.
Pardha Saradhi Upadrasta ….. ఫామ్ తాత్కాలికం… క్లాస్ శాశ్వతం … అభిషేక్ బాబు, వరుణ్ బాబు ప్రస్తుతం కొంత వత్తిడి కారణంగా ఫామ్ కొంచెం తగ్గినట్లు కనిపించవచ్చు. కానీ ఒక విషయం మాత్రం గుర్తు పెట్టుకోవాలి , ఇదే ఆటగాళ్లు గతంలో ఎన్నో కీలక సందర్భాల్లో భారత్‌కు విజయాలు అందించారు.
క్రికెట్‌లో ఒక ఆటగాడి ఫామ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు అద్భుతంగా ఆడతారు, కొన్నిసార్లు అంచనాలకు తగ్గట్టు ఆడలేకపోవచ్చు. ఇది కేవలం క్రికెట్‌కే కాదు, ఏ రంగంలో అయినా సహజం.
జట్టు గెలుస్తున్నంత కాలం ఒక్కో ఆటగాడు తాత్కాలికంగా ఫామ్ కోల్పోవడం పెద్ద సమస్య కాదు.
Ads
ఎందుకంటే జట్టు అంటే ఒక్క ఆటగాడు కాదు , మొత్తం వ్యవస్థ, అదొక జట్టు. ఒక పెద్ద ప్రాజెక్టులో ఒక ఉద్యోగి ఒకసారి సరిగా perform చేయలేదని వెంటనే ఉద్యోగం తీసేస్తే, ఆ కంపెనీలో కొద్ది రోజుల్లోనే ఉద్యోగులే మిగలరు. ఎందుకంటే ప్రతి మనిషి కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజం.
అలాగే క్రికెట్‌లో కూడా:
కొన్నిసార్లు ఆటగాడు అద్భుతంగా ఆడతాడు
కొన్నిసార్లు ఒత్తిడితో ఫామ్ తగ్గుతుంది
కొన్నిసార్లు అదృష్టం కూడా కలిసి రాదు
ఇవి అన్నీ ఆటలో భాగమే.
అందుకే మంచి జట్లు తమ ఆటగాళ్లకు:
సమయం ఇస్తాయి
ఆత్మవిశ్వాసం పెంచుతాయి
మరింత ప్రాక్టీస్ చేయించే అవకాశాలు ఇస్తాయి
జట్టులో ఉన్న కోచ్‌లు, అనలిస్టులు, సపోర్ట్ స్టాఫ్ ఆటగాళ్ల ఆటను జాగ్రత్తగా పరిశీలించి, వారు ఎక్కడ వెనుకబడి ఉన్నారో గుర్తిస్తారు. అదే ఆధారంగా వారికి టెక్నికల్ మార్పులు, ప్రాక్టీస్ ప్లాన్‌లు సూచిస్తారు. అనుభవజ్ఞులు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు.
మొన్న రోహిత్, అభిషేక్ తో చాలాసేపు మాట్లాడుతూ విశ్లేషిస్తూ కనపడ్డాడు. ఇది మనిషికి తన తప్పులు తాను తెలుసుకునే అవకాశం.
Sachin Tendulkar అంతటి వ్యక్తి వరుసగా 5, 6 మ్యాచ్ లలో off stump మీద బాల్ కెలికి మరీ ఔట్ అవుతున్నాను అని తన కోచ్ లు, అనుభవజ్ఞుల సలహా మేరకు ఒక సిరీస్ లో అస్సలు offside షాట్ లు కొట్టకుండా ఆపి, తన ఆటను మార్చి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.
కోహ్లీ అంతటి వ్యక్తి ఒక సిరీస్ లో 6 సార్లు ఆఫ్ సైడ్ లో స్లిప్ లలో క్యాచ్ ఇచ్చి తక్కువకు ఔట్ అయ్యాడు. ఇది ఎవరికి అయినా సహజమే. అలా అని ఒకసారి సిరీస్ మధ్యలో పీకేసి పక్కన పెట్టటం కూడా మంచిది కాదు.
ఒకసారి ఆ ఆటగాడు మళ్ళీ రిథమ్‌లోకి వచ్చాక అదే ఆటగాడు మ్యాచ్‌లను గెలిపించే స్థాయికి తిరిగి వస్తాడు.
అందుకే నిజమైన అభిమానులు ఒక విషయం తెలుసుకుంటారు:
ఫామ్ తాత్కాలికం… కానీ క్లాస్ శాశ్వతం. మంచి ఆటగాళ్లు కొంత సమయం తర్వాత మళ్ళీ లేచి నిలబడతారు. — ఉపద్రష్ట పార్ధసారధి
#TeamIndia #Cricket #AbhishekSharma #VarunChakravarthy #CricketAnalysis #SportsMindset #PardhaTalks
Share this Article