Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆచార్యా.., తమరు ఏ పాత్ర తీసుకున్నా సరే.., బీభత్సమేనా..?!

January 29, 2021 by M S R

టీజర్, ట్రెయిలర్… ఏ పేరయితేనేం… టీవీ ప్రోగ్రాముకు ప్రొమోలాగా… అవేమీ ‘ఉడికిన మెతుకులు’ కావు అన్నం మొత్తాన్నీ అంచనా వేయడానికి… జస్ట్, అవి ఇంట్రడక్షన్స్… సినిమా లైన్‌ను లీలగా చెప్పే సూచికలు… అంతే… రాంగోపాలవర్మ ట్రెయిలర్లు వేరు, అవి సినిమాను సగం చూపిస్తయ్… అసలు సినిమా చూడకపోయినా పర్లేదు, కాదు, చూడనక్కర్లేదు… చూడొద్దు కూడా… అవి ట్రెయిలర్ల కాన్సెప్టు, స్పిరిట్‌కే రివర్స్ ఫార్ములా అన్నమాట… ఇప్పుడు చిరంజీవి కొత్త సినిమా ఆచార్య టీజర్ రిలీజ్ చేశారు… ఇంతటి వయోభారంలో కూడా ఓ కుర్రహీరో తరహాలో… ఇంతటి కరోనా భయాల్లో సైతం ఇంకా ఇంకా చెమటోడుస్తున్న చిరంజీవిని చూసి అభినందించాలో… ఈరోజుకూ తన ఇమేజీని సొమ్ము చేసుకోవడానికి, ఫిట్‌గా కనిపించడానికి ఒళ్లు వంచుతున్న తీరుకు ప్రశంసించాలో…. ఇంత విపరీతంగా సంపాదించుకున్నాడు కదా, కనీసం ఇప్పుడైనా ఆ బీభత్స హీరోయిజానికి భిన్నంగా కాస్త ఉదాత్తమైన నాలుగు పాత్రలు పోషించవచ్చు కదా అని నిర్లిప్తంగా పెదవి విరవాలో అర్థం కాదు…

తన ఎంట్రీకి ముందు ఎన్టీయార్, ఏఎన్నార్ తదితర యాక్టర్లు ఇలాగే ఏజ్ బార్ యంగ్ వేషాలు వేస్తూ.., ఆ విగ్గులు, ఆ జారే పాంట్లు, ఆ మెడ ముడతలు కనిపించకుండా కవరింగులతో… వీరోయిన్లతో స్టెప్పులకు నానా తిప్పలూ పడేవాళ్లు… చిరంజీవి యంగ్, ఎనర్జిటిక్ యాక్షన్, ఆ జుట్టు, ఆ డాన్సు, ఆ లుక్కు చూసి చాలామంది అభిమానులు అయిపోయారు తనకు… హీరోగా మస్త్ బిల్డప్పు పెరిగీ పెరిగీ.., రొటీన్, ఫార్ములా పాత్రల్లో ఒదిగీ ఎదిగీ.., తనలోని మంచి నటుడిని మరే ఇతర ప్రయోగాత్మక పాత్రలు చేయకుండా చంపేసుకుని… ఈరోజుకూ స్టిల్ అదే బీభత్సమైన హీరోయిజం… రక్తాలు, పెద్ద పెద్ద గొడ్డళ్లతో నరకడాలు… ఆచార్య టీజర్ చూడగానే మరొక్కసారి జాలేసింది…

acharya

మొన్న రవితేజ పోస్టర్ కనిపించింది… పెద్ద గన్ను పట్టుకుని లుక్కు… తెలుగు హీరోలేనా..? ఇండియన్ హీరోలంతా ఇంతేనా..? పెద్ద పెద్ద గన్నులు (పెద్ద సుత్తి) పట్టుకుని, యాక్షన్‌లోకి దిగితే… రౌడీలు గాలిలో తేలిపోతూ ఉంటారు… ఒక బాలయ్య అయితే చెప్పనక్కర్లేదు… మరీ రాజమౌళి, బోయపాటి తదితర దర్శకులకయితే కొత్త కొత్త ఆయుధాలు క్రియేటివ్‌గా రూపొందించి మరీ హీరోలకు ఇస్తుంటారు… అది ప్రేక్షకులకు నచ్చుతుందని కావచ్చు, లేక తమలోని ఏదో పర్వర్షన్‌కు అవి ప్రతీకలు కూడా కావచ్చు… తెలుగు హీరో అంటే నెత్తురు పారాల్సిందే… తెర ఎర్రగా మెరుస్తూ, పచ్చినెత్తురు వాసన థియేటరంతా పాకిపోవాల్సిందే… అది హీరోయిజం… మనవాళ్లకు తెలిసిన హీరోయిజం… ఫాఫం…

ఫైట్లేనా..? నో… చివరకు ఆ ఆదిశంకరుడి పాత్ర పోషించినా సరే… ఈ దిక్కుమాలిన స్టెప్పులు వేసి ప్రేక్షకులను అలరించాల్సిందే… లేకపోతే ఫార్ములా ఒప్పుకోదు… ఇమేజీ చంపేసిన హీరోకు తప్పదు… మంజునాథ సినిమాలో అంతేగా… చిరంజీవి శివుడు మీనా పార్వతితో స్టెప్పులు వేశాడు… స్టయిల్, లుక్కు, డ్రెస్సుల విషయంలో కూడా కాంప్రమైజ్ కావొద్దు… అదేదో మృగరాజు సినిమాలో అంతే… అంజి సినిమాలో కూడా అంతేగా… చివరకు ఆదిమమానవుడి పాత్ర వేసినా సరే, అదిరిపోయే డ్రెస్సులు, సమకాలీన ట్రెండీ లుక్కులు ఉండాల్సిందే… మొన్నటికిమొన్న చిరంజీవి ఇమేజీకి తగినట్టు నరసింహారెడ్డి పాత్రను ఎన్ని వంకర్లు తిప్పారో చూశాం కదా… చిరంజీవి ఒకవేళ గాంధీ పాత్ర పోషిస్తే..? అప్పుడెలా..? హహహ… అంతేలెండి… శుభలేఖలు, అభిలాషల నాటి చిరంజీవి కాదు కదా…!!

ఈ ఆచార్య టీజర్ చూస్తే… అదే బీభత్సమైన ఓ గొడ్డలి… త్రిశూలంతో హింస… నెత్తురు… సేమ్, ఓ హీరోయిక్ లుక్కు కోసం ప్రయాసలు… సో, ఖైదీ నంబర్ 150 తరహాలో… అమ్మడూ కుమ్ముడూ టైపు సాంగ్సు కూడా ఉంటాయనే అనుకోవాలి… ఉండాలి, ఉండకపోతే అంతటి వెటరన్ స్టార్ హీరో సినిమాల బిజినెస్ లెక్కలు డిస్టర్బ్ అవుతాయి… పైగా వీలయితే పదీపదిహేను భాషల్లో రిలీజ్ చేసేయాలి… ఆ ఒరిజినల్ వచ్చిన భాష మినహా… ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఎట్సెట్రా.,. మామూలు వ్యాపారమా ఇది..? అందుకని లెక్కప్రకారం స్టెప్పులు, ఫైట్లు, ఇప్పటి ఫార్ములా కుర్ర హీరోలకు దీటుగా లుక్కు తప్పవు… మీరు కానివ్వండి సార్… అవునూ, మీ తమ్ముడి వెంట నిలబడతానూ అన్నారట కదా… సోము వీర్రాజు, నాదెండ్ల మనోహర్‌ చెబుతున్నారు… అటు తను, ఇటు తమరు చకచకా పదీపన్నెండు సినిమాలు ఇలా ‘కుమ్మిపారేస్తే’… తరువాత జనంలోకి వచ్చి ఇంకా కష్టపడాల్సి ఉంటుందేమో…!!

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • రంగమార్తాండ సినిమాలో కృష్ణవంశీ ఎక్కడెక్కడ రాంగ్‌స్టెప్స్ వేశాడంటే..?!
  • ధమాకా, ఖిలాడీ మూవీల కంబైన్డ్ కిచిడీ… విష్వక్సేనుడి దాస్‌కాధమ్కీ…
  • Rangamarthanda… ప్రకాష్‌రాజ్ ‘అతి’… బ్రహ్మానందం పర్‌ఫెక్ట్… రమ్యకృష్ణ వోకే…
  • రంగు సోడాల కడుపులు కొట్టి… ఆర్గానిక్ షర్బతుల పనిపట్టి… కూల్‌డ్రింక్స్ రసాయనదాడి…
  • ఢిల్లీ టు మద్రాస్… గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో రెండు రోజుల ప్రయాణం…
  • FingerTip… సోషల్ మీడియా కోట శ్రీనివాసరావును చంపేశాక ఇది గుర్తొచ్చింది…
  • ఈసారి ఉగాది టీవీ షోస్… పులుపు లేని చింత, తీపి లేని బెల్లం, చేదెక్కువ వేప్పువ్వు…
  • 186 అమెరికన్ బ్యాంకులు దివాలా దిశలో… అగ్రరాజ్యంలో ఆర్థిక సంక్షోభం…
  • థూమీబచె… ఎంతకు తెగించార్రా… ఇది ఉగాది స్పెషల్ షో అట..!!
  • కన్నతల్లికి మళ్లీ కల్యాణం… పెళ్లీడుకొచ్చిన కొడుకులే ఈ పెళ్లికి పెద్దలు…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions