అయోధ్య తీర్పును కాంగ్రెస్ ఆహ్వానించింది… ఇకనైనా రాముడి గుడి పేరిట బీజేపీ నడిపించే వోట్ల రాజకీయానికి తెరపడుతుందని ఆశపడింది… అది కాంగ్రెస్ పొలిటికల్ లైన్… ఇప్పటికే హిందువుల మద్దతును గణనీయంగా కోల్పోయిన కాంగ్రెస్‌కు తిరిగి హిందువుల మద్దతు సంపాదించడం అనేది కష్టసాధ్యం అవుతున్నది… ఈ స్థితిలో పార్టీ హైకమాండ్ ఆచితూచి వ్యవహరిస్తున్నది… హిందువుల సెంటిమెంట్లు దెబ్బతినే వ్యాఖ్యల జోలికి వెళ్లడం లేదు… ఆర్టికల్ 370 మీద పార్టీ తీసుకున్న స్టాండ్ దానికి బాగా నష్టమే చేకూర్చింది… మరి పార్టీ మీడియా ఎంత జాగ్రత్తగా ఉండాలి…? అయోధ్య తీర్పు రాగానే నేషనల్ హెరాల్డ్‌లో ఓ వ్యాసం కనిపించింది… ‘‘అయోధ్యలో హిందూ భక్తుడు ప్రార్థన ఎందుకు చేయకూడదు..?’’ అని హెడ్డింగ్ పెట్టింది.., ‘‘అయోధ్య తీర్పు పాకిస్థాన్ సుప్రీంకోర్టును గుర్తుచేస్తున్నట్టుగా ఉంది…’’ అన్న కంటెంటు పైన కనపిస్తున్న ఫోటోలో చూడొచ్చు, ఇది సదరు వెబ్‌సైట్ ఆర్టికల్ స్క్రీన్ షాట్…
ఆ వ్యాసం నిజానికి మీడియా సొంత ఆర్టికల్ కాదు… ఆకార్ పటేల్ అనే ఓ వివాదాస్పద రచయిత ఒపీనియన్… ఆ కేటగిరీ కిందే పబ్లిష్ చేశారు… కానీ అదీ కాంట్రవర్సీయే… ‘‘భారత న్యాయవ్యవస్థను పాకిస్థాన్‌తో పోల్చడం అంటే ఇండియా సుప్రీం కోర్టును కించపరచడమే… ఒకవైపు అయోధ్య తీర్పును స్వాగతిస్తూ కాంగ్రెస్ ఇలాంటి వ్యాసాలతో దేశంలో ఘర్షణలను క్రియేట్ చేయాలని అనుకుంటున్నది… సోనియా క్షమాపణ చెప్పాలి…’’ అంటూ ఈ ఆర్టికల్‌పై బీజేపీ కస్సుమన్నది…
నిజంగానే అభ్యంతరకర వ్యాసం… సుప్రీం తీర్పు మొదటి నుంచీ బీజేపీ, వీహెచ్‌పీ కోరుకుంటున్నట్టుగానే ఉందని వ్యాఖ్య ఉంది ఆ వ్యాసంలో… అంటే సుప్రీం కోర్టు తీర్పుకు మోటివ్స్, పక్షపాతాన్ని, రాజకీయముద్రను, మతం ముద్రను అంటగట్టడమే… అది భారతీయ చట్టాల రీత్యా తక్షణం సదరు వ్యాసరచయితను జైలులో వేయొచ్చు… వేరే మీడియా సంస్థలు కూడా నేషనల్ హెరాల్డ్ వ్యాసాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ధోరణిపై వార్తలు రాశాయి… దీంతో అబ్బెబ్బే, అది ఓ వ్యాసరచయిత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే… అది కాంగ్రెస్ వైఖరి కాదు అని నేషనల్ హెరాల్డ్ చెంపలేసుకుంటూ ఓ క్షమాపణను పబ్లిష్ చేసింది… ఇలా…
ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించాలని నేషనల్ హెరాల్డ్ వెబ్‌సైట్ కోరింది… ఆకార్ పటేల్ వ్యాసాన్ని డిలిట్ చేసేసింది… ఒకప్పుడు సైనికపాలకుడు ముషారఫ్ హయాంలో పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్లాగే అయోధ్య తీర్పు ఉందని చెప్పడం ద్వారా… పాకిస్థాన్ సుప్రీంను వెకిలి చేస్తూనే దానితో పోల్చి ఇండియన్ సుప్రీంకోర్టును అవమానించినట్టుగా ఆ వ్యాసం కంటెంట్ ఉండింది… ఇలాంటి అభ్యంతరకరమైన శైలిని సదరు మీడియా ఎలా అనుమతించింది..? ఎలా జనంలోకి తీసుకొచ్చింది..? అసలు ఆకార్ పటేల్ వ్యాసాలే అలా ఉంటయ్… ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థకు ఇండియా బాధ్యుడు… ఇది భారత జాతి వ్యతిరేక సంస్థగా బీజేపీ మొదటి నుంచీ ముద్ర వేస్తున్నది… 2016లో బెంగుళూరులో ఎబీవీపీ చేసిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది… 2018లో ఈడీ అధికారులు దాడులు చేసి, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నట్టుగా కనిపెట్టింది… కాంగ్రెస్ తన నాయకులపై, తన సంస్థలపై, తన మీడియాపై తనే కంట్రోల్ కోల్పోతే మరింత నష్టపోవడం ఖాయం… ఇదే తాజా ఉదాహరణ….