………… Gottimukkala Kamalakar……………  ఇది మత పాలన. మరోమాట లేదు. దానితో మాకు ఏకీభావం లేదు. We will break the rules, we will break them, through elections. — ఒక జాతీయ, రాష్ట్రీయ, స్థానిక ప్రభుత్వాల ప్రతిపక్ష మిత్రుడు.

****
ఈ భావజాలం సోషల్ మీడియాలో, SPIRITual సమావేశాల్లో పెరుగుతున్నంత కాలం, మోదీ ప్రభుత్వపు బలం పెరుగుతూనే ఉంటుంది.

నేనేం సైడ్లు తీసుకోవడం లేదు. “రాజకీయ నాయకులందరూ ఒకటే” అన్నదే నా నిశ్చితాభిప్రాయం. జైపాల్ రెడ్డే కారణాలు చెప్పి కాంగ్రెస్ లో దూరాడు…! మిగిలిన బీకామ్ ఫిజిక్సులూ, బియ్యే హెచ్చీసీలూ ఎంతపాటీ..??

ఇప్పటి నాయకులకు అంబేద్కర్ లా, పీవీలా, వాజపేయ్ లా వాళ్ల వాళ్ల సిద్ధాంతాల పట్ల నిబద్ధత ఉండాలనుకోవడం మన బుద్ధిలేనితనమవుతుంది.

“పావుగంట స్వాతంత్య్రాన్ని మాకిస్తే మేమేంటో చూపిస్తాం..!” అంటూ పాతబస్తీ యువనేత వేసిన వీరంగం…

జై శ్రీరామ్ అనడం బూతని, గవర్నర్ ను కూడా శాసనసభలోకి రానివ్వని దాష్టీకం, వ్యవస్థలన్నిటినీ గుప్పిట్లో బిగించి, విప్లవ(?) పార్టీలను అణగదొక్కిన దుర్మార్గం..

దైవభక్తురాలైన శ్రీమతి రెహానా ఫాతిమా గారి అయ్యప్పదర్శనం కోసం అకుంఠిత దీక్షా..,

వీధికి రెండు ప్రార్ధన మందిరాలు కట్టి విశ్వాసుల సంఖ్య పెంచుకోవడానికి జుట్టూ జుట్టూ పట్టుకు తన్నుకుంటున్న పాస్టర్లూ…

కావాలని చేస్తున్న బీఫ్ ఫెస్టివల్సూ, వాటికి పోటీగా చేస్తున్న పోర్క్ ఫెస్టివల్సూ, రెండో పీహెచ్డీని యూనివర్సిటీ క్యాంపస్ లలో ఉంటూ నడివయసు విద్యార్థులు చేస్తున్న కిస్ ఫెస్టివల్సూ..,

డబ్బును కరుసెట్టేసుకుని, బొమ్మ మెమెంటోనీ, పురస్కారపు కాగితాన్నీ వెనక్కిచ్చేసి పేపర్లలో రాయించుకుంటున్న మేధావులూ,

ముస్లిములందరూ కాంగ్రెస్ కే ఓటేయాలని ఫత్వా జారీచేసే జామామసీదు ఇమామూ..,

దేశాన్ని వదిలివెళ్లాలని ఉందంటూ సన్నాయినొక్కులు నొక్కే స్టార్లూ,

జేబు దొంగతనాలనుండి, మర్డర్లూ, మానభంగాల దాకా చకచకా అభిప్రాయాలను కక్కే సోషల్ మీడియా వీరులూ, ఎవరు ఎవరికి ఎంత ఎప్పుడు ఎక్కడ ఎలా శిక్షవేయాలో ప్రభుత్వానికీ, పోలీసులకూ, కోర్టులకూ సలహాలిచ్చే డ్రాయింగ్ రూం మేధావులూ..

మీ అందరి మనోభావాల బిగ్ డేటా అనలిటిక్స్ ఆ గుజ్జూ భాయ్ ద్వయం దగ్గర ఉంది.
బియ్యం ఎంత ఉడికాయో తెలుసుకోవడానికి మెతుకొకటి చాలు. వాళ్లెంత మెటిక్యులస్ ప్లానర్లో తెలుసుకోవడానికి సోహ్రబుద్దీన్ కేసు చాలు. వాటిని మెజారిటీ గొర్రెలకు మీ వ్యతిరేక దిశలో మేపుతున్నారు.

****
వాళ్లను తిట్టడం కాదు. మీరు వాళ్ల కన్నా ఎలా ఉత్తమప్రత్యామ్నాయమో వివరించండి. వాస్తవ పరిస్థితుల్లోకి రండి. ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదం ప్రస్తుతం ఏనుగురొమ్ము. ముద్రగడ, మందకృష్ణల కుల రాజకీయాలు; అద్వానీ రధయాత్రలూ గట్రా చిరంజీవి చిన్నప్పటి టెక్నిక్లు.

వాళ్లు ఇద్దరూ అధికార వ్యవస్థను అత్యంత క్రియాశీలకంగా వాడుతున్నారు. అంతో ఇంతో పేరూ, చరిత్రా ఉన్న ప్రతిపక్ష నేతలంతా కలత నిద్రలు పోతున్నారు. వాళ్ల అనుమతి తిసుకున్నాకే విమర్శిస్తున్నారు.

ప్రతొక్కడికీ ఓ ఎజెండా ఉంది. అరవై సంవత్సరాల అపీస్ మెంట్ రాజకీయాలు ఈ దేశపు మెజారిటీ ప్రజల్ని నిర్వేదంలో ముంచితే, సరిగ్గా ఆ పాయింటును పట్టుకుని పైకెక్కేసారు వాళ్లిద్దరూ…!
****
చలికాలం ఆవులకు కోట్లేసే గాడిదలకు నేనేం మెచ్చి మేకతోలు కప్పడం లేదు.

మనం ఉష్ట్రపక్షులు గా మిగిలిపోవడం సరికాదంటున్నాను.

కళ్లు మూసుకుని పాలు తాగొద్థూ, మన శాపాలకు ఉట్లు తెగవు అంటున్నాను…