.
Pardha Saradhi Potluri …. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అద్భుతమైన కౌంటర్ ఇచ్చారు అమెరికాకి! క్రిస్టోఫర్ లాండు ( Christopher Landau ) అమెరికా డిప్యూటీ విదేశాంగ మంత్రి మొన్న భారత్ ని ఉద్దేశించి అన్న మాట….. ‘భారత్ అర్ధం చేసుకోవాల్సింది ఏమిటంటే చైనా విషయంలో 20 ఏళ్ళ క్రితం మేము చేసిన తప్పుని భారత్ విషయంలో జరగనివ్వము!’
ఇతనికి తన స్వంత దేశం అమెరికా ఎప్పుడు తప్పు చేసిందో కూడా తెలియదు. సోవియట్ యూనియన్ ని దెబ్బ తీయడానికి చైనాలో పెట్టుబడులు పెట్టి టెక్నాలజిని ఇవ్వడం మొదలు పెట్టింది 1970 వ దశకం చివరలో!
Ads
1975 లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించే సమయానికి అమెరికా చైనాలో పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టింది! 1980 నుండి మెల్లగా టెక్నాలజీని కూడా బదిలీ చేయడం మొదలుపెట్టింది. 1985 లో జపాన్ ని చైనాలో పెట్టుబడులు పెట్టమని ప్రోత్సహించింది. అమెరికాని నమ్మి జపాన్ తన ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలని చైనాకి తరలించింది!
1990 నుండి అమెరికన్, జపనీస్ ఉత్పత్తులు చైనాలో తయారై ప్రపంచ మార్కెట్లని ముంచెత్తాయి! క్రమంగా జపాన్ తన స్వశక్తిని మరిచిపోయి అమెరికా, చైనా మీద ఆధారపడి నెట్టుకొస్తున్నది ఇప్పుడు. 2000 లలో నానో టెక్నాలజీని కూడా యూరోపు, అమెరికా చైనాకి ఇచ్చి తప్పు చేశాయి. మెటీరియల్, మెటలర్జికల్ టెక్నాలజీని కూడా చైనాకి ఇవ్వడం ఒక ఎత్తయితే చైనా వీటికోసమే ప్రత్యేకంగా యూనివర్సిటీలు ఏర్పాటు చేసి తన విద్యార్థుల చేత పరిశోధనలు చేయించి, ఇప్పుడు ప్రపంచానికి సవాలు విసురుతున్నది!
చీప్ లేబర్ చైనాలో దొరుకున్నదని అమెరికన్స్ అక్కడికి ఎగబడ్డారు తప్పితే అమెరికన్స్ కి కష్టపడే తత్వం లేదని ఒప్పుకోరు శుంఠలు! సోవియట్ యూనియన్ ని ముంచాలని వేసిన ప్లాన్ తో మరో కమ్యూనిస్ట్ దేశానికి సహకరించడంతో ఫెయిల్ అయ్యింది!
జై శంకర్ కౌంటర్!
శంకర్ అమెరికా పేరు ఎత్తకుండా మంచి జవాబు ఇచ్చారు….. ” భారత్ ఎదుగుదల అనేది భారత ప్రజల శక్తి సామర్ధ్యాలు, తెలివితేటలు, కష్టపడి పనిచేసే తత్వం మీద ఆధారపడి జరిగింది తప్పితే వేరే దేశం చేసిన తప్పుల వల్ల కాదు ”
రెండు రోజుల క్రితం ఫిన్ లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ ( Alexander Stubb ) ముంబై లో పారిశ్రామికవేత్తల సమావేశంలో మాట్లాడుతూ భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ తన అభిమాన విదేశాంగ మంత్రి అని ప్రశంసించారు!
అలెగ్జాండర్ స్టబ్ మరో మాట కూడా అన్నారు జైశంకర్ ని ఉద్దేశించి… ” జైశంకర్ గతంలో ఒక మాట అన్నారు.. యూరోపు సమస్య లు ప్రపంచ సమస్య కానీ ప్రపంచ సమస్యలు యూరోపువి కావు అని. కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను ప్రపంచ సమస్య యూరోపుది కూడా, వెస్ట్ ఆసియా, మధ్య ప్రాచ్యం, సూడాన్ లలోని ప్రస్తుత పరిస్థితుల మీద యూరోపు స్పందించి తగిన విధంగా చర్యలు తీసుకుంటుంది అని హామీ ఇస్తున్నాను ”
అలగ్జాండర్ స్టబ్ ఈ మాటలు అన్నప్పుడు ఎదురుగా కూర్చున్న జై శంకర్ చిరునవ్వుతో స్వాగతించారు!
మరుసటి రోజే అమెరికన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి క్రిస్టోఫర్ భారత్ ని ఉద్దేశించి చైనా విషయంలో చేసిన తప్పు భారత్ విషయంలో చేయము అన్నాడు !
ఫిన్ లాండ్ అధ్యక్షుడు ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయేల్ చేస్తున్న దాడుల గురుంచి ముంబైలో అనడం మీద అమెరికాకి కోపం వచ్చింది! వెంటనే ఫిన్ ల్యాండ్ మీద కాకుండా భారత్ మీద అక్కసు వెళ్ళగక్కింది!
ఇరాన్ విషయంలో యూరోపులోని దేశాలలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి.
ట్రంప్ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ని ఉద్దేశిస్తూ నువ్వు ఒక ఫెయిల్డ్ అధ్యక్షుడివి మళ్ళీ ఎన్నికలలో గెలవలేవు అని అన్నాడు! ట్రంప్ అక్కసు దేనికంటే మాక్రాన్ హయాంలోనే రాఫెల్ జెట్స్ ఒప్పందాలు చేసుకున్నది భారత్!
ఇక ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మోడీని ఫాలో అవుతున్నది! రష్యాతో సత్ సంబంధాలు నెలకొల్పుకోవాలని ప్రయత్నిస్తున్నది!
జెర్మనికి ఎటు వైపు ఉండాలో అర్ధం కావట్లేదు! జెర్మనీ ఆటో, ఎలక్ట్రానిక్ పరిశ్రమ చైనా మీద ఆధారపడి ఉంది!
బ్రిటన్ ప్రస్తుతం జీ జింగ్పింగ్ చెప్పినట్లు నడుచుకుంటున్నది! ట్రంప్ కి బ్రిటన్ ప్రధాని స్టీర్ బామర్ కి అసలు పడడం లేదు!
హంగరి దేశం పూర్తిగా రష్యా వైపు ఉంటున్నది!
ప్రస్తుతం విదేశాంగ విధానపరంగా చూస్తే మునుపు ఎన్నడూ లేని విధంగా భారత్ అత్యంత పటిష్టమైన విధానంతో ఉంది!
సెర్జీయో గోర్ ( Sergio Gor ) ని ట్రంప్ ఏరికోరి భారత్ కి అమెరికా రాయబారిగా నియమించినప్పుడే అర్ధమయింది ట్రంప్ ఉద్దేశ్యం ఏమిటో!
Sergio Gor ట్రంప్ కి నమ్మిన బంటు. అమెరికా తరుపున విదేశాలలో ప్రభుత్వాలని కూలగొట్టడంలో సిద్ధహస్తుడు! ఉండేది న్యూఢిల్లీలోనే అయినా శ్రీలంక, నేపాల్, బాంగ్లాదేశ్ లలోని భారత వ్యతిరేకులతో కాంటాక్ట్ లో ఉంటాడు నిత్యం!
Share this Article