Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అదుగో పొగ… ఇదుగో బురద… ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్థమా..? దహనమా..?

February 8, 2026 by M S R

.

తెలుగులో దగ్ధం అనే పదానికీ దహనం అనే పదానికీ వేర్వేరు అర్థాలుంటాయి… ప్రమాాదవశాత్తూ కాలిపోయే అది దగ్ధం… ఎవరైనా కావాలని కాలబెడితే దహనం… సూక్ష్మంగా ఇదీ తేడా… హైదరాబాదులోని కీలకమైన ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో వేల కేసుల బాపతు ఫైళ్లు, ఆధారాలు కాలిపోయాయి… అది దగ్ధమా, దహనమా..? ఇదీ తెలంగాణలో మరో కలకలం రేపే ప్రశ్న ఇది…

అటు పొగలు సెగలు… వెంటనే అర్జెంటుగా కేటీయార్ ట్వీట్… ఏమనీ అంటే… ‘‘వోటుకు నోటు కేసు బాపతు వాయిస్ రికార్డులు కూడా కాలిపోయిన ఫైళ్లు, ఆధారాల్లో ఉండవచ్చునని ఊహిస్తున్నాను… అంతేకాదు, ఉద్దేశపూర్వక కల్పిత, రాజకీయ ప్రేరిత ఫోన్ ట్యాపింగ్ కేసు ఆధారాలు లేకపోవడాన్ని కప్పిపుచ్చడంం కోసం కూడా కావచ్చు’’ తన ట్వీట్ సారాంశం, ఉద్దేశం అదే…

Ads

అంటే… రేవంత్ రెడ్డే కావాలని వోటుకునోటు ఆధారాలు తుడిచేయడానికి ఏదో కుట్ర చేశాడు అనే అర్థమొచ్చేలా జాగ్రత్తగా పదాలు కూర్చిన ట్వీట్… సరే, గాలి నుంచి టన్నుల కొద్దీ బురద సృష్టించి మరీ వెదజల్లగల సామర్థ్యం ఉన్న క్యాంపు కాబట్టి… కేటీయార్ ట్వీట్ పెద్దగా ఆశ్చర్యపరచలేదు… ఇదీ ట్వీట్ లింక్…

https://x.com/KTRBRS/status/2020039542007607331

ఫోన్ ట్యాపింగు అరాచకాలు, ఘోరాలు బయటపడకుండా హార్డ్ డిస్కుల్ని కాలబెట్టించిన చరిత్ర తెలిసిందే కదా… రేవంత్ రెడ్డి కూడా సేమ్ మాలాగే అన్నట్టుంది ఇది కూడా… ఊహించినట్టే కేసీయార్ మీడియా కూడా బాస్ ఆలోచనలు, ఆరోపణలకు తగినట్టు ఆ మంటల్లో మరింత పెట్రోల్ పోయడానికి విశ్వప్రయత్నం చేసింది… అనుమానపు పొగలు అంటూ…

కాలిపోయింది చాలా కీలకమైన ఫ్లోర్, రూమ్స్, చాలా ఎవిడెన్సులున్నవి అక్కడే… సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది..? అని ఏవేవో ప్రశ్నలు వేస్తూనే కాలిపోయిన ఫైళ్లలో ఫోన్ ట్యాపింగ్ ఫైళ్లు కూడా ఉన్నట్టు రాసుకొచ్చింది…

ఫోరెన్సిక్

సార్, ఇక్కడ చిన్న డౌట్ తెలంగాణ సమాజానికి..! ఫోన్ ట్యాపింగు బాగోతంలో బీఆర్ఎస్ పెద్దతలల్ని బలంగా ఫిక్స్ చేయాలని కదా రేవంత్ రెడ్డి ప్రయత్నం, దర్యాప్తు, సిట్ విచారణ… మరి ఆ పైళ్లు కూడా కాలిపోయాయి అంటే… గతంలో హార్డ్ డిస్కులు కాలిబెట్టినట్టే… ఇప్పుడూ ఇంకా ఏ ఆధారాలూ లేకుండా ఏమైనా కుట్ర జరిగిందా..? అనుమానపు పొగలు ఆ కోణంలోనూ కమ్ముకుంటున్నట్టే కదా… మరి ఎవరు కుట్రదారు..?

ఫోరెన్సిక్

మీడియాలో అనవసర, ఆధారరహిత ప్రచారాలతో గందరగోళాన్ని క్రియేట్ చేయవద్దని, అధికశాతం మెటీరియల్ చెక్కుచెదరకుండా ఉందని ల్యాబ్ డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు… డేటా బ్యాకప్ ఉందనీ పోలీసులు చెబుతున్నారు…  షార్ట్ సర్క్యూటే ప్రమాదకారణం అని ఫైర్ సేఫ్టీ డీజీ క్లారిటీ ఇస్తున్నాడు…

సీజింగ్ మెటీరియల్, ఫిజికల్ ఎవిడెన్స్, క్లూస్ టీం సేకరించిన ఆధారాలు, రక్తనమూనాలు, వేలిముద్రలు, డీఎన్ఏ శాంపిల్స్ ఎట్సెట్రా ఉంటాయి… నిజానికి ప్రమాద తీవ్రత, నష్టం మీద సరైన మదింపు జరగాలి… నిజంగా ఏదైనా కుట్ర కోణం ఉందా అనే దర్యాప్తు కూడా జరగాలి… అది పోలీస్ యంత్రాంగం చూసుకుంటుంది…

ఫోరెన్సిక్

సరే, నిజంగానే రేవంత్ రెడ్డి ఏదో కుట్ర చేశాడని అనుకుందాం వోటుకునోటు కేసు కోసం… కానీ నాటి వాయిస్ రికార్డింగులు అన్ని మీడియా ఆఫీసుల్లోనూ ఉన్నాయి, ఆల్రెడీ విచారణ జరిగిన కోర్టుల్లోనూ ఆధారాలు ఉన్నాయి… ఆ వీడియోలు కూడా బహిరంగమే… మరిక కావాలనే కీలక ఆధారాలు కాలబెట్టించారనే అనుమానపు ఆరోపణలకు విలువ ఎంత..? ఉద్దేశపూర్వకంగానే… ఏది జరిగినా రేవంత్ రెడ్డి మెడలో వేయడం అలవాటైపోయి, దీన్ని కూడా అలాగే వాడుకోవాలనే తాపత్రయం తప్ప ఇందులో పాయింట్ ఏమున్నట్టు..?!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సమాజం, సభ్యత, బాధ్యత – బూతులు, సంస్కారం..!
  • అదుగో పొగ… ఇదుగో బురద… ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్థమా..? దహనమా..?
  • AI వ్యూహంలో చిక్కుకున్న భారత్… మిషన్లకు అందని సూర్య మ్యాజిక్..!
  • నిజమే… ఐటీ ప్రపంచంలో ఆంథ్రోపిక్ ఎఐ ప్రకంపనలు షురూ…
  • ప్రశ్న కూడా ఇక్కడ ఓ ప్రార్థనలాంటిదే… భూటాన్‌లో కొన్ని ప్రశ్నలు అడగరు…
  • అసలైన హీరో… రోజర్ మూర్ మనసున్న ‘బాండ్’…
  • ఆసియాలోకెల్లా అత్యంత సంపన్న కార్పొరేషన్ పగ్గాలు… ఎవరీమె..?
  • నాడు అల్లుడు హైజాక్ చేస్తే… నేడు కొడుకు హస్తగతం చేసేసుకున్నాడట…
  • టీబీజేపీకి దిష్టి తత్వం బోధపడింది… కళ్లు హఠాత్తుగా తెరుచుకున్నయ్…
  • వరల్డ్ క్రికెట్ అంటేనే ఇండియా… విదేశీ జట్లలో ఏకంగా 40 మంది మనోళ్లే..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions