.
ఇంతకుముందు చెప్పిందే… ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియదు, కనీసం మమ్మల్ని చూసి నేర్చుకోడు… అరె, ఎమ్మెల్యేలు- ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు, కల్చరల్ యాక్టివిటీ ఎందుకుర భయ్..? ఇవ్వాల్టి నుంచే స్టార్ట్ చేస్తరట… నాకైతే ఇంట్రస్ట్ లేదు… అసలు మేమేమైనా చిన్న పిల్లలమా..? ఏమైనా ఒలింపిక్స్ పోటీలకు పోయి మెడల్స్ తీసుకొస్తమా..?
బొచ్చెడు ఇష్యూస్ ఉన్నయ్, చర్చించాలె, హాట్‌హాట్‌గా అసెంబ్లీలో ఆడుకోవాలె గానీ… స్టేడియంల మేం ఆడుకునేది ఏముంటది..? ష్… ఆట అంటే పైసల్ రావాలె… రాలాలె… మేం పెట్టలేదా..? మాకు తెల్వదా..? ఫార్ములా వన్ రేస్ పెడితే కోట్లకు కోట్లు రాలినయ్… క్విడ్ ప్రోకో అంటరో, పార్టీ ఎన్నికల బాండ్స్ అంటరో… పేరు ఏదయితేనేంది..? ఆట ఆడితే కాసులు కురవాలె…
Ads
కేసులదేముంది..? లొట్టపీసు కేసులని స్టాంప్ వేయాలె… ఒక్కడిని అర్వింద్ కుమార్ వంటి ఆఫీసర్‌ను పెట్టుకోవాలె… మన ఆట మనం ఆడాలె… అందుకే పదే పదే చెబుతుంటం… కేసీయార్ నెలకొల్పిన ఉత్కృష్ట సంప్రదాయాల్ని, సంపాదన పద్ధతుల్ని అర్థం చేసుకుని, ఆ బాటలో నడవాలని… వినడు, అసలే వినడు…
ఎట్లుంటదీ అంటే… అసలు మేం ఎప్పుడైనా బడ్జెట్లో స్పోర్ట్స్ బడ్జెట్‌కు నాలుగు పైసలు విదిలించినమా..? లేదు కదా… ఏదో కొంత చిల్లర పైసల అమౌంట్ పెడతం, గంతే… గచ్చిబౌలి వంటి స్పోర్ట్స్ విలేజీనే హాస్పిటల్ చేసేసినం… ఎల్బీనగర్ స్టేడియంనే పట్టించుకోలే… ఇప్పుడు దాంట్లనే పోటీలు పెడతరట…

కోట్లకు ఖర్చు పెట్టి ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీని పిలిచినప్పుడే చెప్పినం, గిటువంటి కథల్ పడకుర భయ్ అని… వినలేదు… మేం ఆ మొకాన కూడా పోలేదు… ఎన్నికలొచ్చినప్పుడు ఊళ్లల్ల పోరగాళ్లు క్రికెట్ కిట్లు అడుగుతరు, కొనివ్వాలె… గంతే…
రాస్తరు, మీడియా వాళ్లు ఏదో రాస్తరు… ప్రజాప్రతినిధులకు ఆటవిడుపు అక్కర్లేదా..? పార్టీల నడుమ వైషమ్యాలు, వైరుధ్యాలు తగ్గి స్నేహభావన పెరగాలి కదా అని…! అసలు టన్నుల కొద్దీ బురదను ఎత్తిపోసే విద్వేష రాజకీయాల్నే మేం ప్రయోగిస్తున్నప్పుడు… ఈ సానుకూల భావనలు, సామరస్యాలు, రాజకీయేతర సహృదయ బంధాలు పెరిగితే… మా హేట్ పాలిటిక్స్ ఎలా పనిచేస్తయ్…
గందుకనే… గీ ఆటలపోటీలు నాన్సెన్స్… మస్తు నాటకాలు ఆడుతుంటం రాజకీయాలల్ల… మస్తు డైలాగులు కొడుతుంటం… జనం చూస్తున్నరు, వింటున్నరు, చదువుతున్నరు… ఇంకా వేరే కల్చరల్ పోటీలు, ప్రదర్శేనలు దేనికి అసలు..?
ఇలాంటివాటి జోలికి స్టేట్ డివైడ్ అయ్యాక అస్సలు పోలేదు… అసలు ఆ చంద్రబాబే ఈమధ్య మళ్లీ స్టార్ట్ చేసిండు… ఇంకా నయం… దిల్ రాజుకు చెప్పి, ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పైసలతోనే మావాళ్లతోనే ఓ సినిమా తీస్తాననలేదు… అక్కడికి సంతోషం… ఏమయ్యా రేవంతం? సమజైతుందా..? ఆట అంటే డబ్బులు రాలాలె… అదే ఫార్ములా… వోకేనా..?! నన్నడిగితే అసలు ప్రభుత్వంలో క్రీడల శాఖే వేస్ట్…
ఏదైనా మంచి డబ్బులున్న కంపెనీని చూడాలె.,. ట్రాఫిక్‌కు అడ్డంగా డివైడర్లు పెట్టాలె… నడి నగరంలో కార్ల పోటీలు పెట్టాలె… కోట్లు అలా జలజలా రాలిపడాలె… ఈయనకు ఎవరు చెబితే అర్థమైతది..!!
Share this Article