Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘పతివ్రత’ ఓ రేంజులో అదరగొట్టింది- అకస్మాత్తుగా మాయమైంది

July 4, 2026 by M S R

.

ఆరుగురు పతివ్రతలు… ఈ సినిమా రీరిలీజు అవుతోందట… అందరూ తెగరాసేస్తున్నారు… రీరిలీజుల్లో పెద్ద వార్తేముంది..? బోలెడు పాత సినిమాల్ని 4కే అనీ, డోల్బీ అని కొత్త ముద్రలు వేసి, వచ్చిన కాడికి మళ్లీ సంపాదిద్దాం అనేదే యావ… ఆల్రెడీ యూట్యూబుల్లో ఉండి, లక్షలాది మంది చూసినవాటినీ థియేటర్లకు పట్టుకొస్తున్నారు…

సరే, మరి ఈ సినిమాకు అంత క్రేజ్ దేనికి..? ఇప్పుడంటే పెళ్లాలు ప్రియులను మరిగి, ఏకంగా మొగుళ్లను ఖతం చేస్తున్న రోజులు కదా… కాబోయే మొగుళ్లను సైతం! నిజం చెప్పాలంటే ఈరోజుల్లో ‘బాడీ కౌంట్’ అనేది అసలు సమస్యే కాదు అన్నంతగా కాలం మారిపోయింది… కానీ అప్పట్లో… అంటే ఆరుగురు పతివ్రతలు సినిమా తీసిన 2004లో, అంటే 22 ఏళ్ల క్రితం ఈ కథ బోల్డ్ అండ్ సెన్సేషనలే…

Ads

ఆరుగురు పత్తిత్తులు, పతివ్రతలు తమ జీవితంలోని ఇలాంటి రహస్య కథల్ని చెప్పుకోవడమే సినిమా… తెలుగు సినిమాల్లో జబర్దస్త్ తరహా బూతుకు, అశ్లీలానికి ఆద్యుడే ఈవీవీ… ఇది తన సొంత సినిమా, ఇక రెచ్చిపోయాడు… అందుకే అప్పట్లో ఓ మలయాళ మసాలా సినిమా చూసినట్టుగా చూశారు  యువప్రేక్షకులు… మరి అప్పట్లో అరచేతిలో స్మార్ట్ ఫోన్లు లేవు, ఆతరహా వీడియోలు కూడా అందుబాటులో లేవు కదా…

ప్రత్యేకించి ఇందులో చెప్పాల్సింది ఎవరూ స్టార్లు లేరు… పాటల్లేవు… కథ, సీన్లు అన్నీ ఈవీవీ మార్క్ జబర్దస్త్ మసాలాలే… మరీ ప్రత్యేకంగా చెప్పాల్సింది ఓ నటి గురించి… పేరు అమృత… స్వతహాగా కన్నడ నటి… ఈ సినిమా ప్రధానంగా ఈమె ఫోకస్‌గా నడుస్తుంది… ఇరగదీసింది… కానీ సినిమా ఫ్లాప్… ఫ్యామిలీ పిక్చర్ కాదు కదా… (యూట్యూబులో ఉంది)…

అమృత

సినిమాలో ప్రధాన ఆకర్షణ అమృత… ఈ సినిమా తరువాత మళ్లీ తెలుగులో నటించలేదు, కన్నడంలో కూడా జోెడీనెంబర్ వన్ (?) లాస్ట్… తరువాత ఏమైంది..? పూర్తిగా మీడియాకు దూరం… పెళ్లి చేసుకుని ఈ ఫీల్డ్‌కు పూర్తిగా దూరమైంది అంటారు… ఎవరికీ వివరాలు తెలియవు… అంత అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది… ఇంట్రస్టింగు..!!

ఈ సినిమా తరువాత ఈవీవీపై బోలెడు విమర్శలు వచ్చాయి… తనేమీ పట్టించుకోలేదు, పట్టించుకోడు కూడా… తను సినిమాలు తీసే ధోరణే అది… ఎందరు ఛీత్కరించినా సరే ఈటీవీ జబర్దస్త్ ఏమైనా ఆగిందా..? ఆగలేదు కదా… అలాగే ఈవీవీ కూడా తన ధోరణిలో తను సినిమాలు తీస్తూ వెళ్లాడు, హాస్యం పేరిట!!

అసలు జనం థియేటర్లకు వెళ్లే రోజులు కావివి… రీరిలీజ్ చేస్తే జనం వెళ్తారా; అప్పట్లోనే జనం తిరస్కరించారు కదా, బోలెడు అశ్లీలం అరచేతిలో ఉంది కదా అంటారా… చూసేవాళ్లు చూస్తారు, ఖర్చేముంది? వచ్చిందంతా అదనపు లాభమే కదా!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘పతివ్రత’ ఓ రేంజులో అదరగొట్టింది- అకస్మాత్తుగా మాయమైంది
  • పోడు వేధింపులకు తెర! ఆదివాసీల మెప్పు పొందిన రేవంత్!
  • రావు బహదూర్‌పై కంప్లీట్ డిఫరెంట్ రివ్యూ! 3.5 గంటల Psychological Trauma…!
  • ALPHA – ఆ పాత్రకు ఆలియా అస్సలు నప్పలేదు – అదే మేజర్ మైనస్!!
  • ఒక చిరంజీవి – ఒక ప్రభాస్ – ఒక పవన్ కల్యాణ్ … ఒక మాధవీలత!!
  • ‘‘తింటే తిన్నారు – ఏ గుడిలో దొంగలు లేరు – ఇవన్నీ దొంగ ఏడుపులు సర్’’
  • ఈ సినిమా అర్థం కావాలంటే… మినిమం పీహెచ్‌డీ చేసి ఉండాలి!!
  • చివరకు AI కూడా చెబుతోంది- హరీష్‌రావు చెప్పేవన్నీ అబద్ధాలేనని!!
  • గడ్డ కట్టిపోయే స్థితిలో…. ఆ చిన్నారిని అలాగే ఎత్తిపట్టుకుని…
  • అంతా ‘మాయ’ – పాక్ ఏదైనా స్మగుల్ చేస్తుంది – చైనా ఏదైనా తినేస్తుంది

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions