Sridhar Bollepalli……… మా బళ్లో పిల్లోడొకడు మొన్నొకరోజు బడికి రాలేదు. తెల్లారి క్లాసులో అడిగా “ఏరా నిన్న రాలేదేం” అని. వాడు సమాధానం చెప్పలేదు. అందరికన్నా పొట్టిగా, సన్నగా వుంటాడు, కానీ మహా కోతి. దురదృష్టవశాత్తూ ఇలాంటి కోతులే పరీక్షల్లో ఫస్టొస్తూ వుంటారు. వీడు కూడా ఈ ఫినామినాని జస్టిఫై చేయగల క్యాటగిరీకి చెందినవాడే అయివుండడం చేత, మా పంతుళ్లందరి చేతా కాస్త పేంపర్ చేయబడుతూ వుంటాడు. మళ్లీ అడిగాను వాడిని “నిన్నేరా అడిగేది, వై డిడింట్ […]