Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కాంగ్రెస్‌ పీకేను ఎందుకు వద్దనుకుంది..? పీకే వ్యాపార ప్రణాళిక తల్లకిందులు..!!

April 26, 2022 by M S R

ఇటు కాంగ్రెస్, అటు టీఆర్ఎస్ శ్రేణుల్లో పెద్ద ఎత్తున అయోమయానికి, గందరగోళానికి కారకుడైన ప్రశాంత్ కిషోర్…. ఒకేసారి అనేకానేక పడవుల మీద ప్రయాణించాలని అనుకున్నాడు… జాతీయ స్థాయిలో ఒక పార్టీకి వ్యూహకర్తగా వర్క్ చేయాలంటే చాలా కమిట్మెంట్ కావాలి, ప్రేమ కావాలి, కానీ పీకే వంటి వ్యాపారి ఒక చట్రంలో ఇమడాలని ఎందుకు అనుకుంటాడు… దీనికితోడు మాకు పనిచేయాలనుకుంటే ఇతర పార్టీలతో కటీఫ్ అయిపో అని కాంగ్రెస్ నిర్మొహమాటంగా చెప్పింది…

పీకే వ్యవహార ధోరణి ఎలా ఉంటుందో కాంగ్రెస్‌కు కొత్తేమీ కాదుగా… అందుకే ముందే రెస్ట్రిక్షన్స్ పెట్టింది… దాంతో పీకేకు దిక్కుతోచలేదు… చాలా గిరాకీ ఉంది, మరి ఒకే కస్టమర్‌కు ఎలా పరిమితం అవుతాడు..?! నిజానికి కాంగ్రెస్ లేకుండానే ఓ ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు చేయాలని విశ్వప్రయత్నం చేశాడు, కానీ అది బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం అయ్యే చాన్స్ లేదని పలు పార్టీలు నిరాకరించడంతో మెల్లిగా కాంగ్రెస్ వైపు కన్నుకొట్టడం స్టార్ట్ చేశాడు..

తెలంగాణ సంగతే తీసుకుందాం… ఇటు టీఆర్ఎస్‌కు, అటు కాంగ్రెస్‌కు ఒకేసారి పనిచేయడం ఎలా సాధ్యం..? వ్యూహకర్త క్రెడిబులిటీ మాటేమిటి..? గోప్యత మాటేమిటి..? ఒకేసారి ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులకు ఒకే వ్యక్తి యుద్ధవ్యూహాలు విశ్వసనీయంగా ఎలా ఇవ్వగలడు..? అందుకే కాంగ్రెస్ నిర్మొహమాటంగా తేల్చేసింది… టీఎంసీ, వైసీపీ, డీఎంకే, శివసేన, టీఆర్ఎస్‌లతో కుదిరే, కుదిరిన ఒప్పందాలను వదిలేయాలని… కాంగ్రెస్ లో చేరాలని సూచించింది… ఇటు కాంగ్రెస్ అసమ్మతులతో మాట్లాడుతూ, మరోవైపు రాత్రే కేసీయార్ విందు తీసుకుని, ప్రగతిభవన్‌లో పడుకుంటే రెండు పార్టీల శ్రేణులకు ఏం సందేశం వెళ్తుంది..?

పీకే కాంగ్రెస్ కోసం పనిచేస్తాడు, పీకే సంస్థ ఐప్యాక్ మాకోసం పనిచేస్తుందని టీఆర్ఎస్ ముఖ్యనేతలు చేసిన ప్రకటనలు మరింత గందరగోళానికి తెరతీశాయి… అందుకే రెండు పార్టీలు విలీనం అవుతున్నాయా..? రెండు పార్టీలకు ఎన్నికల పొత్తు ఉంటుందా..? కేసీయార్‌కు అంత అవసరం ఏముంది..? అసలు పీకే బీజేపీ కోసం పరోక్షంగా పనిచేస్తున్నాడా..? వంటి బోలెడు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి… దొరికింది చాన్స్ అనుకుని బీజేపీ కూడా ఆ రెండు పార్టీల కలిసి నడవబోతున్నాయంటూ ప్రచారం ప్రారంభించేసింది… ఈ నేపథ్యంలో ఏకసమయంలో ఈ పార్టీలన్నింటికీ ‘‘వ్యూహాలు అనే సరుకు’’ సప్లయ్ చేయడం సాధ్యం కాదని, కాంగ్రెస్ ఒప్పుకోదని పీకేకు కూడా అర్థమైంది…

Following a presentation & discussions with Sh. Prashant Kishor, Congress President has constituted a Empowered Action Group 2024 & invited him to join the party as part of the group with defined responsibility. He declined. We appreciate his efforts & suggestion given to party.

— Randeep Singh Surjewala (@rssurjewala) April 26, 2022

మేమే వద్దన్నాం అని చెప్పకుండా… ఎఐసీసీ కూడా చాలా మర్యాదగా పీకే తమ ఆఫర్‌ను నిరాకరించాడని ప్రకటించింది… పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ట్వీట్ చేశాడు… నిజానికి సోనియా గాంధీ పీకే సేవలు వాడుకోవాలని సీరియస్‌గానే భావించింది… పార్టీకి ఓ కొత్త దిశ, కొత్త పయనం తప్పదనీ, లేకపోతే ఇంకా పార్టీ దెబ్బతినే ప్రమాదముందనేది ఆమె ఆందోళన… కానీ దేశంలో ఎలక్షన్ స్ట్రాటజీలపై వర్క్ చేసే గ్రూపులు ఇంకా ఉన్నయ్… పీకే ఇప్పుడు పాపులర్ హీరో మాత్రమే… అంతకుమించిన నటులున్నారు… వాటిని పట్టుకోవడంలో కాంగ్రెస్ కోర్ టైం ఫెయిల్యూర్ కనిపిస్తోంది… మొత్తానికి ఈ విషయంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం కరెక్టే అనిపిస్తోంది…!!

pk

ఇదీ పీకే ప్రకటన… దూరం జరుగుతూ జరుగుతూ ఓ మాటన్నాడు… నిజం… ఏమాటకామాట నిష్ఠురంగానే ఉన్నా నిజం చెప్పాడు… కాంగ్రెస్‌కు కావల్సింది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్‌లు కాదు, కాదు… పార్టీకి ఓ బలమైన నాయకత్వం కావాలి…!!

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • మందుపాట ఘంటసాల పాడితేనే కిక్కు… వైరాగ్యపు మత్తు…
  • సినిమాకు ఓ లేఖ ప్రాణం… ఆ లేఖ దగ్గరే తప్పుదొర్లితే…? అదే సీతారామం…!!
  • నిత్యమేనన్ చేసిన తప్పు…! ఆరేళ్ల క్రితమే వాడి వీపు పగలాల్సింది…!!
  • సింహాలు అమ్మబడును…! దివాలా తీసిన పాకిస్థాన్ సర్కారు పొదుపుపాట్లు..!!
  • నేషనల్ హెరాల్డ్ కేసు ప్రభావం వచ్చే కర్నాటక ఎన్నికల మీద…!
  • బాబ్బాబు… ప్లీజ్… మీరు వస్తుండండి..? పోనీ, నన్నే హైదరాబాద్ రమ్మంటారా..?!
  • టీవీ ప్రేక్షకుల్ని ఈటీవీ, మల్లెమాల పిచ్చోళ్లను చేసి, వెక్కిరించడమే ఇది…!!
  • మిస్సింగ్ గరల్ నంబర్ 166… తొమ్మిదేళ్ల ఓ అన్వేషణ కథ… ఓ పోలీస్ గ్రేట్‌నెస్…
  • ఓహ్… ఆత్రేయ రాసిన ఆ బర్త్‌డే పాటలో అంత ఫిలాసఫీ ఉందా..?
  • హీరోయిన్ కాదు, లేడీ డాన్… మాఫియా క్వీన్… గంగూబాయ్ మీద ఓ రీలుక్…!

Archives

Copyright © 2022 · Muchata.com · Technology Support by CultNerds IT Solutions