Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిజం- ఓటీటీ భ్రమలు బద్ధలయ్యాకే… తెలుగు సినిమా బతుకుతోంది !

August 24, 2026 by M S R

.

( గోపు విజయకుమార్ రెడ్డి ) … తెలుగు సినిమా ఫ్లాప్ హీరోలకు ఇరుముడి నేర్పిన కొత్త పాఠం… స్వామియే శరణం అయ్యప్పా… కాస్త సీరియస్‌గా థింక్ చేయాలి ఇక్కడ… ఎప్పుడైతే OTTని నమ్ముకుని, చెత్త సినిమాలన్నీ తీసి అడ్డికి పావుశేరు సంపాదించుకోవాలనుకున్నారో… అప్పుడే తెలుగు సినిమా థియేట్రికల్ బిజినెస్ సచ్చిపోయింది.

సినిమా బాగుందా? ఆడియన్స్‌కి నచ్చుతుందా? థియేటర్‌కి వచ్చి చూస్తారా? అనే ప్రశ్నల కంటే, “OTT ఎంత ఇస్తుంది?” అన్నదే నిర్మాతల లెక్కగా మారిపోయింది. కానీ ఎప్పుడైతే OTT వాళ్లు సినిమాలు కొనడం తగ్గించి, పెర్ఫార్మెన్స్ బేస్డ్ అమౌంట్‌తో అగ్రిమెంట్లు చేయడం మొదలుపెట్టారో… మళ్లీ మనోళ్లందరూ థియేటర్ల మీద పడ్డారు.

Ads

  • అప్పటి నుంచి కొంచెం మంచి క్వాలిటీతో సినిమాలు రావడం మొదలైంది. గత మూడు నెలల్లోనే దాదాపు 12 సినిమాలు బ్రేక్ ఈవెన్ సాధించడమో, లేక స్టేక్‌హోల్డర్స్ అందరికీ లాభాలు పంచడమో చేశాయి. ఎంతలా అంటే… సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్, వరుణ్ తేజ్, రవితేజ లాంటి హీరోల సినిమాలకూ కనకవర్షం కురిసింది.

ఇరుముడి

దేవుణ్ణే నమ్మని రవితేజకి మళ్లీ ఆ దేవుడే హిట్ ఇచ్చాడేమో! చిన్న టౌన్ నర్సంపేటలో మొన్న ₹200కి బ్లాక్‌లో టికెట్లు అమ్మారట. “మల్లెపూల పల్లకి” పాటను ప్రేక్షకుల డిమాండ్‌తో థియేటర్‌లో రెండోసారి బ్యాక్ టు బ్యాక్ వేస్తున్నారట. ఒకప్పుడు ఇలాంటి సీన్ “ఒసే రాములమ్మ” సినిమాకి B, C సెంటర్లలో కనిపించిందని చెబుతారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి కనిపిస్తోంది.

ఒక్కసారి కంటెంట్‌కి ఆడియన్స్ కనెక్ట్ అయితే రిజల్ట్ ఎలా ఉంటుందో ఇరుముడి మరోసారి చూపించింది. ఇదే ఊపులో ఇప్పుడు మళ్లీ థియేటర్ల లొల్లి మొదలయ్యేలా ఉంది. నెక్స్ట్ బుధవారం యశ్ “టాక్సిక్” వస్తోంది. దాంతో మైత్రి వర్సెస్ దిల్ రాజు క్లాష్ కూడా తప్పకపోవచ్చు.

ఇరుముడి

గత మూడు నెలల్లో జరిగిన మరో ముఖ్యమైన కరెక్షన్ — స్పెషల్ షో పేరుతో అడ్డదిడ్డమైన టికెట్ రేట్లకు బ్రేక్ పడటం. అందరికీ అందుబాటులో ఉండే టికెట్ రేట్లు ప్రేక్షకులను మళ్లీ థియేటర్ల వైపు తీసుకొచ్చాయి.

IPL తర్వాత పెద్దగా సాలిడ్ ఎంటర్టైన్మెంట్ లేకపోవడం కూడా సినిమాలకు కలిసొచ్చింది. ఫలితంగా మళ్లీ సినిమా పార్కింగులు నిండుతున్నాయి… కాంటీన్ సేల్స్ కళకళలాడుతున్నాయి… థియేటర్లలో ప్రేక్షకుల సందడి పెరుగుతోంది.

ఇది కేవలం ఒక సినిమా హిట్ కాదు. ఆడియన్స్‌కి మంచి సినిమా ఇస్తే వాళ్లు థియేటర్‌కి రావడానికి ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నారనే కొత్త పాఠం. OTT థియేటర్‌కి ప్రత్యామ్నాయం కావచ్చు… కానీ మంచి కంటెంట్‌కు థియేటర్ అనుభవం ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదు.

ఇరుముడి

తెలుగు సినిమా ఇప్పుడు ఆ విషయం మళ్లీ నేర్చుకుంటోంది. ఇది తిరుపతి టౌన్ నిన్నటి ఫస్ట్ షో కలెక్షన్స్, 105 ఇయర్స్ తెలుగు ఇండస్ట్రీ చరిత్రలో నిన్న హైదరాబాద్ లో 262 షోస్ కి అన్నీ హౌస్ ఫుల్ … అర్థమవుతోంది కదా… తెలుగు ఇండస్ట్రీకి ఇప్పుడు ఏం కావాలో, పర్టిక్యులర్‌గా ఫ్లాప్‌ల్లో మునిగిపోతున్న హీరోలకు ఏం కావాలో..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Fly dubai – ఎన్నెన్నో కుట్ర కథనాల వ్యాప్తి ! అసలు నిజాలు ఇవీ !!
  • శాస్త్రంతోపాటే విశ్వాసం! అంతరిక్షమైనా.. ఆకాశమైనా.. భగవన్నామ స్మరణే!
  • ఈ ఉగ్ర పైలట్‌ను ఫ్లయ్ దుబాయ్ ఎందుకు నియమించింది?!
  • ఈ పార్వతి పాట… ఇప్పుడు ప్రపంచ చార్ట్‌లో నంబర్ 2 పాట !
  • విక్స్ ! దీని పుట్టుక వెనుక ఓ తండ్రి వేదన- పరిశోధన !!
  • అనగనగా ఓ దొరైస్వామి అనబడు ఓ పాత నటుడి కథ !!
  • కన్నడనాట హిట్టే- తెలుగు వెర్షన్ సో సో… కారణాలు అనేకం…
  • ఓ సైనికుడు- చావుబతుకుల్లో ఓ తండ్రి- ఒక టచింగ్ స్టోరీ
  • ఒకే ఒక చిన్న ఇన్‌స్టా పోస్ట్… ఓ దివాలా జీవితాన్నే మార్చేసింది…
  • “పాపా… ఒక్కసారి నాకు ఫోన్ చేయండి… ప్లీజ్…”

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions