.
అధికార పీఠంపై కూర్చున్నప్పుడు అన్నీ అద్భుతంగానే కనిపిస్తాయి… కానీ, ఆ కుర్చీ వెనుక దాగిన చీకటి ఒప్పందాలు, గ్లామర్ ముసుగులో సాగే క్రూరమైన క్రీడలు ఒక్కొక్కటిగా బయటపడితే… అది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు, వ్యవస్థకే పెను సంచలనం… ఇప్పుడు అమెరికా మాజీ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ మాజీ మోడల్, దౌత్యవేత్త అమండా ఉంగారో చేస్తున్న పోరాటం అగ్రరాజ్య రాజకీయాల్లో తుపాను సృష్టిస్తోంది…
రెండు దశాబ్దాల సాన్నిహిత్యం.. ఇప్పుడు వైరం! అమండా ఉంగారో అంటే ఎవరో కాదు, దాదాపు 20 ఏళ్ల పాటు మెలానియా ట్రంప్ అంతరంగిక వలయంలో కీలక సభ్యురాలు…. మెలానియా కుటుంబం, ఆమె వ్యక్తిగత జీవితం, వ్యాపార లావాదేవీలు… ఇలా ప్రతి అడుగులోనూ సాక్షిగా ఉన్న వ్యక్తి…. ఇప్పుడు ఆమె “నోరు విప్పితే నీ రంగుల ప్రపంచం కుప్పకూలుతుంది” అని నేరుగా మెలానియాకే సవాలు విసరడం అంటే, ఆమె దగ్గర ఎంతటి పేలుడు పదార్థం లాంటి సమాచారం ఉందో అర్థం చేసుకోవచ్చు…
Ads
ఎప్ స్టీన్ ‘పాపపు విమానం’.. అసలు ఏం జరిగింది? ఈ కథనంలో అత్యంత భయంకరమైన కోణం ‘జెఫ్రీ ఎప్ స్టీన్’ వ్యవహారం… గతంలో సంచలనం సృష్టించిన ఈ సంభోగాల ట్రాఫికింగ్ కేసులో మెలానియాకు సంబంధం లేదని ట్రంప్ వర్గం బుకాయిస్తున్నా, అమండా మాత్రం సంచలన నిజాలను బయటపెడుతున్నది…
-
కేవలం 17 ఏళ్ల ప్రాయంలోనే ఎప్ స్టీన్‌కు చెందిన ‘లోలితా ఎక్స్‌ప్రెస్’ విమానంలో తాను ఎదుర్కొన్న భయానక పరిస్థితులను ఆమె వివరించింది…
-
దశాబ్దాలుగా సాగుతున్న ఈ ‘చీకటి నెట్ వర్క్’లో గ్లామర్ ముసుగులో ఎంతమంది యువతుల జీవితాలు బలిపశువులుగా మారాయో ఆమె సాక్ష్యాలతో సహా బయటపెట్టేందుకు సిద్ధమవుతున్నది…
అధికార గర్వంతో ‘అరెస్టు’ రాజకీయం? అమండా చేస్తున్న ప్రధాన ఆరోపణ ఒకటి ఉంది… తానూ ఒకప్పుడు ఐక్యరాజ్యసమితిలో రాయబారిగా పని చేసినా, గ్రెనడా తరపున దౌత్య బాధ్యతలు నిర్వహించినా.. తనను ఒక సాధారణ నేరస్తురాలిలా చిత్రించారని ఆమె ఆవేదన చెందుతున్నది…
-
కేవలం ఒక చిన్నారి కస్టడీ విషయంలో, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తనపై అక్రమ కేసులు పెట్టించారని ఆమె వాదిస్తున్నది…
-
2025లో ఫ్లోరిడాలో పదిమంది పోలీసులు వచ్చి ఆమెను అరెస్టు చేయడం, మూడు నెలల పాటు ఐసీఈ (ICE) డిటెన్షన్ సెంటర్‌లో ఉంచడం వెనుక ట్రంప్ అంతరంగిక వర్గాల హస్తం ఉందనేది ఆమె ప్రధాన ఆరోపణ…
2026: అబద్ధాల పునాదులు కదిలే సమయం! ప్రస్తుతం అమండా ఉంగారో ‘హౌస్ ఓవర్ సైట్ కమిటీ’ ముందు సాక్ష్యం చెప్పేందుకు సిద్ధమయ్యింది… 2026వ సంవత్సరం ట్రంప్ కుటుంబానికి చట్టపరంగానే కాకుండా, రాజకీయంగా కూడా గడ్డుకాలం కాబోతోంది…
-
“ఇరవై ఏళ్ల పాటు నన్ను వాడుకుని నాశనం చేశారు… ఇప్పుడు నా కొత్త జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూస్తున్నారు” అని ఆమె చేస్తున్న పోరాటం… సామాన్యులకు, అధికారం ఉన్నవారికి మధ్య జరుగుతున్న యుద్ధంగా కనిపిస్తోంది…
ముక్తాయింపు…: ఈ ‘గ్రంథసాంగుల’ అసలు రంగులు బయటపడటం మొదలైతే, అది కేవలం అమెరికాకే పరిమితం కాదు… అంతర్జాతీయ స్థాయిలో గ్లామర్, అధికారం మధ్య సాగే అక్రమ సంబంధాల నెట్ వర్క్ మొత్తం బట్టబయలయ్యే అవకాశం ఉంది… అమండా ఉంగారో విసిరిన ఈ సవాలు చివరకు ఎవరి పతనాన్ని శాసిస్తుందో వేచి చూడాలి!
Share this Article