Muchata.com Telugu Latest News

Muchata.com Provided Telugu Latest News, Political News , Political News, Breaking News in Telugu LIVE ముచ్చట

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏది అసలు..? ఏది నకిలీ..? ఓ మహాత్మా..!

January 9, 2021 by M S R

సీన్ ఒన్
———

ఐ టీ అధికారుల బృందం:- హలో! ఎవరండీ ఇంట్లో? మేము రియల్ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్లం. ఇది మా ఐ డి కార్డు. ఇది నోటీసు. తలుపులు తెరవండి. కిటికీలో నుండే ఎంత సేపు మాట్లాడతారు?

ఇంటి యజమాని:- ఊరుకోండి. మాకు తెలియదా? మేము న్యూస్ ఛానల్స్ చూడమా? మా అమ్మాయి గూగుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోన్ నంబర్ పట్టుకుంది. ఆమెతో కనుక్కుని కన్ఫర్మ్ అయితే తలుపు తీస్తాం.

బృందం:- మీరు కొరివితో తల గోక్కుంటున్నారు. మసబ్ ట్యాంక్ ఇన్కమ్ టాక్స్ టవర్ నుండి నేరుగా వస్తున్నాం. తలుపు తెరవకపోయారో…?

యజమాని:- ఒకసారి అందరూ కిటికీ ముందు మొహాలు కనపడేలా నిలుచోండి. ఫోటో తీసి పోలీసులకు పంపి, వాళ్లు కన్ఫర్మ్ చేస్తే అప్పుడు తలుపులు తీస్తాం.

బృందం:- ఏం? తమాషాగా ఉందా? ఆరేళ్లపాటు పెనాల్టీలతో పాటు కట్టించుకుంటాం. ఇల్లు వాకిలి అమ్ముకోవాల్సి వస్తుంది.

యజమాని:- అయ్యా, మీరు నిజమైన వారయితే- నిజంగా ఎలాగూ గోళ్లూడగొట్టి పన్నులు వసూలు చేస్తారు. నలుపు ఉంటే పట్టుకుంటారు. తెలుపు అయితే వదిలేస్తారు. నలుపును తెలుపు చేసి ఉంటే తెలుసుకుంటారు. కానీ- మీరు నకిలీ అయితే మేము కిడ్నాప్ కావడానికి సిద్ధంగా లేము.

బృందం:- ?????

fake

సీన్ టు
———

యజమాని:- హలో పోలీస్ కంట్రోల్ రూమ్! ఇక్కడ మా వీధి చివర బట్టల షాపులో నలుగురు సఫారీ డ్రెస్సులు, ఖాకీ డ్రెస్సులు కొంటున్నారు. మీరు అర్జంటుగా వచ్చి కిడ్నాప్ జరగకుండా రక్షించండి.

కంట్రోల్ రూమ్:- ?????

సీన్ త్రీ
——–
తాగుబోతు:- ఒరేయ్ బుజ్జి! ఆడు మగాడ్రా! నాలుగు డ్రస్సులు అద్దెకు తీసుకుని ఊరి మధ్యలో కిడ్నాప్ చేశాడంటే… ఐ డి కార్డులు, ఫైళ్లు, నోటీసులు, వెహికిల్స్, నంబర్ ప్లేట్లు.. ఆడు మగాడ్రా!

మరో తాగుబోతు:- నేను కూడా ఇక ఈ చిల్లర దొంగతనాలు వదిలేసి నకిలీ ఐ టీ రైడ్స్ ప్రొఫెషన్లోకి వెళుతున్నా.

మొదటి తాగుబోతు:- ?????

సీన్ ఫోర్
———

ప్రొఫెషనల్ ఫేక్ కోచింగ్ సెంటర్ లో క్లాసు జరుగుతోంది. ఫేక్ మెంటార్ ఔత్సాహిక ఫేక్ విద్యార్థులకు ఫేక్ మెళకువల పాఠం చెబుతున్నాడు.

మన శరీరం, రంగు, భాష, చదువును బట్టి ఏ నకిలీ వృత్తికి సరిపోతామో మనకు మనమే ఒక క్లారిటీకి రావాలి. ఒకసారి నకిలీ ప్రొఫెషన్ ను ఖరారు చేసుకున్న తరువాత ఆ పాత్రలోకి మనం పరకాయ ప్రవేశం చేయాలి. అసలు వాళ్లే మనల్ను అనుకరించడానికి పోటీలు పడాలి.

సీన్ ఫైవ్
———

నేటి వార్తలు:-

అసలు పోలీసులను చితకబాదిన నకిలీ పోలీసులు.
అసలు ఐ టీ అధికారి ఇంటిపై నకిలీ ఐ టీ గ్యాంగ్ దాడి.
అసలు డాక్టరుకు గుండె ఆపరేషన్ చేసిన నకిలీ డాక్టర్…. By…. పమిడికాల్వ మధుసూదన్

Follow Us


Share this Article


Search On Site

Advertisement

Latest Articles

  • కరోనా రావచ్చు పోవచ్చు… కానీ కరోనా ట్యూన్ మాత్రం చస్తే వదలదు…
  • ఓహ్ బేబీ రజినీ చాంది..! నెట్ ట్రోలర్స్‌కు దొరికింది తాజా ‘ఏజ్ బార్ బకరీ’..!
  • ఫేస్‌బుక్ వేదికగా ఈ కలెక్టర్‌కు వేలాది మంది విభిన్న వీడ్కోలు..!
  • 2021లో మహావిపత్తులు..? డోన్ట్ వర్రీ..! ఆ రాతలన్నీ చదివి నవ్వుకొండి..!
  • చదివితే సింగిల్ కాలమ్ వార్త… వార్తాంశంలోని స్పూర్తి అంతులేనంత…!
  • సుమ..! కేవలం సోలో షో..! కాదంటే ఫ్లాపే… ఇదీ తాజా ఉదాహరణ…!!
  • KCR వేస్ట్, వేస్టున్నర… సరే… కానీ అది తేల్చాల్సింది ఈ దరిద్రపు సర్వేనా..?!
  • కంగనా భలే ఎంపిక..! ఆమె ఆ క్వీన్ కేరక్టరే ఎందుకు తీస్తున్నదంటే..?
  • కరోనా అనువాద వాణిజ్య ప్రకటనల్లో హాస్యం బాగా పండును…!
  • ‘చిన్నమ్మ పథకం’… సమయానికి జగన్‌ను గోమాతలా ఆదుకుంది…!

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now