చూశారు కదా ఇవన్నీ… అర్థం కాలేదా..? #6MonthsFailedCMJagan అనే హ్యాష్ ట్యాగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోర్న్ ఖాతాలలో కూడా కనిపిస్తున్నది… అదేమిటి..? (వీలైనంతవరకూ అశ్లీలం కనిపించకుండా ఎడిట్ చేశాం ఈ ఫోటోలు… ఐనా అక్కడక్కడా అసభ్యంగా ఏమైనా కనిపిస్తే క్షమించాలి…) విషయం ఏమిటంటే…? జగన్ ఆరు నెలల పాలన పూర్తయ్యింది కదా… ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా జగన్ పాలన వైఫల్యాలపై ఓ సీరిస్ స్టార్ట్ చేసింది… ఈనాడు ఒకటీ అరా రాసినట్టుంది… కాకపోతే మరీ అంత దూకుడుగా కాదు… ఇక వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం జగన్ విజయాలపై క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది… సహజం కదా…
తెలుగుదేశం పార్టీ ఊరుకోదు కదా… అది అధికారికంగా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా #6MonthsFailedCMJagan పేరిట క్యాంపెయిన్ పెద్ద ఎత్తున స్టార్ట్ చేసింది… జగన్ వచ్చాక ఏమేం ఆపేసాడు, మూసేసాడు, రద్దు చేసాడు, కూల్చేసాడు, వెనక్కు పంపేశాడు, చేతులెత్తేసాడు, తాకట్టు పెట్టాడు, ముంచేసాడు, మాయ చేసాడు పేరిట కొన్ని స్లయిడ్స్ రూపొందించి సోషల్ మీడియాలోకి పుష్ చేసింది తెలుగుదేశం సోషల్ మీడియా వింగ్… ఇలా అనేకం…
సరే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ అది అధికార పక్షం వైఫల్యాలను ప్రచారం చేస్తుంది కదా… సహజమే… అయితే జగన్ బ్యాచ్ క్యాంపెయిన్‌కన్నా టీడీపీ బ్యాచ్ క్యాంపెయిన్ కాస్త తక్కువగా క్లిక్కయింది… అంతగా జనంలోకి వెళ్లలేదు… అసలు ట్విట్టర్ ఖాతాలు, హ్యాష్ ట్యాగ్ వైరల్ చేయడం అంటేనే ఓ పెద్ద దందా… ఫేస్ బుక్‌లో కూడా… డబ్బులు చెల్లిస్తే వెంటనే ఆయా సోషల్ మీడియా ప్లాట్ ఫారాలు వాటిని స్పాన్సర్ చేసి, బోలెడు సైట్లలోకి, ఖాతాల్లోకి పుష్ చేస్తాయి… తద్వారా ట్రెండ్ చేస్తాయి… కానీ టీడీపీ కాస్త ఎక్కువ డబ్బు పే చేసినట్టుంది… దాంతో ట్విట్టర్ వాడు అంతే ఉత్సాహంగా ఏ విచక్షణ లేకుండా ట్రెండింగు దందాలోకి దిగిపోయినట్టున్నాడు… ఎంతగా అంటే..? పోర్న్ సైట్లు, ఖాతాల్లోకి ఆ హ్యాష్ ట్యాగ్ రన్ అవుతున్నా పట్టించుకోనంతగా… అదండీ సంగతి… ఇదీ వైసీపీ, టీడీపీ నడుమ జరుగుతున్న డిజిటల్ వార్… ఇవి గాకుండా రెండు బ్యాచుల ఫ్యాన్స్ తమ తమ ఖాతాల ద్వారా చేస్తున్న ప్రచారం, కౌంటర్లు, దూషణలు సరేసరి… ఎటొచ్చీ ఇక్కడ మనం చెప్పుకునేది ఏమిటయ్యా అంటే..? ఈ డిజిటల్ వార్ ఎటెటో తిరిగి ఏవేవో బూతు ఖాతాల దాకా విస్తరించిన తీరు..!!