Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లాయర్ టూ ఐరన్ మ్యాన్..! అస్సాం సీఎం కొడుకు అరుదైన విజయం..!

May 15, 2026 by M S R

.

కొందరు రాజకీయ నాయకుల కొడుకులు తండ్రులకు తలవంపులు… తలనొప్పులు… మరికొందరు రాజకీయ నాయకుల కొడుకులు తండ్రులు తలలెగరేసేలా, తలెత్తుకునేలా ఎదుగుతారు… అవును, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన కొడుకు సాధించిన ఓ విజయాన్ని గర్వంగా షేర్ చేసుకున్నాడు… తలెగరేశాడు… వివరాల్లోకి వెళ్తే…

హిమంత బిశ్వ శర్మ కుమారుడు నందిల్ శర్మ అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటాడు… ప్రపంచంలోనే అత్యంత కఠినమైన క్రీడా పోటీగా పేరుగాంచిన ‘ఐరన్ మ్యాన్’ (Ironman Triathlon) ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు… బెంగళూరులో లా చదువుతున్న ఈ విద్యార్థి, కఠినమైన శారీరక శ్రమతో కూడిన ఈ పోటీలో గెలవడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది…

Ads

ఏమిటీ ఐరన్ మ్యాన్ సవాలు?… సాధారణ అథ్లెట్లు కూడా సాహసించని ఈ పోటీలో మూడు రకాల క్రీడలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాల్సి ఉంటుంది:

3.8 కిలోమీటర్ల ఈత (Swimming)

180 కిలోమీటర్ల సైక్లింగ్ (Cycling)

42.2 కిలోమీటర్ల పూర్తి స్థాయి మారథాన్ (Running)

ఈ మూడింటినీ ఒకే రోజున, ఎటువంటి విరామం లేకుండా పూర్తి చేయాలి… దీనిని పూర్తి చేసిన వారికి ‘ఐరన్ మ్యాన్’ అనే బిరుదు దక్కుతుంది… నందిల్ ఈ ఘనతను సుమారు 16 గంటల వ్యవధిలో సాధించడం విశేషం…

పట్టుదలకు నిదర్శనం.. ఏడు నెలల కఠిన శ్రమ … నందిల్ శర్మ ప్రస్తుతం బెంగళూరులోని ప్రతిష్టాత్మక నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (NLSIU) లో చివరి సంవత్సరం చదువుతున్నాడు… చదువులో బిజీగా ఉంటూనే, ఈ పోటీ కోసం గత 7 నుండి 8 నెలలుగా ఆయన ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు… రోజువారీ క్లాసులు, పరీక్షల ఒత్తిడి మధ్య కూడా తెల్లవారుజామునే లేచి సాధన చేస్తూ తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకున్నాడు…

తండ్రిగా గర్వపడుతున్నా: సీఎం హిమంత … తన కుమారుడి విజయంపై ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు…

  • “నందిల్ సాధించిన ఈ విజయం చూస్తుంటే గర్వంగా ఉంది… ఒక ఐరన్ మ్యాన్‌గా మారడానికి కావాల్సిన క్రమశిక్షణ, పట్టుదల తనలో ఉండటం సంతోషకరం… 16 గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ పోరాటం తన ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందని నమ్ముతున్నాను…” అని పేర్కొన్నాడు…

రాజకీయాలకు దూరం.. వృత్తిపైనే ధ్యాస … సాధారణంగా ముఖ్యమంత్రుల వారసులు రాజకీయాల్లోకి రావడం మనం చూస్తుంటాం… కానీ, నందిల్ విషయంలో సీఎం శర్మ అభిప్రాయం భిన్నంగా ఉంది… తన కుమారుడికి రాజకీయాల పట్ల ఆసక్తి లేదని, ఆయన ఒక మంచి న్యాయవాదిగా స్థిరపడాలని కోరుకుంటున్నట్లు శర్మ గతంలోనే వెల్లడించాడు… ఇప్పుడు ఈ క్రీడా విజయంతో నందిల్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు…

నందిల్ అంటే అస్సామీలో ఆనందాన్ని ఇచ్చేవాడు, విజయాన్ని చేకూర్చేవాడు అని అర్థం… నిజమే కదా…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • లాయర్ టూ ఐరన్ మ్యాన్..! అస్సాం సీఎం కొడుకు అరుదైన విజయం..!
  • త్రిషపై సింగర్ సుచిత్ర అక్కసు ఉత్త మీనింగ్‌లెస్..!
  • కేజ్రీవాల్ లిక్కర్ స్కాం కేసు విచారణలో మరో పెద్ద మలుపు..!!
  • అన్ని బిల్లులకూ ఒకే ప్లాట్‌ఫామ్… తెలంగాణ సర్కారు ఇంట్రస్టింగ్ కసరత్తు…
  • రహస్య స్వర్ణ రాజ భవనం… ఆదానీ, అంబానీ కళ్లు కుట్టేలా…
  • అయ్యో సర్పంచ్ సాబ్..! ప్రీతి జింటాను దెబ్బతీసిన నీతా అంబానీ..!!
  • sugarexportban… ముందు మా దేశ ప్రజలు…. తర్వాతే ప్రపంచ మార్కెట్…
  • ఎర్ర రాజకీయాలకు కొరుకుడుపడని కొయ్య… కేరళ కొత్త ముఖ్యమంత్రి…
  • మనోభావాల యూనివర్శిటీ… విభిన్న కోర్సులకు అడ్మిషన్ల నోటిఫికేషన్…
  • బాధితురాలిని బజారుకు లాగడం పక్కా నేరం, అనైతికం…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions