Muchata.com Telugu Latest News

Muchata.com Provided Telugu Latest News, Political News , Political News, Breaking News in Telugu LIVE ముచ్చట

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆలీ పిచ్చికూతలు సరే..! షకీలా ధర్మసందేహం మాత్రం అల్టిమేట్..!

January 20, 2021 by M S R

shakeela

అసలే ఒకప్పటి బోల్డ్ బాంబ్ షకీలా… పక్కన మరో బోల్డ్ డాన్సర్ అనూరాధ.,. అప్పుడప్పుడూ నాలుక అదుపు తప్పే ఆలీ… ఇలాంటివే ఇష్టపడే ఈటీవీ… ఇంకేముంది..? ఏమిటీ స్టార్టింగ్ ట్రబులా..? బండి స్టార్ట్ కాకపోతే వంచి, పడుకోబెట్టి, మళ్లీ కొడతారు తెలుసు కదా…? అంటూ తిక్కతిక్క పంచులు వేశాడు ఆలీ… సింపుల్‌గా షకీలా… ఐనా సరే, నేను రెడీ అనేసేసరికి, అంతటి ఆలీ నోటి వెంట మళ్లీ మాట రాలేదు… రాబోయే ఆలీతో సరదాగా ఎపిసోడ్ ప్రోమోలో […]

అనుకుంటాం గానీ… చాలామంది చంద్రబాబులున్నారు దేశంలో…!!

January 20, 2021 by M S R

tennis cricket

ఆమధ్య కరోనా వేక్సిన్ మీద స్పందిస్తూ… అది బీజేపీ వేక్సిన్, కాషాయ వేక్సిన్, అది వేసుకుంటే మగతనం పోవచ్చు, ఇంకేమైనా జరగొచ్చు, నేనయితే వేసుకోను, నేను అధికారంలోకి వచ్చాక అందరికీ మంచి వేక్సిన్ ఫ్రీగా వేయిస్తా….. వంటి పిచ్చికూతలు కూసిన లీడర్ గుర్తున్నాడు కదా… ఎస్, సమాజ్‌వాదీ పార్టీ అగ్రనాయకుడు అఖిలేషుడు… ఆ స్పందన చదివాక… ఈ ములాయం వారసుడు సీఎంగా అంత పెద్ద రాష్ట్రాన్ని ఎలా పాలించాడుర భయ్ అని చాలామంది ఈసడించుకున్నారు… దానికి తను […]

పాకిస్థాన్ ఇజ్జత్ జప్తు… ఇమ్రాన్‌కు ఇంటాబయటా అన్నీ వెక్కిరింపులే…

January 20, 2021 by M S R

pia

పాకిస్థాన్‌కు వాచిపోయింది… పాకిస్థాన్ పరువు పోయింది… పాకిస్థాన్‌ను చూసి అంతర్జాతీయ సమాజం పడీ పడీ నవ్వుతోంది… అది చైనా జేబులో దేశం……… ఇలాంటివి చదివీ చదివీ అది సిగ్గుపడటం కూడా మానేసింది… అది ఉన్న సిట్యుయేషన్ అది… దివాలాకన్నా దిగువన ఉంది… మరీ నవ్వులపాలైన సంఘటన తాజాగా ఏం జరిగిందంటే..? అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటయ్ ఇలాంటివి… పాకిస్థానీ ఇంటర్నేషనల్ ఎయిర్‌లెన్స్ (పీఐఏ)కు చెందిన ఓ బోయింగ్ విమానాన్ని మలేషియా అధికారులు కౌలాలంపూర్‌లో జప్తు చేసేశారు… ఆల్‌రెడీ […]

పట్టుచీరె కట్టేనా..? నొసటన బొట్టు పెట్టేనా..? వేళ్లకు మెట్టెల మాటేమిటో..?!

January 20, 2021 by M S R

అప్పట్లో ఓ ఫేమస్ పాట… జ్యోతిలక్ష్మి చీరకట్టింది, పాపం… అని ఏదో దాసరి సినిమాలో వినిపించి ఓ ఊపు ఊపింది… నిజానికి ఓ ఇంట్రస్టింగు పాయింటే… ఎప్పుడూ పొట్టి దుస్తులు ధరించి, వయ్యారాలు ఒలకబోస్తూ, డాన్సులు అనబడే గెంతులు వేసి అలరించే ఓ ఐటం నర్తకి అకస్మాత్తుగా సంప్రదాయబద్ధంగా చీరకట్టి కనిపిస్తే ఆశ్చర్యమే కదా… అసలు జ్యోతిలక్ష్మి చీరకట్టడం ఏమిటి అనే ప్రేక్షకుడి ఫీల్ ఆ పాటను అలా పాపులర్ చేసింది… ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే..? […]

ఫ్లెక్సీ లీడర్స్..! వింటారా కలాం చెప్పిన ధావన్ కథ..?

January 19, 2021 by M S R

flexy leaders

అబ్దుల్ కలాం ఎక్కడికి వెళ్లినా విద్యార్థులతో మాట్లాడేవాడు. కారణజన్ముడు కాబట్టి అలా విద్యార్థులతో మాట్లాడుతూ అదే వేదికమీద నిత్య విద్యార్థిగా సాగిన దేహయాత్రకు గొప్ప ముగింపు పలికాడు. నాయకుడికి ఉండాల్సిన లక్షణాల గురించి ఆయన తరచుగా తన అనుభవంలోనుండి ఒక గొప్ప సందర్భాన్ని ఉదహరించేవాడు. సతీష్ ధావన్ జగమెరిగిన అంతరిక్ష శాస్త్రవేత్త. ఆయన పేరే శ్రీహరికోటలో అంతరిక్ష కేంద్రానికి పెట్టారు. ధావన్ నేతృత్వంలో ఒక రాకెట్ తయారీకి శాస్త్రవేత్తలు వందలమంది అహోరాత్రాలు కష్టపడ్డారు. తీరా ఆ రాకెట్ […]

ఔను సారూ… మతమేనా..? కులాన్ని తేల్చే డీఎన్ఏ టెస్టులు కూడా ఉన్నయా..?

January 19, 2021 by M S R

sanjay

‘‘హేమిటీ బండి సంజయ్ భాష…’’ ఈ ప్రశ్నపై మొన్న ఓ పార్టీలో చిన్న డిస్కషన్… అవును మరి, కేసీయార్ నేర్పిన భాషే తన పార్టీ నేతలు మాట్లాడుతున్నారు, వాళ్లకు ఆ భాష తప్ప ఇంకేదీ అర్థమయ్యే స్థితిలో లేరు… వాళ్లకు రేవంతుడు, సంజయుడే కరెక్టు మొగుళ్లు… ఈ జానారెడ్డిలు గట్రా అస్సలు సరిపోరు… తప్పేముంది..? ముల్లుకు ముల్లే కదా సమాధానం అంటూ ఒకాయన సుదీర్ఘంగా డిఫరెంటు వివరణ ఇచ్చాడు… స్థూలంగా చూస్తే, డిబేట్ కోసం వింటే, టెక్నికల్లీ […]

ప్రధాని దాకా కీలక పదవులు… దేశరక్షణకు మాత్రం ముందుకు రారు…

January 19, 2021 by M S R

army

2009లో గుజరాత్ నుంచి మన సైన్యంలోకి చేరినవాళ్ల సంఖ్య 719… ఆ రాష్ట్రానికి అదే రికార్డు… 2008లో, 2007లో జస్ట్ 230 మాత్రమే… పది లక్షల మందికిపైగా ఉన్న భారతీయ సైన్యంలోకి గుజరాతీలు ఎందుకు చేరరు..? ఇదెప్పుడూ ఓ ప్రశ్నే… దేశరక్షణకు ఆ ప్రజలు ఎందుకు ముందుకు రారు..? ఇదెప్పుడూ ఓ విమర్శే… ప్రధాని పదవి దాకా ఎదుగుతారు, కానీ తుపాకీ ఎందుకు పట్టుకోరు..? ఇదెప్పుడూ ఓ పజిలే… గుజరాత్ జనాభాలో, విస్తీర్ణంలో సగం కూడా లేని […]

చింత బరిగెలు, తొడపాశాలు కావు బ్రో… అసలు కథలు వేరే ఉంటయ్…

January 19, 2021 by M S R

jagan shah

‘‘పగటిపూట భేటీ అయితే, మీరు తొడపాశం పెడితే, చింతబరిగెలతో నాలుగు పీకితే, వాతలు పెడితే అందరికీ తెలిసిపోతుంది అని జగన్ ప్రాథేయపడటంతో…. సర్లె అనుకుని అమిత్ షా రాత్రి పదిగంటలకు అపాయింట్‌మెంట్ ఇచ్చాడు… రాజ్యాంగ వ్యవస్థల జోలికి పోవద్దు అంటే విన్నావా..? ఏదో చెప్పావు కదా అని ఆయన్ని ఈశాన్యానికి పంపించేశాం, అయినా తృప్తి లేదా..? చెప్పు, నిమ్మగడ్డ జోలికి వెళ్తావా..? అంటూ చెడామడా తిట్టేశాడు… సార్, సార్, ఈసారికి తప్పుకాయండి ప్లీజ్ అని జగన్ బతిమిలాడాడు… […]

#కాశీలో ఓరోజు… ఆటగదరా శివా…! ‘‘నేనేం తెలుసుకున్నాను’’…

January 19, 2021 by M S R

varanasi

Gottimukkala Kamalakar……………….  కారణం తెలియదు. ఒంటరిగా కాశీవిశ్వేశ్వరుడి దర్శనం చేసుకోవాలనిపించింది. మా ఊరు నెల్లపల్లి మల్లయ్య దేవుడే చెప్పాడో..? వైరాగ్యమే వచ్చిందో..? “సంప్రాప్తే సన్నిహితే కాలే నహినహిరక్షతి..” అని భయమే వేసిందో..? హైదరాబాదు నడిమి తరగతి నడిమి వయసు భవసాగరాలే భయపెట్టాయో..? రెండు వారాల ముందు టిక్కెట్టు బుక్ చేసుకుని, రెండు గంటలు ఎయిర్ పోర్ట్ లో నిరీక్షించి, మరో రెండు గంటల్లో “వారాణసీ పురంపతిం భజ విశ్వనాథం..!” అనుకుంటూ హోటల్లోకి వచ్చేసా..! నిక్కరూ, టీ షర్టూ […]

బెడిసిన మోడీ ప్లాన్స్… శశికళను తొక్కేసి, తనూ మునిగాడు… లక్కీ స్టాలిన్…

January 19, 2021 by M S R

sasikala

తమిళనాట బీజేపీ ఆట పూర్తిగా బెడిసికొట్టింది… తమిళ రాజకీయం బీజేపీకి ఏమాత్రం అంతుచిక్కదని మరోసారి తేటతెల్లం అయిపోతోంది… జయలలిత మరణించాక, అన్నాడీఎంకేను డిస్టర్బ్ చేసి, పొలిటికల్ స్పేస్ క్రియేట్ చేసుకుని, అందులోకి జొరబడాలని ఆలోచించింది కానీ అడ్డంగా ఫెయిలైంది… ఇప్పటికిప్పుడు తను చేయగలిగేది కూడా ఏమీలేదు… ఏబీపీ-సీవోటర్ సర్వే చెబుతున్న నిజమిదే… ఇదేకాదు, ఈ సర్వే ఇంకొన్ని చేదు నిజాల్ని కూడా చెబుతోంది… కాస్త వివరంగా చెప్పుకుందాం… ఈ ఒపీనియన్ పోల్ నిజంగానే క్షేత్ర వాస్తవాన్ని చెబుతున్నదీ అనుకుందాం […]

చంద్రబాబుకు ఈనాడు హితబోధ..! ఆ నీతిబోధకు కొత్త విన్యాసాలు..!!

January 19, 2021 by M S R

ntr

నిన్ననే అయిపోయింది కదా ఎన్టీయార్‌ను స్మరించుకోవడం..! ఆయన మరణానికి ఆంధ్రులంతా ఏడ్చారు, ఆయనకు ద్రోహం చేసినవాళ్లు మరింత బాగా ఏడ్చారు… నిన్న కూడా..! అయితే మనం ఇప్పుడు చెప్పుకునేది ఆయనకు జరిగిన ద్రోహం, ఆయన చరిత్ర, ఆయన ప్రస్థానం, తోపు, శతఘ్ని, ఆత్మగౌరవం, తెలుగు జెండా ఎట్సెట్రా అంశాల గురించి కాదు… ఈనాడులో నిన్న ఒక నాలుగు కాలాల వార్త కనిపించింది… నిజానికి అది వార్త కాదు… ప్రత్యేక కథనం అంతకన్నా కాదు… ప్రకటన అసలే కాదు… […]

వాట్సప్ పట్టిచ్చింది..! టీవీ రేటింగుల దందాలో ఆర్ణబ్ మునిగినట్టే..!!

January 19, 2021 by M S R

barc

నేషన్ వాంట్స్ టు నో అబౌట్ “బార్కింగ్” ———————- NDTV ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్ మిగతా ఛానెల్స్ తో పోలిస్తే ఇప్పటికీ భిన్నమే. ఎంత సీరియస్ విషయాన్నయినా ఒక పరిమితికి లోబడే చర్చిస్తుంది. కొన్ని విలువలు, సంప్రదాయాలను పాటిస్తుంది. యాజమాన్యం రాజకీయ బంధాలు, ఛానెల్లో చైనా పెట్టుబడులు పెట్టినట్లుగా ఆరోపణలు, ఛానెల్ ఆర్థిక వనరుల సమీకరణకు సంబంధించిన కేసులున్నా- ఇప్పటికీ NDTV ముద్ర చెదిరిపోలేదు. రోజూ రాత్రి ఎనిమిదిన్నరకు అరగంటపాటు రియాలిటీ చెక్ పేరిట ఒక బర్నింగ్ ఇష్యు […]

రోజా శోకాలు దేనికి సంకేతం..? జగన్‌నూ బదనాం చేసే ధోరణేనా..?!

January 18, 2021 by M S R

roja

నగరి ఎమ్మెల్యే రోజా భోరుమని ఏడ్చింది… అధికారులెవరూ నన్ను పట్టించుకోవడం లేదు… చివరకు కలెక్టర్ కూడా అంతే… ప్రొటోకాల్ లేదు, మర్యాద లేదు, ప్రాధాన్యత లేదు… చివరకు టీటీడీ కూడా అంతే అంటూ రోజా ప్రివిలేజ్ కమిటీ ఎదుట విలపించింది అని ఒక వార్త కనిపించింది… తనకు ఓ ఎమ్మెల్యేగా దక్కాల్సిన గౌరవమర్యాదలు దక్కడం లేదు అనేది ఆమె బాధ… ఆమె ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసిందనీ, కమిటీ ఎదుట ఏడ్చేసిందనీ ఆ వార్త సారాంశం… విస్మయపరిచింది […]

కుర్చీ దిగుతాడో లేదో గానీ… ఎర్రకోట మీదికి కవాతు కథే లేదు… పార్ట్-3

January 18, 2021 by M S R

modi kcr

పార్ట్-1, 2 చదివారు కదా… అసలు హస్తిన మీద యుద్ధం చేస్తానని కత్తీడాలు తిప్పిన కేసీయార్ ఢిల్లీ వెళ్లిరాగానే ఎందుకు అకస్మాత్తుగా వైరాగ్యంలోకి జారిపోయాడు..? ఆధ్యాత్మిక చింతన, వానప్రస్థం ఆలోచనల్లోకి ఎందుకు వెళ్లిపోయాడు..? రాజకీయ సన్యాసం వైపు అడుగులు ఎందుకు వేస్తున్నాడు..? అన్నీ ప్రశ్నలే… ఎప్పుడూ లేని ఆరోగ్యస్పృహ ఇప్పుడే ఎందుకొచ్చింది..? అసలు అధికారంలో ఉన్నప్పుడు అనారోగ్యాలూ దూరదూరంగానే ఉండిపోతాయి కదా..! సింపుల్… 1) బీజేపీ ప్రాంతీయ పార్టీలను దేశంలో ఉండనివ్వదు… దాని పొలిటికల్ లైన్ అది… […]

పార్టీ వోకే అంటే సరి… కేటీయార్ ఆటోమేటిక్‌గా అర్హుడైపోతాడు… పార్ట్-2

January 18, 2021 by M S R

ktr kcr2

పార్ట్-2 లోకి వచ్చేశాం కదా… కేటీయార్ అర్హత గురించి…! సీఎం పగ్గాలు చేపట్టేందుకు కేటీయారే ఎందుకు అర్హుడు అనేది ప్రశ్నే… కానీ ఒక కుటుంబ పార్టీలో దానికి భిన్నమైన జవాబు వచ్చే చాన్సే, భిన్న ఆచరణ కనిపించే అవకాశమే లేదు… పైగా కేసీయార్ వారసత్వం అనేది తనకు అనర్హత కాదు… కాబోదు… అది పార్టీ ఇష్టం… ఒక నాయకుడు వైదొలిగినప్పుడు మరో నాయకుడిని సహజంగానే పార్టీ ఎంచుకుంటుంది… ఈ దిశలో మిగతా అందరిలాగా కేటీయార్ కూడా పోటీదారే […]

కేటీయార్‌కు పగ్గాలు..! ఎందుకు..? ఎప్పుడు..? ఎలా..? నిజమేనా..? పార్ట్-1

January 18, 2021 by M S R

ktr kcr

ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ సమాజంలో చర్చ జరగాలి… అది అవసరం… ఆ చర్చాంశాల్లో ముఖ్యమైనవి… 1) కేటీయార్‌కు సీఎం కుర్చీ ఇవ్వడం… ఆ అవసరం ఎందుకొచ్చింది..? 2) కేటీయార్‌కే ఎందుకు ఇవ్వాలి..? వారసత్వమే దిక్కా..? 3) కేటీయార్ అర్హత, సామర్థ్యం…. ఈ చర్చ ఎందుకు అవసరం అంటే..? కేసీయార్ రాజకీయ సన్యాసం స్వీకరించి వానప్రస్థానికి వెళ్లనున్నాడు కాబట్టి… కొడుక్కి అధికార పీఠం అప్పగించే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి… అది క్రమేపీ తెలంగాణ రాజకీయ చిత్రపటంలో మార్పులకు కారణం […]

యెల్లో గెరిల్లా వార్..! ఈ రాతకోతలు, సలహాలే బాబును నిండా ముంచినయ్..!!

January 18, 2021 by M S R

rk

ఒక విభ్రమ ఆవరించింది… ఇదేం భాష..? ఇదేం భావజాలం..? ఎస్, ఆంధ్రజ్యోతి తెలుగుదేశం కరపత్రిక అని అందరికీ తెలుసు… అంతెందుకు, ఓనర్ రాధాకృష్ణే దాన్ని దాచుకోలేదు, దాచుకునే ప్రయత్నమూ చేయలేదు… ఈ విషయంలో ఈనాడు మరీ తలుపుచాటున నిలబడి పైటజార్చినా సరే, ఆంధ్రజ్యోతి అరుగు మీద నిలబడి కన్నుకొట్టే టైపే… ఆర్థికమో, సామాజికమో, జగన్ మీద ద్వేషమో… కారణాలు ఎన్నున్నా సరే, ఆంధ్రజ్యోతి తన పచ్చదనం మీద ఎప్పుడూ ముసుగు కప్పుకోలేదు… కానీ దేనికైనా ఓ లక్ష్మణరేఖ […]

గంజితో అధ్వా‘న్నం’- తీసేస్తే పరమాన్నం… ఈ కుక్కర్ బోధ ఇదే…

January 18, 2021 by M S R

rice cooker

పిండితార్థం! పిండి పదార్థం!! ——————— ముందుగా ఒక విన్నపం. కడుపుకు అన్నం తినేవారెవరయినా ఈ ప్రకటన చదివి భయపడకండి. అనవసరంగా ఆందోళన పడి ఆరోగ్యం పాడు చేసుకోకండి. ప్రకటన భాషలో, భావంలో ఉన్న వైరుధ్యాలు, తమాషా, చమత్కారాల మీద సరదాగా కాసేపు మాట్లాడుకోవడానికే ఈ చర్చ. ఈ ప్రకటన చూసి ఇన్నేళ్లుగా మీరు తింటున్నది అన్నం కానే కాదని- కాలకూట విషమయిన సున్నమని దయచేసి కంక్లూజన్ కు రాకండి. ఇప్పుడు విషయంలోకి వెళదాం. బాగా పేరున్న ఓ […]

కిల్ రాజు దందా, బెల్లంకొండ దాదా…! మధ్యలో ఓయూజేఏసీ హేమిటి..?!

January 18, 2021 by M S R

krack

క్రాక్ అనబడే ఓ సినిమాకు సంబంధించి ఒక డిస్ట్రిబ్యూటర్ శ్రీను‌కు ఎక్కడో కాలి దిల్ రాజును కాస్తా కిల్ రాజూ అని తిట్టి ఉండవచ్చు… శిరీష్‌నూ నిందించి ఉండవచ్చు…. చివరకు ఎవరెవరికి ఏ భాషలు వస్తాయి, రావనేది కూడా తిట్టడానికి స్కోప్ ఇవ్వవచ్చు… దానికి బెల్లంకొండ సురేష్‌కు కోపమొచ్చి ఉల్టా ఈ శ్రీనును తిట్టవచ్చు… ఒరే, దిల్‌రాజు, శిరీష్ వంటి మహా మహితాత్ములను తిట్టడానికి నీకు నోరెలా వచ్చింది, ఇకపై నీకు సినిమాలు ఎవడిస్తాడు అని బెదిరించవచ్చుగాక… […]

కాలం ఎదురుతన్నినా… ఎవరెంత తిట్టినా సరే… ట్రంపుదీ ఓ చరిత్రే…

January 18, 2021 by M S R

donald trump

ప్రతీ నాయకుడిలోనూ మైనసులుంటయ్, ప్లస్సులుంటయ్… గెలిస్తే ఆహా ఓహో అని పల్లకీలు మోసే లోకమే, ఓడినప్పుడు చేతకానివాడనీ, చెడ్డవాడనీ ఆడిపోసుకుంటుంది… అంతకుముందు మంచిగా కనిపించిన కొన్ని లక్షణాలను విస్మరిస్తుంది… సేమ్, ట్రంపు విషయంలోనూ..! ఏ మెరిట్ లేకుండానే అమెరికా అధ్యక్షుడయ్యాడా..? కాదు కదా..! ఈసారి ఎన్నికల్లో తను పోరాడిన పద్ధతులు మనకు తప్పుగా తోచవచ్చుగాక.., తన పాలన పద్ధతుల్లో మనకు బోలెడు తప్పులు కనిపించవచ్చుగాక… తను అంతిమంగా ఫెయిల్ అయిపోవచ్చుగాక… రేప్పొద్దున సెనెట్ తనను అభిశంసించవచ్చుగాక… కానీ […]

  • 1
  • 2
  • 3
  • …
  • 24
  • Next Page »

Search On Site

Advertisement

Latest Articles

  • ఆలీ పిచ్చికూతలు సరే..! షకీలా ధర్మసందేహం మాత్రం అల్టిమేట్..!
  • అనుకుంటాం గానీ… చాలామంది చంద్రబాబులున్నారు దేశంలో…!!
  • పాకిస్థాన్ ఇజ్జత్ జప్తు… ఇమ్రాన్‌కు ఇంటాబయటా అన్నీ వెక్కిరింపులే…
  • పట్టుచీరె కట్టేనా..? నొసటన బొట్టు పెట్టేనా..? వేళ్లకు మెట్టెల మాటేమిటో..?!
  • ఫ్లెక్సీ లీడర్స్..! వింటారా కలాం చెప్పిన ధావన్ కథ..?
  • ఔను సారూ… మతమేనా..? కులాన్ని తేల్చే డీఎన్ఏ టెస్టులు కూడా ఉన్నయా..?
  • ప్రధాని దాకా కీలక పదవులు… దేశరక్షణకు మాత్రం ముందుకు రారు…
  • చింత బరిగెలు, తొడపాశాలు కావు బ్రో… అసలు కథలు వేరే ఉంటయ్…
  • #కాశీలో ఓరోజు… ఆటగదరా శివా…! ‘‘నేనేం తెలుసుకున్నాను’’…
  • బెడిసిన మోడీ ప్లాన్స్… శశికళను తొక్కేసి, తనూ మునిగాడు… లక్కీ స్టాలిన్…

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now