Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

విజయ్ మంత్రుల్లో కీలకుడు… ఈ ‘సోషల్ షో’ చూడండి ఓసారి…

May 19, 2026 by M S R

.

నాయకులు, ప్రజాప్రతినిధులు హాస్టల్ నిద్ర అని చేస్తుంటారు… పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తుంటారు… అంతా షో… ఓవరాక్షన్… అప్పటికప్పుడు ఏదో విసుగును, అయిష్టతను దాచుకుని, నటించేసి ఫోటోలకు, వీడియోలకు ఫోజులిచ్చేసి జంప్… నిజాయితీ ఏముంటుంది..?

సినిమా హీరో జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం కొలువు దీరింది కదా తమిళనాడులో… ఆ పార్టీ జనరల్ సెక్రెటరీ ఆర్థిక- సాంకేతిక- ప్రచార బాధ్యతలు చూసిన తను మంత్రి కూడా అయ్యాడు… పేరు అధవ్ అర్జున్… ప్రభుత్వంలో కీలక వ్యక్తి ఇప్పుడు… తనది ఓ రీల్ కనిపించింది…

Ads

ముందుగా తన నేపథ్యాన్ని మరోసారి నెమరేసుకుందాం… దేశంలో దాదాపు ప్రతి పెద్ద పార్టీకి వందల కోట్ల పార్టీ విరాళాలు ఇచ్చిన లాటరీ కింగ్ మార్టిన్ తెలుసు కదా… ఈమధ్య ఐదారు కథనాల్లో చెప్పుకున్నాం తన గురించి… బోలెడు వివాదాలు, వేల కోట్ల సంపాదన, కేసులు గట్రా… అదుగో సదరు లాటరీ మామగారి అల్లుడే ఈ అధవ్ అర్జున్… తనేమో టీవీకే పార్టీ నుంచి నిలబడ్డాడు గెలిచాడు…

భార్యను అన్నాడీఎంకే నుంచి నిలబెట్టాడు… గెలిచింది… కొడుకును పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి తరఫున నిలబెట్టాడు… గెలిచాడు… సో, ఇక్కడ కొడుకు, అక్కడ అల్లుడు… ఇద్దరూ రెండు ప్రభుత్వాల్లో ముఖ్యులు… మరింత పరపతి, మరింత రక్షణ, మరింత సంపాదన… అదీ లాటరీ మామ గారి నేపథ్యం…

ఈ అధవ్ అర్జున్ ఓసారి ఓ సామాజిక హాస్టల్‌లో పిల్లలతో కలిసి అల్పాహారానికి కూర్చున్నాడు… పిల్లల నడుమ కూర్చున్నాడు… పిల్లలకు ఇడ్లీ పెట్టారు, ప్లేట్లలో ఇడ్లీలు, వాటిపై సాంబారు కనిపిస్తోంది… అధవ్‌కు మాత్రం వేరే ప్లేటు పెట్టారు… అందులో బ్రెడ్లు… వాటికి జామ్ రాసుకుని తింటున్నాడు, స్పెషల్ వాటర్ బాటిల్ సరేసరి… మరి ఈమాత్రం దానికి అక్కడ షో దేనికి, ఈ నిజాయితీ లేని సోషల్ షో పరమార్థం ఏమిటి..? ప్రయోజనం ఏమిటి..?

ఈ వీడియో బయటికి వచ్చాక ఇజ్జత్ పోయింది… దిగువన ఓ రీల్ లింక్ చూడండి, స్పష్టంగా కనిపిస్తుంది తన షో, తన యాక్షన్… అందరితోపాటు ఆ ఇడ్లీ తింటే ఏమవుతుంది..? ఎందుకా భయం..? ఆ పిల్లలవి ప్రాణాలు కావా..? చెత్తా పోకడ..!!

https://www.facebook.com/reel/1957871218200713

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తను దెయ్యమా..? వామ్మో, నన్నే ఎందుకు పలకరిస్తున్నాడు..?!
  • ప్రతిపక్షం అంటే ఇదీ… ఇటాలియన్ ట్రూ స్పిరిట్ అంటే ఇదీ…
  • ఇంతకీ అతను ఖతం అయిపోయినట్టేనా..? మరి ఇవేం రాజకీయాలు..?!
  • Still గుర్తుండిపోయే ఫోటోగ్రాఫర్… ఆయన పేరే ‘స్టిల్ భూషణ్…
  • Alia Bhatt … ‘Alpha’ మోడల్… ఏ చట్రంలోనూ బందీ కాదు…
  • ఈవీవీ మార్క్ అప‘హాస్యం ట్రాక్… లేటు వయస్సుల రొమాన్స్…
  • పంప్డ్ స్టోరేజీ..! తెలంగాణ పవర్ సెక్టార్‌లో ఓ నిశ్శబ్ద విప్లవం..!
  • పేదల వాహనం..! పల్లె బాటలపై ఈరోజుకూ తోపు టూవీలర్ ఈ మోపెడ్..!
  • సీరియస్ స్టోరీ..! ఈ నేరానికి పేరేమిటి..? అసలు ఇది నేరమేనా..?
  • అయ్యా, నవీన్ బాబూ… ఒక్క ప్రశ్న… ఈ సినిమా ఎందుకు తీసినట్టు..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions