Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

header-new-unit-muchata.com
  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఉండవల్లీ..! జగన్ నిన్ను రానివ్వడు…! ఇంకెక్కడికీ నువ్వు పోలేవు..!!

January 12, 2021 by M S R

ఏపీ రాజకీయాల్లో కొందరు ఉంటారు… కొందరు కేఏపాల్ వంటి విదూషకులుగా నవ్విస్తుంటారు… సబ్బం హరి వంటి ఆస్థాన విద్వాంసులుగా ఇంకా బాగా నవ్విస్తారు… కానీ ఉండవల్లి వంటి నేతలు కూడా ఇప్పుడు కాస్త నవ్విస్తున్నారు… తను ఏ పార్టీయో తెలియదు, తను పెట్టే ప్రెస్‌మీట్ల పరమార్థం, ప్రయోజనం ఏమిటో తెలియదు… అప్పుడే ‘‘ఏమోయ్ జగనూ, ఫో, వెళ్లి మోడీని నిలదియ్, పోలవరం సంగతేమిటో అడుగు, ఏం, చేతకాదా..? కేసుల భయంతో వదిలేస్తవా… ఆయ్ఁ…’’ అని డిమాండ్ చేస్తాడు… ఇప్పుడేమో ‘‘అబ్బే, గుళ్లపై దాడులపై జగన్ తప్పేమీ లేదోయ్… ఆ దుష్ట మోడీ, నిక‌ృష్ట బాబులే కొత్త పాలిటిక్స్ మొదలుపెట్టారు’’ అని అచ్చం జగన్‌లాగే మాట్లాడతాడు… ఆయన ఏం చెప్పినా, ఎంత చెప్పినా జగన్ మళ్లీ దగ్గరకు రానివ్వడు… జగన్ ఫ్యాన్స్ తనను నమ్మరు… ఈయన ఏదో ఒకటి మాట్లాడుతూ నవ్వు పుట్టిస్తూనే ఉంటాడు… వైఎస్ చెప్పగానే ఈనాడు మీద, రామోజీ మీద ఫైట్ చేసిన ఈ పాత పందెం కోడిని చూస్తే ఈమధ్య కాస్త జాలి కూడా వేస్తోంది… ఎందుకంటే..? 

Undavalli

మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉన్నట్టు కనిపించడు… వర్తమాన రాజకీయాల తీరుకు అక్కరకు రాడు… తన మాటల్లో చాలావరకూ నిజాలే ఉంటయ్… వ్యక్తిగా మెచ్చదగినవాడే… గుడ్డి తెలంగాణ ద్వేషం… గుడ్డి బీజేపీ ద్వేషం… ఉంటే ఉండనివ్వండి.., కానీ బీజేపీలోకి పోలేడు, టీడీపీ తనకు సూట్ కాదు, కాంగ్రెస్ లేకుండాపోయింది, జగన్ రానివ్వడు… లెఫ్ట్ పడదు… మరి ఈ ప్రెస్‌మీట్ల పర్పస్ ఏమిటి..? తనకైనా అర్థమవుతుందా అనేదీ డౌటే… 

నిన్న ఓ ప్రెస్‌మీట్ పెట్టాడు… ఏమంటాడంటే..? 

1.నేను రాష్ట్రంలో ఉండే అన్ని గుళ్ల‌కు త‌ర‌చూ వెళుతుంటా. ఆరుసార్లు అయ్య‌ప్ప‌మాల వేసుకొని.. రెండుసార్లు మాల మేయ‌కుండానే పంబ వెళ్లా… (నీ ఇష్టం, ఎవరొద్దన్నారు..? ఏళ్ల తరబడీ అలా వెళ్లేవాళ్లున్నారు… నేనూ భక్తుడినే అని చెప్పదలుచుకున్నవ్, అంతేకదా, ఇక కానివ్వు…)

2.ఈ రోజు (జ‌న‌వ‌రి 12) స్వామి వివేకానందుడి పుట్టిన‌రోజు. నేను అన్ని మ‌తాల‌ను గౌర‌విస్తా… చ‌ర్చి, మ‌సీదుల‌కు వెళ‌తాను..` అని వివేకానంద చెప్పాడు. ఇండియాకు వ‌చ్చి స‌హాయం చేయాల‌ని క్రిస్టియ‌న్ మిష‌నరీస్‌ను వివేకానందుడు.. అమెరికా వెళ్లిన స‌మ‌యంలో కోరారు…. మ‌తం అంటే న‌మ్మ‌కం. అన్ని మ‌తాల‌ను గౌరవించాలని వివేకానందుడు చెప్పాడు. (వోకే, ఇంతకీ ఏమంటావ్..? మోడీ, అమిత్ షా వివేకానందుడి బాటలో నడవాలంటావ్, అంతేకదా… వాళ్లు తమ లీడర్ అద్వానీనే వదిలేశారు, వివేకానందుడు ఎందుకు వాళ్లకు..?)

3.ఎవ‌రెవ‌రు ఏ దేవుడిని పూజించాలో.. ఆ దేవుడిపై భ‌క్తి క‌లిగించేది నేనే` అని కృష్ణుడు భ‌గ‌వ‌ద్గీత‌లో చెప్పాడు… (నిజమే… ఎవరి మతం వాళ్లు పాటిస్తే ఎవరు వద్దన్నారు ఇప్పుడు..?) 

4.హిందువుల్లో అగ్ర‌కులాల వారు.. వెన‌క‌బ‌డిన కులాల‌ను చిన్న‌చూపు చూడ‌టం వ‌ల్లే.. వారు క్రిస్టియానిటీ వైపు వెళ్లారు. ఇప్పుడు స‌మాజంలో చాలా మార్పులు వ‌చ్చాయి. మ‌త మార్పిడులు జ‌ర‌గ‌డం లేదు… (నిజమే… జరగాల్సినంత జరిగిపోయింది, ఇంకేమీ మిగల్లేదు అంటావా..? ఆ చంద్రబాబు అనవసరంగా మా జగన్‌ను ఆడిపోసుకుంటున్నాడు గానీ, కొత్తగా మత మార్పిళ్లకు చాన్స్ లేదు, కాబట్టి బాబు చెప్పేది అబద్ధం అంటవ్, అంతేనా..?)

5.నిజం చెప్పేవాడే బ్రాహ్మ‌ణుడు. క‌ర్మ‌ను బ‌ట్టి వ‌ర్ణం. అంతే కానీ.. జ‌న్మ‌ను బ‌ట్టి కాదు… (అరెరె.., మతం నుంచి కులం వైపు వచ్చిందేమిటి చర్చ అకస్మాత్తుగా…)

6.వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి వాళ్ల తాత క్రిస్టియానిటీ తీసుకున్నారు. కానీ.. ఆయ‌న హిందూ దేవాల‌యాల‌కు వెళ‌తారు. అక్క‌డ పూజారులు చెప్పిన ప్ర‌కారం పూజ‌లు చేస్తారు… (సో, జగన్ పుట్టుకతో క్రైస్తవుడు, సోవాట్ అంటావా..? లేక హిందూ దేవుళ్లను కూడా ప్రేమించే కుటుంబం అని చెప్పదలిచావా..?)

7.జగన్ బాబాయ్ అయిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నన్ను మించిన హిందువు. ఆయ‌న భార్య‌.. గోమాత‌కు పూజ చేసి కానీ… రోజువారీ కార్య‌క్ర‌మాలు ప్రారంభించ‌దు…. (అవును, కానీ మధ్యలో ఈ సుబ్బారెడ్డి, ఆయన భార్య ఎందుకొచ్చారు ఇప్పుడు చర్చలోకి..?) 

8.హిందుత్వ అనే పుస్త‌కం రాసిన వీర్ సావ‌ర్కర్‌కు దేవుడంటే న‌మ్మ‌కం లేదు… (అందుకని బీజేపీ వాళ్లు అర్జెంటుగా సావర్కర్ మీద నిషేధం పెట్టుకోవాలంటావా సారూ..?)

9.మ‌హ‌మ్మ‌ద్ అలీ జిన్నా పూర్వీకులు హిందువులు. వాళ్ల తాత పేరు ప్రేమ్‌జీ భాయ్‌ ఠక్కర్‌ ఓ రాజ్‌పుట్, వాళ్ళు అంతా శాకాహారులు. అయితే టక్కర్ చేప‌ల వ్యాపారం చేసేవారు. అందుకే.. ఆయ‌న్ని ఆ కులం నుంచి వెలేశారు. తరువాత అయన మనో వేదనతో మ‌ర‌ణించారు. ఆ కోపంతో.. జిన్నా వాళ్ల నాన్న ఇస్లాం స్వీక‌రించారు… (జిన్నానైనా సరే, మనం అసహ్యించుకోకూడదు అని చెప్పడానికి, ఆయన తాతలు హిందువులే అని గుర్తుచేయాలా..?)

10.ప్రపంచంలో ఎక్కువ మంది ఆచ‌రించేది క్రిస్టియానిటీ. త‌రువాత ఇస్లాంను అనుస‌రిస్తారు. త‌న‌ను తాను తగ్గించుకున్న‌వాడు.. హెచ్చించ‌బ‌డును.. త‌న‌ను తాను హెచ్చించుకున్నవాడు.. త‌గ్గించ‌బ‌డును` అని జీసస్ క్రైస్ట్ చెప్పారు… (నిజమే కదా… ప్రేమించదగిన సూక్తి…)

11.రైల్లో గొడ్డు మాంసం ర‌వాణా చేస్తున్నార‌ని మొన్నామ‌ధ్య కొంత మందిని చంపేశారు. బీఫ్ ఎగుమ‌తుల్లో మ‌న‌దేశం మూడో స్థానంలో ఉంది. బీఫ్ ఎగుమ‌తుల‌ను అరిక‌ట్ట‌కుండా ఆరేళ్లుగా మోడీ ఏం చేస్తున్నాడు? (ఇంతకీ బీఫ్ ఆపేయాలని నీ డిమాండా..? మోడీకి చేతకాదని ఫిర్యాదా..? లేక బీఫ్ వివాదమే వేస్ట్ అనదలుచుకున్నావా..?)

12.ప్ర‌తి సీఎం మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌నుకుంటాడు కాబ‌ట్టి.. మ‌త మార్పిడులు.. మ‌త క‌ల‌హాల‌ను ప్రోత్స‌హించ‌డు. ఆల‌యాల‌పై దాడులు స‌హించ‌డు. (సో, జగన్ తప్పేమీ లేదు అంటావ్…? అది నిజమే గానీ భయ్యా, ఇప్పటివరకు ఇన్ని సంఘటనలు జరిగితే ఒక్కడినైనా పట్టుకుని, ఫలానావాళ్లు చేయించారు, ఫలానా కారణంతో చేయిస్తున్నారు అని చెప్పించలేదేం..? అదెందుకు అడగవు జగన్‌ను..?)

13. ప్రపంచంలోని మిలిటరీ మొత్తం దింపినా గుళ్లకు రక్షణ కల్పించలేం… (అది సరే గానీ సారూ… మరి ఇన్నాళ్లూ జరగలేదేం..? ఇక గాలికి వదిలేసినా పర్లేదులే అంటావా..?)

14.జగన్ ఎలాంటి మత మార్పిడులు చేయడం లేదు… మతం ఎవరూ ఊరికే మారరు కాబట్టి మత మార్పిడులు అనేది తప్పు… సీఎం, హోం మినిస్ట‌ర్‌, డీజీపీలు క్రిస్టియ‌న్లు అన‌డం చంద్ర‌బాబు తప్పు… (హమ్మయ్య, చంద్రబాబు దగ్గరకు వచ్చావు ఎట్టకేలకు… ఊఁ, కానివ్వు…)

15.తిరుపతి ఎన్నికల కోసం.. భ‌గ‌వ‌ద్గీతకు‌, బైబిల్‌కు, కృష్ణుడికి జీసస్ కు పోటీ అని బీజేపీ ప్రచారం చేస్తోంది. ఇది చాలా త‌ప్పు… ఎవ‌రో.. ఆల‌యాల‌పై దాడులు చేస్తుంటే.. రాజ‌కీయాల కోసం బీజేపీ పాకులాడుతోంది…. (హమ్మయ్య, ఇంత సోదీ చెప్పింది ఇది ఆరోపించడానికేనా..? వాళ్లు అడుగుతున్నదీ అదే… ఆ దాడులు చేస్తున్నది ఎవరూ, ఎందుకూ అని..? అది తప్ప, నువ్వు ఇన్ని విషయాలు చెప్పావు… ఎందుకు బాలరాజూ..? బీజేపీ మతరాజకీయాల్ని తిట్టాలంటే ఇంత సుత్తి, ఉపోద్ఘాతం అవసరమా..? ష్, మనలోమనమాట… జగనే ఇప్పుడు యాంటీ-బీజేపీ కాదు… నువ్వు బీజేపీని తిట్టిపోస్తూ జగన్ స్టాండ్ తీసుకోవడంతో ఏం సుఖం సారూ..? లాజిక్ ఎక్కడో తేడా కొట్టినట్టుగా లేదా..?) 

Follow Us


Share this Article


Search On Site

Advertisement

Latest Articles

  • ఆన్‘లైన్’ తప్పిన చదువులు… చక్కబడే ‘సిగ్నల్సే’ కనిపించవు…
  • తూచ్ మోడీ సాబ్… టీకా ఫోటోల్లో తమిళ టచ్ మిస్సయ్యింది భయ్యా…!!
  • ఫాఫం అనసూయ..! ఆ పాట షాక్ నుంచి ఫ్యాన్స్ తేరుకోలేదు ఇంకా..!!
  • చివరకు పీకే కూడా..! రూపాయి జీతం అంటేనే ప్రపంచంలోకెల్లా బిగ్గెస్ట్ జోక్…
  • మీనా మేకప్పుపై ట్రోలింగ్..! ఆ దృశ్యం ఒప్పుకోదని చెప్పినా వినలేదుట..!!
  • అసలే ఇది మనోభావాల సీజన్… పొగరు అంటే కుదరదు కదా..? ‘కట్’ చేశారు..!!
  • దృశ్యం సినిమాకు ఇది మరోవైపు దృశ్యం..! ఇదో డిఫరెంట్ (రి)వ్యూ..!!
  • టార్గెట్ అంబానీ…! కేవలం మనీ కోసమేనా..? అంతటి మొసాద్‌కూ చిక్కని క్లూ..!!
  • కాక పెరుగుతోంది..! కానీ ఎవరు గెలిస్తే ఎవరికేం ఫాయిదా..?!
  • మట్టి మోసం చేయదు… ఉప్పెనలో తేలిపోయిన ఊక, ఉప్పు… అసలు కథ ఇదీ…

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now