Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆహా… బీజేపీకి స్టార్ లీడర్లు భలే దొరికారు బాసూ.,. ఈమె మరీ అల్టిమేట్…

January 28, 2021 by M S R

నిజంగా జనంలోకి వెళ్లి, పార్టీకి కొత్త జవసత్వాల్ని తీసుకొచ్చే ఒక్క నాయకుడూ బీజేపీ వైపు రావడం లేదు… ఏపీ, తెలంగాణ, తమిళనాడు… ఎట్ లీస్ట్, ఈ మూడు రాష్ట్రాల్లో ఓసారి చూద్దాం…! బలం, బలగం కలిగి రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి ఓ ఊపు తీసుకొచ్చేవాళ్లు బీజేపీ మీద ఆసక్తి చూపడం లేదా…? ఆల్‌రెడీ పాతుకుపోయినవాళ్లు రానివ్వడం లేదా..? సరే, వాటిని వదిలేస్తే విజయశాంతి, ఖుష్‌బూ, జీవిత, యామిని… ఇలాంటోళ్లేనా చివరకు బీజేపికి దిక్కు..? ఫాఫం..! అసలే జనసేనతో పొత్తులు, ఆపై ఇలాంటి నామ్‌కేవాస్తే కేరక్టర్లు… ఎన్నో ఏళ్లుగా బీజేపీని అంటిపెట్టుకుని, త్యాగాలు చేసి, నష్టపోయి, జెండా మోసిన వాళ్లకే చిరాకెత్తి, థూమబచె అని తిట్టేసుకుంటున్న పరిస్థితి… ఇప్పుడు మాధవీలత అనే ఓ సినిమా కేరక్టర్ సంగతి కూడా ఓసారి చూద్దాం…

madhavi

పార్టీకి నయాపైసా ఉపయోగం లేదు ఈమెతో… పార్టీలో ఎందుకున్నదో పార్టీకి తెలియదు, ఆమెకు కూడా తెలియదు… పైగా సోషల్ మీడియాలో మిడిమిడిజ్ఞానం ప్రదర్శిస్తూ, పిచ్చి పోస్టులు పెడుతూ… ఫాఫం, పార్టీకి ఏమైనా ఇమేజ్ అంటూ ఉంటే, దాన్ని కూడా కడిగేస్తుంది ఈమె… ఆమె పోస్టులకు విపరీతమైన ట్రోలింగు కూడా ఉంటుంది… అదే రేంజులో ఈమె రిప్లయ్స్ ఇస్తూ పెట్రోల్ పోస్తూ ఉంటుంది… బూతులు యథేచ్ఛగా దొర్లిపోతుంటూ ఉంటయ్… సరే, ఆ కంపు చాటింగ్, ట్రోలింగుల బాగోతాన్ని పక్కన పెడితే, ఈమె తాజాగా ఏం చేసిందంటే..? 56 లక్షల లైక్స్ ఉన్న ఫేస్‌బుక్ పేజీని వదిలేసింది… థూ, ఈ 90 శాతం నెగెటివిటీని భరించడం నావల్ల కాదు అని తేల్చేసింది… ఇక్కడ కూడా ఆమె తన పిచ్చి ధోరణిని వదిలిపెట్టలేదు… ఎందుకంటే..?

‘ప్రియమైన ఫాలోవర్స్‌.. నా ఫేస్ బుక్‌లో నెగిటివిటీకి పూర్తిగా విసుగుచెందాను. దాదాపు 90 శాతం మంది నాపై నెగిటివ్‌గానే స్పందిస్తున్నారు. ఈ సమాజానికి ఫేక్ అండ్ ప్లాస్టిక్ నవ్వులే కావాలి. నేను అలా ఉండలేను. ఈరోజు నుంచి నా ఫేస్ బుక్‌ని నేను హ్యాండిల్ చేయడం లేదు. ఇకపై నా టీం హ్యాండిల్ చేస్తుంది. ఏదైనా ముఖ్యమైన సమాచారం ఉంటే ఇంట్రాక్ట్ అవుతాను. నన్ను అభిమానించే వాళ్లు ప్రేమకు సపోర్ట్‌కి చాలా థాంక్స్. ఇకపై ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్‌లో అందుబాటులో ఉంటా…’ ఇదీ ఆమె పోస్టు… హహహ… నెగెటివిటీ అనేది ట్విట్టర్‌, ఇన్‌స్టాలలో లేదా..? అవి సోషల్ మీడియా వేదికలు కావా..? సంయమనం, విజ్ఞత అనేవి మనవైపు ఉండాలి… పైగా నువ్వు గాకుండా నీ టీం మెయింటెయిన్ చేయడం దీనికి పరిష్కారమా..? అదెలా..? నువ్వు ఆ పేజీలోకి రావడం మానస్తే, ఈ 56 లక్షల మందీ రారు, వాళ్లకు అక్కరలేదు… మరెందుకు ఈ నిర్ణయం..? ఫాఫం, బీజేపీకి ఎలా నాయకురాళ్లు దొరికారో కదా…!!

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • రంగమార్తాండ సినిమాలో కృష్ణవంశీ ఎక్కడెక్కడ రాంగ్‌స్టెప్స్ వేశాడంటే..?!
  • ధమాకా, ఖిలాడీ మూవీల కంబైన్డ్ కిచిడీ… విష్వక్సేనుడి దాస్‌కాధమ్కీ…
  • Rangamarthanda… ప్రకాష్‌రాజ్ ‘అతి’… బ్రహ్మానందం పర్‌ఫెక్ట్… రమ్యకృష్ణ వోకే…
  • రంగు సోడాల కడుపులు కొట్టి… ఆర్గానిక్ షర్బతుల పనిపట్టి… కూల్‌డ్రింక్స్ రసాయనదాడి…
  • ఢిల్లీ టు మద్రాస్… గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో రెండు రోజుల ప్రయాణం…
  • FingerTip… సోషల్ మీడియా కోట శ్రీనివాసరావును చంపేశాక ఇది గుర్తొచ్చింది…
  • ఈసారి ఉగాది టీవీ షోస్… పులుపు లేని చింత, తీపి లేని బెల్లం, చేదెక్కువ వేప్పువ్వు…
  • 186 అమెరికన్ బ్యాంకులు దివాలా దిశలో… అగ్రరాజ్యంలో ఆర్థిక సంక్షోభం…
  • థూమీబచె… ఎంతకు తెగించార్రా… ఇది ఉగాది స్పెషల్ షో అట..!!
  • కన్నతల్లికి మళ్లీ కల్యాణం… పెళ్లీడుకొచ్చిన కొడుకులే ఈ పెళ్లికి పెద్దలు…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions