…. ముచ్చట ఎక్స్ క్లూజివ్ ….
ఎస్, ప్రధాని మోడీతో ఏపీ సీఎం ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, కరవుసాయం, రైల్వే డివిజన్ వంటి పదీ పన్నెండు అంశాలపై ప్రత్యేకంగా మొన్న భేటీ అయ్యారు… కదా, అందరికీ తెలుసు కదా… తరువాత మీడియాతో మాట్లాడుతూ రాజ్యసభ సభ్యత్వంపై మోడీ అడగలేదని చెప్పాడు… తను అడగలేదు కాబట్టి ఇక ఆ ఆబ్లిగేషన్ ఏమీ లేదన్నట్టు మాట్లాడాడు… దాంతో మీడియా మొత్తం టీడీపీని బీజేపీ సీటు అడగలేదని, ఇక ఏపీలో మూడో రాజ్యసభ సీటుకు సైతం చంద్రబాబు పోటీపెడతాడని ఊహాగానాలు రాసేసుకుంది… ఇప్పటిదాకా ఏపీ కోటాలో రాజ్యసభలో ఉన్న నిర్మలమ్మకు ఇక ఎక్కడా అకామిడేట్ చేయకపోవచ్చుననీ, ఆమెను తిరిగి పార్టీ అధికార ప్రతినిధిగా ఉంచేస్తారనీ అంచనాలూ రాసేసుకుంది మీడియా… అయితే….
బీజేపీ అత్యున్నత వర్గాల సమాచారం మేరకు… పార్టీలో ఈ విషయంలోనూ చర్చ జరిగింది… వారంతా చంద్రబాబు తీరుపై విస్తుపోయారు… ఇదేం వైఖరి అంటూ విసుగు చెందారు… ఎందుకంటే… మొన్న జరిగిన మీటింగు పూర్తిగా అధికారికం… ఒక ప్రధానికీ, ఒక ముఖ్యమంత్రికీ నడుమ జరిగిన రాజకీయేతర భేటీ… అది ఏ ముఖ్యమంత్రి కలిసినా జరిగేదే… కేసీయార్ తోనూ భేటీ జరిగిన సంగతి తెలుసు కదా… కానీ చంద్రబాబు తనను అడగలేదు కాబట్టి ఇక పార్టీ మూడో సీటు తమకు ఇవ్వాలని అడగనట్టే అని తనకుతానే ఓ నిర్ణయానికి రావడం పట్ల బీజేపీ నాయకులు ఆశ్చర్యపోతున్నారు… ఇదీ నిజం…
వైసీపీ నుంచి ఎవడైనా టీడీపీలో చేరుతున్నాడంటే, ఆ చేరిక మీటింగు ఏర్పాట్లను కలెక్టర్ పర్యవేక్షిస్తాడు ఏపీలో… సీఎంవోలో కూర్చుని చంద్రబాబు పార్టీ చేరికల వ్యూహాలు రచిస్తుంటాడు.,.. చర్చిస్తుంటాడు… కానీ తనకు తెలియనిదీ, బీజేపీ ఆచరించేదీ ఒకటుంది… పార్టీ వేరు, ప్రభుత్వం వేరు… అన్నీ కలిగలిపే చంద్రబాబుకు అది అర్థం కాలేదు… కాదు కూడా.,..
బీజేపీ తరఫున ఎవరెవరిని రాజ్యసభలో అకామిడేట్ చేయాలో పార్టీ నిర్ణయం తీసుకుంటుంది… అది ప్రధాని కార్యాలయంలో జరగదు… పార్టీ ఆఫీసులో జరుగుతుంది… దాన్ని బట్టి ఆచరణ ఉంటుంది… చంద్రబాబును ఇప్పటి సీటును అలాగే కంటిన్యూ చేయండని అడగాలా, వద్దా? ఎవరు అడగాలి? అనేది పార్టీపరంగా జరిగే ప్రక్రియ… ఏ ప్రకాష్ జవదేకరో వస్తాడు దాని గురించి… అంతేతప్ప ప్రధాని మోడీ ఓ అధికారిక భేటీలో చంద్రబాబును పట్టుకుని మాకు ఈసారి కూడా రాజ్యసభ సీటు ఒకటివ్వాలి గురూ అని అడగడు… అదీ సంగతి… ఇదీ ఓ సీనియర్ మోస్ట్ బీజేపీ నేత విశ్లేషణ… ఈ చిన్న లాజిక్కు చంద్రబాబు ఎందుకు మిస్సయినట్టు…?
ఒకవైపు కర్నాటకలో వెంకయ్యను తిరిగి బీజేపీ తరఫున అకామిడేట్ చేయవద్దంటూ భారీ ఎత్తున విద్యావేత్తలు, మేధావులు, వృత్తినిపుణులు, విద్యార్థులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు… అందుకని ఆయన్ని కర్నాటక నుంచి గాకుండా మరో రాష్ట్రం నుంచి అకామిడేట్ చేస్తారు… అంతకుమించి ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనేంత సీన్ కూడా లేదు… ఇక ఏపీ నుంచి ఎవరిని అకామిడేట్ చేయమంటారో ఇంకా బీజేపీ పార్టీ తేల్చుకోలేదు… అదీ అసలు సంగతి!