Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిజమే… ఐటీ ప్రపంచంలో ఆంథ్రోపిక్ ఎఐ ప్రకంపనలు షురూ…

February 8, 2026 by M S R

.

ఇండియాలో ఓ తండ్రి… అమెరికాలో ఓ కొడుకు… ‘ఏమిట్రా, అసలే ఎఐ థ్రెట్, పైగా ఇప్పుడు ఆంథ్రోపిక్ అట… అసలు ఈ ఐటీ కొలువులు ఉంటాయా..? మీరు ఇండియాకు అన్నీ సర్దుకుని వచ్చినా సరే, ఇక్కడ కొలువులు కూడా ఉండవ్, మరెలా..?

‘ఏ రంగమైనా కాలానుగుణ సవాళ్లు ఉంటయ్ నాన్నా… అప్‌డేట్ అయితే ఉంటాం, లేకపోతే మునిగిపోతాం… కాకపోతే ఒకటి మాత్రం నిజం… ఎఐతో సగం ఉద్యోగాలకు పనిలేకుండా పోయింది… టెస్టింగ్ మన్నూమశానం ఎఐకి అప్పగించేశాం… మిగిలిన సగంలో మరో సగం ఆంథ్రోపిక్‌కు అప్పగిస్తాం… లెటజ్ ఫేస్, లెటజ్ వెయిట్…’ అన్నాడు ఆ కొడుకు…

Ads

ఓ భయానక స్థితి… లోలోపల అందరికీ మెసులుతూనే ఉంది భయం… నిజం, ఇప్పటికే కోడ్ రాయడం మరిచిపోయారు ఐటీ ఇంజినీర్లు… రేప్పొద్దున ఎర్రర్స్ కనిపెట్టడం, కోడింగ్, అవసరాలకు అనుగుణమైన సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ రూపకల్పన అన్నీ ఆంథ్రోపిక్ చేసేస్తే మరిక ఐటీ ఉద్యోగులు ఏం చేయాలి…? సింపుల్…

మూటాముల్లె సర్దుకోవాలి… అనేక దేశాల్లో బతుకుతున్న మన ఐటీ జనం ఏం కావాలి..? ఇండియాకు వచ్చేస్తే ఏముంది ఇక్కడ..? మన కోట్ల జనాన్ని బతికిస్తున్నది జస్ట్ ఐటీ… అదే దెబ్బతింటే..? పెద్ద ప్రశ్న..! ఇన్ని లక్షలు, ఇన్ని కోట్ల కొలువుల వేరే ఫీల్డ్ ఏముందని..?

మొన్నటిదాకా ఓ కాన్ఫిడెన్స్… ఎఐ ప్లాట్‌ఫారమ్స్ తప్పులు చేస్తున్నాయనీ, మనిషిని అది దాటిపోలేదని… కానీ గ్రాడ్యుయల్‌గా ప్రతి ఎఐ ప్లాట్‌ఫారమ్స్ బాగా అప్‌డేట్ అవుతున్నాయి… బేసిక్ ఫ్రీ వర్షెన్లకన్నా పెయిడ్, అప్‌డేటెట్ వర్షెన్లు బాగా పనిచేస్తున్నాయంటున్నారు… ఇంకా డెవలప్ అవుతాయి కూడా… అసలు ఆంథ్రోపిక్ వంటివే వస్తున్నాయి కదా… ఉద్యోగులను మించి పనిచేసేలా…

సో, ఐటీతో పాటు లీగల్, ఫైనాన్షియల్, డేటా రీసెర్చ్, మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్, సేల్స్ లాంటి రంగాల కంపెనీలు, ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనుంది ఆంథ్రోపిక్ వంటి కొత్త సవాళ్ల ద్వారా..! యూఎస్ లోని సిలికాన్ వ్యాలీకి చెందిన ఆంథ్రోపిక్ ఏఐ సంస్థ తన ఏఐ టెక్నాలజీ క్లాడ్ తాజాగా పలు అప్డేట్స్ తీసుకొచ్చాక, ఒక్క రోజులోనే అమెరికా మార్కెట్లో 300 బిలియన్ డాలర్ల సాఫ్ట్‌వేర్ స్టాక్స్ కుప్పకూలగా, భారత ఐటీ రంగంపై కూడా దీని ప్రభావం కనిపిస్తోంది…

ఆంథ్రోపిక్

మరేమిటి ఇప్పుడు..? 
సాఫ్ట్వేర్ రంగం మాయం అవ్వదు, కానీ అది పూర్తిగా ‘ఏఐ-సెంట్రిక్ ‘గా మారిపోతుంది… ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు గట్టెక్కాలంటే కొన్ని మార్పులు తప్పనిసరి… కోడింగ్ రాయడం, నేర్చుకోవడం కంటే, ఏఐతో కోడ్ ఎలా రాయించాలో నేర్చుకోవడం ముఖ్యం… కేవలం ఒకే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కు పరిమితం కాకుండా, సిస్టమ్ డిజైన్, ఏఐ ఇంటిగ్రేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ పై దృష్టి పెట్టాలి…

ఏఐ కోడ్ రాయగలదు కానీ, ఒక బిజినెస్‌కు ఏం కావాలో అర్థం చేసుకునే ‘హ్యూమన్ లాజిక్’ కావాలి… ఆ నైపుణ్యాన్ని పెంచుకోవాలి… మనిషి ఎప్పుడూ మనిషి, మనిషి బుర్రకు తిరుగులేదు, కానీ మనిషే తన బుర్రకు తనే ఎసరు పెట్టుకుంటున్నాడు… అదీ అసలు సమస్య…

ప్రస్తుత ఆందోళన ఏమిటంటే..? వచ్చే 12 నెలల్లో సంప్రదాయ కోడింగ్ మాయం కావచ్చని, ఏఐ ద్వారానే 80 శాతానికి పైగా కోడ్ రాయబడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు… ఆంథ్రోపిక్ కేవలం కోడింగ్ రాయడమే కాదు, క్లిష్టమైన సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ను కూడా స్వయంగా డిజైన్ చేయగలదని నిరూపించింది… సో, ఎఐ మనిషికి అసిస్టెంట్ కాదు ఇప్పుడు… మనిషికి ఐటీరంగంలో ఆల్టర్నేటివ్ అయిపోయింది…

మరి ఈ రంగంలోకి కొత్తగా వచ్చే వాళ్ల పరిస్థితి ఏంటి..? ఇకపై ఐటీ రంగంలోకి అడుగుపెట్టే వారు ‘కోడర్స్’గా కాకుండా ‘సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్’గా మారాలి… కేవలం కోడింగ్ నేర్చుకుని ఉద్యోగం సంపాదిస్తాం అనే రోజులు పోయాయి… ఏఐ టూల్స్ సమర్థంగా వాడుతూ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసే వారికే భవిష్యత్తులో డిమాండ్ ఉంటుంది…

అసలే ఎఐ ఇంపాక్ట్‌తో ఐటీ కొత్త కొలువుల భర్తీ దారుణంగా దెబ్బతిన్నది.,. అనేక కాలేజీల్లో ప్రస్తుతం నో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్… ఉన్న కొలువులే ఊడిపోతుంటే కొత్తవాటి సంగతి దేవుడెరుగు, ఐటీ సీనియర్ల పరిస్థితే దిక్కుతోచకుండా మారిపోనుంది… మరి రేపు..? సమాధానం దొరకని ప్రశ్న ప్రస్తుతానికి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అన్నామలై తగ్గలేదు… తగ్గించబడ్డాడు… నిర్బంధ విరామంలోకి నెట్టబడ్డాడు…
  • అనుకోని ఆఫర్… అమితాబ్‌కు ఆకాశానికి తీసుకుపోయింది…
  • ఏమో… కేసీయార్‌ను కూడా ఇలా చూస్తామేమో… డెస్టినీ వదలదు…!!
  • BBB..! BJP- BRS Bhai Bhai..!! ఏమైనా డౌటా..? పదండి వివరాల్లోకి వెళ్దాం…!!
  • కవిత బాటలోనే కనిమొళి..? ఉదయనిధి వారసత్వంపై అసహనం..!!
  • మైండ్‌లెస్ ట్రోలింగ్..! సౌత్ టాప్ స్టార్ల ‘వేషాలు’ మరిచిపోయారా..?!
  • అప్పుడు ముత్తాత… 92 ఏళ్ల తరువాత ఇప్పుడు మునిమనమడు…
  • మళ్లీ అదే 1956 కథ..? అప్పట్లో బ్రిటన్… ఇప్పుడు అమెరికా..! సీన్ రివర్స్..!!
  • సౌందర్య గణితం..! జయప్రద మొహం కొలతలపై ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్..!!
  • కలికాలం..! మనం కన్నవాళ్లను, మనల్ని కన్నవాళ్లనూ నమ్మలేం..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions