కనీసం అయిదారుగురు కూడా చూడరు, ప్రత్యేకంగా బులెటిన్లట, రుద్దుతారట, ఊరుకునేది లేదు, మీ బీజేపీ సంస్కృతిని రుద్దకండి అని కస్సుమన్నాడు వెంపీ వెంకటేశన్… ఇది దేశ సమైక్యతకు విఘాతం అనేశాడు స్టాలిన్ అయితే… ద్యా- వుడా..?

అసలు సంస్కృతం అంటే ఒక భాష… దానికీ బీజేపీకి ఏం సంబంధం..? దాని మీద బీజేపీకి గానీ ఆర్ఎస్ఎస్‌కు గానీ పేటెంట్ రైట్స్ ఉన్నాయా..? అసలు సంస్కృతానికీ సంస్కృతికీ లింకేమిటి…? దానికీ హిందుత్వకూ లంకె ఏమిటి..? పైగా హిందూ ధర్మానికి బీజేపీ ఏమైనా హక్కుదారా..? మళ్లీ ఈ మాటంటే బాగుండదు సుమా, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద హిందువులు వేరే పార్టీల్లో ఉన్నారు, లీడ్ చేస్తున్నారు… ఈ డీఎంకే బుర్రలకు తెల్వదు, మొత్తుకోదు…

అవునూ, సంస్కృత భాషను మాతృభాషగా చెబుతున్నఆఫ్టరాల్ 24 వేల మంది కోసం బులెటిన్లు దేనికి అని అడుగుతున్నారు కదా… ఆఫ్టరాల్ అయిదారుగురు కూడా చూడని బులెటిన్ దేనికి అంటున్నారు కదా… మరి ఆ ఆఫ్టరాల్ పనికిరాని అంశం మీద ఈ రచ్చ దేనికి బ్రదర్స్..? ఎవరూ చూడని ఆ చానెల్‌లో ఏదో ప్రసారం చేస్తే… అది ఏదో పార్టీ సంస్కృతిని రుద్దడం ఎలా అవుతుంది..? రుద్దాలని బలంగా సంకల్పం, కుట్ర గనుక ఉంటే… ట్రాయ్ ద్వారా ప్రతి న్యూస్ చానెల్ తప్పకుండా సంస్కృత బులెటిన్ ప్రసారం చేయాలని… డీఎంకే వాళ్ల సన్ టీవీ సహా… ఆదేశాలు జారీచేసేవాళ్లు కదా…!!

పొరపాటున స్టాలిన్, మమత వంటి వీర హిందుత్వ వ్యతిరేక నేతలు ఈ పిడివాదాన్ని మానేస్తే… ముందుగా బాధపడేది మోడీయే… తనకు వీళ్లే కదా అమితమైన బలం…! మోడీకి కూడా తెలియని బోలెడు పేటెంట్ రైట్స్ వెతికి మరీ కట్టబెట్టేది వాళ్లే కదా…!!