Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చింతించకు… ఎమ్మెల్యేను చేస్తా… మంత్రిని కూడా చేస్తా… రెండేళ్లు ఆగు…

April 21, 2026 by M S R

.

Mohammed Rafee …. కాట్రగడ్డ వెంకట్రామిరెడ్డి ఉద్యోగం ఊస్ట్
– రెండేళ్లు ఆగు, మంత్రిని చేస్తా : జగన్ అభయం
గత రెండేళ్లుగా సస్పెన్షన్ లో వున్న సచివాలయం ఉద్యోగుల సంఘం మాజీ నేత కాట్రగడ్డ వెంకట రామిరెడ్డిని ఉద్యోగం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాశ్వతంగా తొలగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఆయన గత ఎన్నికల్లో వైసిపి పార్టీ తరఫున ప్రచారం చేసినట్లు రుజువు కావడంతో విధుల నుంచి తొలగించింది. ఆయనకు ఇంకా 14 ఏళ్ల సర్వీస్ ఉండటం విశేషం!

కాట్రగడ్డ వెంకట్రామిరెడ్డి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా రెండు దఫాలు పని చేశారు. ఆయన అబ్కారి నిబంధనలు ఉల్లంఘన, ఎన్నికల సంఘం సస్పెన్షన్ వంటి వివాదాలు ఎదుర్కోంటున్నారు.

Ads

ఆర్టీసీ ఉద్యోగులను వైసీపీకి ఓటు వేయమని ఉసిగొల్పారనే ఫిర్యాదుతో వెంకట్రామిరెడ్డిని ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. అనుమతి లేకుండా ఉద్యోగులకు మద్యం పార్టీ ఇవ్వడంతో అబ్కారి శాఖ కేసు నమోదు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఆయన చేసిన తప్పులను నిర్ధారించడంతో ఇవాళ ఆయన్ని విధుల నుంచి ప్రభ్యత్వం శాశ్వతంగా తొలగించింది.

ఇది అన్యాయం : వెంకట్రామిరెడ్డి
ఇది అన్యాయం అని, ఉద్యోగ సంఘాల నేతగా దిశా నిర్దేశం చేశాను మినహా ఏ తప్పు చేయలేదని, ఆధారాలు ఏవీ లేవని, ఏకపక్షంతో 14 ఏళ్ళు సర్వీస్ ఉండగా తొలగించారని, తాను కోర్టుకు వెళ్ళనున్నట్లు వెంకట రామిరెడ్డి ప్రకటించారు.

దారుణమైన ప్రభుత్వం : జగన్
ఒక ఉద్యోగి, పైగా రెండు పర్యాయాలు సచివాలయ ఉద్యోగుల సంఘం నేతగా సేవలు అందించిన వ్యక్తిపై కక్ష కట్టి ఉద్యోగంలోంచి తొలగించడం దారుణం అని, ఆయనకు వైసీపీ పార్టీపై అభిమానం ఉండటమే తప్పా అని వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించినట్లు తెలిసింది. “ఏం పరవాలేదు, న్యాయమే గెలుస్తుందని, ఒకవేళ అక్కడా అన్యాయం జరిగితే ఎమ్మెల్యేను చేస్తా, మంత్రిని కూడా చేస్తా” అని అభయమిచ్చినట్లు తెలిసింది. – డా. మహ్మద్ రఫీ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చింతించకు… ఎమ్మెల్యేను చేస్తా… మంత్రిని కూడా చేస్తా… రెండేళ్లు ఆగు…
  • ఫాఫం హరీషుడు..! మామ పార్టీ నుంచి కత్తిరించబడుతున్నాడా..?!
  • ఒకే ఒక ఇల్లు… మడమ తిప్పని స్వాభిమాన పోరాటం… ఎవరికీ జంకేదే లేదు…
  • The Lost Map … లీలగా ఓ జ్ఞాపకం… వేల మైళ్ల వెతుకులాట…
  • వందోసారి చూస్తున్నా సరే… కఠినాత్ముడైనా సరే… కళ్లు తడుస్తాయి…
  • టీ20 కెప్టెన్‌గా ‘సర్పంచ్ సాబ్‘..! జోరుగా ప్రచారం.., జరిగితే శుభమే..!!
  • లెన్స్‌కార్ట్ బాగోతాల అసలు దోషి ఓనరే… అడుగడుగుకో అబద్ధం, వంచన…
  • ప్రజల్లోకి రీ-ఎంట్రీ..! ఈ ఒక్క సభ కోసమేనా..? ఇక ప్రజల్లోనే ఉంటాడా..?
  • బ్యాక్ టు బేసిక్స్..! పుస్తకాలు- పెన్నులు మళ్లీ…! మనమూ మారదాం..!!
  • మహిళా రిజర్వేషన్లతో డీలిమిటేషన్ లింక్… ఇదుగో క్లారిటీ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions