Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నేడు మీదే – రేపు మాదే..! అదరగొట్టేసిన ఆరియానా… హారిక అట్టర్ ఫ్లాప్…

December 7, 2020 by M S R

అవునూ… బిగ్‌బాస్ ఫినాలేకు ముఖ్యఅతిథిగా మహేశ్ బాబు వస్తున్నాట్ట నిజమేనా..? ఏమోలే, వచ్చినప్పుడు చూద్దాం, రాసుకుందాం, చెప్పుకుందాం… కానీ ఈరోజు నామినేషన్ల సంగతి ఏమైందీ అంటారా..? ఏముందీ..? ఈ నామినేషన్ల ప్రక్రియ నావల్ల కాదు… మళ్లీ గంటల కొద్దీ మైండ్ లేకుండా ఒర్లుతారు, నాకే వశపడతలేదు, ఇక ఫాఫం, ప్రేక్షకులు ఇంకా ఏం భరిస్తారు అని బిగ్‌బాస్ భావిస్తున్నట్టుగా…. ఈసారి అందరినీ నామినేట్ చేసిపడేశాడు తనే… ఇక మీ చావు మీరు చావండి, ప్రేక్షకుల దయ, మీ ప్రాప్తం… వాళ్లను ఎంటర్‌టెయిన్ చేయండి… మెప్పు పొందండి, వాళ్ల వోట్లేస్తే పాస్, లేకపోతే ఫెయిల్ అని చెప్పేశాడు… బాగుంది… 

లేకపోతే ఆ నామినేషన్ల ప్రక్రియ పేరుతో ఏందేదో మాట్లాడి ప్రేక్షకుల బుర్రలు ఫ్రై చేసి తినేసేవాళ్లు… థాంక్ గాడ్… అసలే బిగ్‌బాస్ టైం మారింది… అదేదో కొత్త సీరియల్ కోసం రాత్రి 9.30 మార్చి, దొంగరాత్రి పదిగంటలకు స్టార్ట్ చేస్తున్నాడు… ఐనా ఎప్పుడొస్తేనేం లెండి… రేటింగ్స్ వచ్చేదేమీ లేదుగా… ఏదో వీకెండ్ షోలకు కాస్త రేటింగ్స్, వీక్ డేస్‌లో దేకినోడు ఎవడు..? 

ప్రేక్షక దేవుళ్ల దయ పొందండి, టాస్కులు నేను చెబుతా, మీరు ఆడండి, ఇక ఎవరికెన్ని వోట్లు వేసి గట్టెక్కిస్తారో ప్రేక్షకుల ఇష్టం అన్నాడు కదా బిగ్‌బాస్… అన్నట్టుగానే ‘రాజు-రాజ్యం’ అనే టాస్క్ అప్పగించాడు… అంటే బజర్ మోగినప్పుడల్లా రాజు మారుతూ ఉంటాడు… తన తలపై కిరీటం ఉన్నంతసేపు హౌస్‌లో తనదే రాజ్యాంగం, తను చెప్పిందే రూల్… బిగ్‌బాస్ రూల్స్ కూడా బ్రేక్ చేయొచ్చు… నిజానికి వినోదం పంచడానికి మంచి ఛాన్స్…

సొహెయిల్ ఫస్ట్ రాజు అయినప్పుడు… సరదాసరదాగా అందరినీ ఆటపట్టిస్తూ… అరియానా అయితే జోవియల్‌గా తీసుకుంటుంది కాబట్టి ఆమెను కాస్త ఎక్కువ ఆటపట్టిస్తూ… వినోదాన్ని పంచాడు… కానీ అదే సొహెయిల్… హారిక రాణిగా ఉన్నప్పుడు చిన్న చిన్న ఇగో ఇష్యూస్‌తో గేమ్ కంపు కంపు చేసేశాడు… కోపం… అఖిల్‌పై అసహనం… (బహుశా ఇక్కడ బిగ్‌బాస్ టీం స్క్రిప్టు ఏమైనా పనిచేసిందో ఏమో…) హారిక సరదాగా డీల్ చేయలేక దాన్ని మరింత పెంట పెంట చేసింది… అఖిల్ సరేసరి… 

తను రాజుగా ఉన్నప్పుడు అరియానాను బాగా ఆటపట్టిస్తుంటే… ఆమె అంతే సరదాగా ఎంటర్‌టెయిన్ చేసింది… రియల్లీ… రాబోయే రోజుల్లో హారిక ఉంటుందా..? అరియానా ఉంటుందా అనే డౌట్ ఎవరికైనా ఉంటే అది ఈరోజుతో తీరినట్టే… హారిక అట్టర్ ఫ్లాప్ షో… అరియానా అదరగొట్టేసింది… ఆ పనిచేయి, ఈ పనిచేయి అని సొహెయిల్ ఆదేశాలు జారీచేస్తుంటే… లోలోపల విసుక్కుంటూనే… పైకి మాత్రం ‘‘నేడు మీదీ- రేపు మాదీ’’ అని పాడుతూ… (పాత సినిమాలో మీకు మీరే, మాకు మేమే అనే పాట ట్యూన్ తెలుసు కదా… సేమ్…) మరోసారి ‘జింతాకుజితాజితా జింతాతతా’ అని ఆడి చూసిస్తూ… బిడ్డా… నాకు నెత్తిపైకి కిరీటం రాకపోదు, ఇంతకింతా చూపించకపోను అని సరదాగా బెదిరిస్తూనే… పర్‌ఫామ్ చేసింది… గుడ్… 

తను ఈరోజు బిగ్‌బాస్ కెమెరాతో ఆత్మఘోషను చెప్పుకుంది… ‘‘4 వేల జీతంతో మొదలుపెట్టాను… మాంచి మేన్షన్ హౌస్, ప్యాలెస్‌లో ఉండాలనే కల… అదిక్కడ నెరవేరింది… ఇన్నిరోజులు మహారాణిలా ఉన్నాను ఇక్కడ, నేను నేనేనా..?’’ అంటూ చెప్పుకుంది… అది ప్రేక్షకుల కోసమే లెండి… మరీ సింపతీ పొందే ప్రయత్నంగా కూడా అనిపించలేదు… ఆమె నిజంగానే మొదట్లో ఉన్న అరియానా కాదు… ఇప్పుడు కరడుగట్టి పోయింది… టాప్ ఫైవ్‌కు తగిన కంటెస్టెంటును అని మరోసారి ప్రూవ్ చేసుకుంది… 

అభిజిత్ రాజు గేమ్‌లో నిరాశపరిచాడు… తనకు ఇలాంటివి చేతకావు… అఖిల్ ఏమో మంత్రిగా ఫెయిల్… కానీ తను పాసయినా, ఫెయిలయినా నష్టం లేదు, లాభం లేదు… ఆల్ రెడీ ఫైనలిస్టు కదా… రోజు మొత్తం మోనాల్ దేభ్యం మొహం వేసుకుని కనిపించింది… ఉందా లేదా అన్నట్టుగా… మొత్తానికి ఈరోజు అరియానాకు కలిసొచ్చిన రోజు… వోట్లు పెంచే రోజు… అదే అవినాష్‌కూ ఆమెకూ తేడా… ఆమె రోజురోజుకూ ఆటలో మెళకువ గ్రహించి, ఒక్కో మెట్టూ ఎక్కుతూ పోయింది… అవినాష్‌కు అది చేతకాక… హౌస్ వదిలి వెళ్లిపోయాడు…!!

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • మందుపాట ఘంటసాల పాడితేనే కిక్కు… వైరాగ్యపు మత్తు…
  • సినిమాకు ఓ లేఖ ప్రాణం… ఆ లేఖ దగ్గరే తప్పుదొర్లితే…? అదే సీతారామం…!!
  • నిత్యమేనన్ చేసిన తప్పు…! ఆరేళ్ల క్రితమే వాడి వీపు పగలాల్సింది…!!
  • సింహాలు అమ్మబడును…! దివాలా తీసిన పాకిస్థాన్ సర్కారు పొదుపుపాట్లు..!!
  • నేషనల్ హెరాల్డ్ కేసు ప్రభావం వచ్చే కర్నాటక ఎన్నికల మీద…!
  • బాబ్బాబు… ప్లీజ్… మీరు వస్తుండండి..? పోనీ, నన్నే హైదరాబాద్ రమ్మంటారా..?!
  • టీవీ ప్రేక్షకుల్ని ఈటీవీ, మల్లెమాల పిచ్చోళ్లను చేసి, వెక్కిరించడమే ఇది…!!
  • మిస్సింగ్ గరల్ నంబర్ 166… తొమ్మిదేళ్ల ఓ అన్వేషణ కథ… ఓ పోలీస్ గ్రేట్‌నెస్…
  • ఓహ్… ఆత్రేయ రాసిన ఆ బర్త్‌డే పాటలో అంత ఫిలాసఫీ ఉందా..?
  • హీరోయిన్ కాదు, లేడీ డాన్… మాఫియా క్వీన్… గంగూబాయ్ మీద ఓ రీలుక్…!

Archives

Copyright © 2022 · Muchata.com · Technology Support by CultNerds IT Solutions