (50) అనే ఆయన న్యూయార్క్ లోని ఆస్ట్రోనామర్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీ సిఇఓ. ఆయన బాహువుల్లో ఇముడ్చుకున్నది అదే కంపెనీలో పనిచేసే HR విభాగం హెడ్ క్రిస్టిన్ కోబోట్. దంపతుల్లా కనిపిస్తున్న వీరిద్దరికి అంతకు ముందే వివాహాలయ్యాయి.
Ads
ఆఫీసు పనిమీద టూర్ వెళ్తున్నామని ఇళ్లలో చెప్పి బోస్టన్ లోని గిల్లిట్ స్టేడియంలో జరుగుతున్న కోల్డ్ ప్లే (Coldplay) అనే సంగీత కచేరీకి హాజరయ్యారు. ఇలాంటి కచేరీల్లో కిస్ క్యామ్ అనే ప్రత్యేక కెమెరా లోకాన్ని మర్చిపోయి ప్రేమలో మునిగిపోయిన జంటలను అందరికి చూపుతుంది.
వీరిపైన కిస్ క్యామ్ స్పాట్ లైట్ పడటంతో దొంగలు దొరికి పోయారు. వెంటనే పక్కకు వాలిపోయినా జరగాల్సిన నష్టం జరిగింది. ఆర్టిఫిషియల్ సాంకేతిక నిపుణుడైన యాండీ బైరన్ వయసు 50 ఏళ్లు. ఆయన భార్య పేరు మేఘన్ బైరన్ (50) ఒక విద్యాసంస్థలో పనిచేస్తారు. వారికి ఇద్దరు సంతానం.
మరో వైపు క్రిస్టిన్ కోబోట్ భర్త యాండీ కోబోట్ కూడా ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్. ఆయన ఒక మద్యం కంపెనీ సిఇఓగా ఉన్నారు. వీరిపై స్పాట్ లైట్ పడి కెమెరా అటు తిరగగానే దాని వ్యాఖ్యత వీరిద్దరు ‘సిగ్గు ఎక్కువ ఉన్న దంపతులైనా అయి ఉండాలి. ఎఫైర్ పెట్టుకున్నవారైనా అయి ఉండాలి” అని అనడంతో స్టేడియంలోని ప్రేక్షకులంతా వీరి వైపు తిరిగి చూసారు. వీరిద్దరి వీడియో క్లిప్ వైరల్ అయింది.
మరుసటి రోజు ఇద్దరి వివరాలను మీడియా బయట పెట్టింది. ఇప్పుడు ఇద్దరి జీవిత భాగస్వాములు విడాకులు కోరే అవకాశాలుండగా యాండీ, క్రిస్టినాల ఉద్యోగాలు పోయే పరిస్థితి ఏర్పడింది. ఆమె భర్త యాండ్రూ ఇంకా స్పందించలేదు. (ఫోటో కర్టెసీ న్యూయార్క్ పోస్ట్. ఫోటోలో ఎడమ వైపున ఉన్న యాండీ బైరన్ భార్య మేఘన్ బైరన్)
Share this Article