.
ఒక వ్యక్తి… తన తల్లి చనిపోయింది… తండ్రి వేరే పెళ్లి చేసుకున్నాడు… అప్పుడు కొత్తగా తండ్రి జీవితంలోకి వచ్చిన ఆ ఫిమేల్ కేరక్టర్‌ను ఆ వ్యక్తి ఏమని పిలుస్తాడు… సాధారణంగా సహించడు… ఒకవేళ సహించినా సరే, పిన్ని అని పిలుస్తాడు తప్ప అమ్మా అని పిలవడు కదా… అందరికీ తెలిసిన నిజమే కదా…
కానీ ఎన్టీయార్ జీవితాన్ని భ్రష్టుపట్టించిన ఓ ఫిమేల్ కేరక్టర్ లక్ష్మిపార్వతి… హరికథల అమాయక మొగుడిని వదిలేసి మరీ ఎన్టీయార్ జీవితంలోకి భార్యగా ప్రవేశించిన లక్ష్మిపార్వతి… నడమంత్రపు అధికారంతో ఏకంగా రాష్ట్ర రాజకీయాల్ని, ప్రభుత్వాన్ని తన అజ్ఞానంతో శాసించే ప్రయత్నం చేసిన లక్ష్మిపార్వతి … ఎన్టీయార్ పిల్లలందరికీ తనను దూరం చేసిన లక్ష్మిపార్వతి… ఏమంటున్నదో తెలుసా ఇప్పుడు..
Ads
ఏమయ్యా లోకేషూ… నన్ను ఎప్పుడైనా అమ్మమ్మా అని పిలిచావా అని అడుగుతోంది… నిజంగా ఈమె కేరక్టర్ ఏమిటో ఫాఫం, ఆ జగన్‌కు తప్ప ప్రపంచంలో ఇంకెవరికీ నచ్చదేమో… తను కూడా చంద్రబాబును తిట్టడానికి ఆమెను ఎంకరేజ్ చేస్తున్నాడేమో… ఫాఫం జగన్… తన మాటలు వైసీపీకే కౌంటర్ ప్రొడక్ట్ అవుతున్నాయనే సోయి లేనట్టుంది…
పొలిటిెకల్ సర్కిళ్లలో ఆమె ఏమిటో అందరికీ తెలుసు… ఇప్పుడేమో లోకేష్‌ను ఉద్దేశించి ‘నన్ను అమ్మమ్మా అని ఎప్పుడైనా పిలిచావా’ అనడుగుతోంది… సిగ్గులేనితనం… ఎందుకు నిన్ను అమ్మమ్మా అనాలి…?
ఈ మాట ఎందుకంటే..? లోకేష్ తల్లి భువనేశ్వరి, ఆమె తల్లి బసవతారకం… అంటే లోకేషుడికి పక్కా అమ్మమ్మ బసవతారకం అవుతుంది… అంతేతప్ప మధ్యలో తాత జీవితంలోకి ‘అవాంఛనీయ లక్ష్యాలతో’ ప్రవేశించిన లక్ష్మిపార్వతి అమ్మమ్మ ఎలా అవుతుంది..?
పురాణాలు చదివిందట, పుస్తకాలు రాసిందట, సాహిత్యంతో టచ్ ఉందట… బయోగ్రఫీలు కూడా రాసేంత జ్ఞానం ఉందట… కజిన్ అమ్మమ్మ, సవతి అమ్మమ్మ, చిన్నమ్మమ్మ అనే కేరక్టర్లు హిందూ బంధాల్లో ఉండవనే సోయి లేదా ఈమెకు..? నిజానికి అంతటి ఎన్టీయార్ జీవితం ఈమె వల్లే భ్రష్టుపట్టింది… అది నిజం… చిటికెడు ఉప్పుతో కుండపాలు పాడవుతాయి అన్నట్టు…
ప్రజలు కూడా ఆమెను చూసి కాదు… ఎన్టీయార్ రాజకీయ జీవితం, ప్రజాకర్షణను చూసి ఆ ఎన్టీయార్- లక్ష్మిపార్వతి పెళ్లిని ఆమోదించారు… కానీ ఏమైంది..? తనే డిఫాక్టో సీఎం అన్నట్టుగా చెలరేగిపోయింది… అదీ అక్కడ చంద్రబాబుకు మండింది… తరువాత జరిగిన కథ అందరికీ తెలిసిందే…
సో, సోకాల్డ్ ఫేక్ అమ్మమ్మా… లోకేష్ నిన్నెందుకు అమ్మమ్మా అని పిలుస్తాడు..? నువ్వు పార్టీకి, ఎన్టీయార్ కుటుంబానికి చేసిన ద్రోహానికి… థూ, నీయమ్మమ్మా అంటారు గానీ..!! నీ జీవితం థాయ్ కిళవి కాదు… నీ పేరు పవునుతాయ్ అసలే కాదు..!!
Share this Article