Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

విజయ్ మెడలో కరుంగాలిమాల..! ఈ నమ్మకం, ఈ మాల విశిష్టత ఏంటంటే..?!

May 6, 2026 by M S R

.

విజయ్ జోసెఫ్ నామినేషన్లు దాఖలు చేసినప్పటి ఫోటోలు చూశారా..? తన మెడలో కరుంగాలి మాల కనిపిస్తుంది… అది అదేనా..? మరోరకం గొలుసా..? ఇది ఏమిటనే సందేహం వచ్చిందా మీకు..? తను క్రిస్టియన్ కదా… మెడలో అది క్రాస్ ఉన్న చెయినా..? తండ్రి క్రిస్టియనే అయినా తల్లి హిందూ బ్రాహ్మిణ్ కదా, ఆమె విశ్వాసాల మేరకు విజయ్ ఏదైనా హిందూ సంబంధ మాలను ధరించాడా..?

అవును, అది కరుంగాలి మాల… ఇది నల్లమద్ది (Ebony) చెట్టు కాండం నుంచి తయారు చేస్తారు… దక్షిణ భారత సంప్రదాయాల్లో, ముఖ్యంగా తమిళనాడులో ఈ మాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది… దీనిని మురుగన్, శివుని అనుగ్రహం కోసం ధరిస్తారు…

Ads

ఇది ప్రతికూల శక్తిని (Negative energy) తొలగించి, రక్షణనిస్తుందని భక్తుల నమ్మకం… ప్రత్యేకించి ఏదైనా కొత్త పనులు చేపట్టే ముందు ఇది విజయాన్ని ఇస్తుందని నమ్ముతారు… అందుకే, విజయ్ నామినేషన్లు వేసేటప్పుడు… విజయం కోసం, ఆత్మవిశ్వాసం పెరగాలని, తన చుట్టూ కమ్ముకుంటున్న నెగెటివిటీని ఛేదించడం కోసం దాన్ని ధరించాడట…

అబ్బే, తను ప్రాక్టీసింగ్ క్రిస్టియన్… ఇవన్నీ నమ్మడు అంటారా..? భలేవారే… నమ్మకాలు వేరు, జనానికి కనిపించాల్సిన నమ్మకాలు వేరు… రాహుల్ గాంధీ ఎన్నికలు రాగానే జంధ్యం ప్రదర్శిస్తూ, తన గోత్రనామాలు చెబుతూ, నేను ప్యూర్ కశ్మీరీ బ్రాహ్మిణ్ అని చెబుతూ గుళ్లూ గోపురాలు తిరుగుతాడు మరిచిపోయారా..? ప్రియాంక గంగాస్నానాలు మరిచారా..?

అంతెందుకు..? జగన్ పుష్కర స్నానాలు, పంచాంగ శ్రవణాలు, రుషికేష్ యాగాలు… షర్మిల తన కొడుకు పెళ్లిని అచ్చంగా హిందూ వివాహ తంతు అనిపించేలా జనం కళ్లను మాయ చేస్తూ జరిపించలేదా..? తరువాత ఏదో మీటింగులో వివరణ ఇచ్చుకున్నారు కదా… ఇలా బోలెడు ఉదాహరణలుంటాయి గానీ… ఇంతకీ విజయ్ భార్య సంగీత హిందూయా, క్రిస్టియనా..? తను మతం మారిందా..?

ఆయన భార్య సంగీత స్వర్ణలింగం నేపథ్యం: సంగీత లండన్‌కు చెందిన శ్రీలంక తమిళ పారిశ్రామికవేత్త స్వర్ణలింగం కుమార్తె…(విజయ్ రూట్స్ కూడా శ్రీలంక)… విజయ్, సంగీత వివాహం ఆగస్టు 25, 1999న జరిగింది… వీరి వివాహం క్రైస్తవ, హిందూ సంప్రదాయాల ప్రకారం నిర్వహించబడింది… ప్రస్తుత మతాంతర వివాహాల్లాగే… ఆమె క్రైస్తవ మతంలోకి మారినట్లు ఎక్కడా అధికారిక సమాచారం లేదు…

మరి… కాబోయే భార్యగా ప్రచారం జరుగుతున్న త్రిష కృష్ణన్..? ఆమె మద్రాసీ అయ్యర్… (తమిళ బ్రాహ్మణ)… సేమ్, విజయ్ తండ్రిలాగే… ఆయన క్రిస్టియన్, ఆయన భార్య శోభ బ్రాహ్మణ… విజయ్ బాట కూడా అదేనా..? సరే, త్రిషతో విజయ్ సంబంధాలు తమిళనాట బహిరంగ రహస్యాలు… ఆమె జంతు ప్రేమికురాలు, జంతు హక్కుల కోసం పోరాడే ‘PETA’ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా పనిచేసింది…

ఆమె పక్కా హిందూ… దేవుడంటే భక్తి… తన బర్త్ డే, విజయ్ పార్టీ ఘనవిజయం ఫలితాలు వస్తున్నవేళ తిరుమల వెళ్లి వెంకన్నకు దండాలు పెట్టుకుని వచ్చింది… సో, విజయ్ విషయంలో కులం, మతం ప్రచారాలు వేరు… అసలు వేరు… అంతా సంక్లిష్టం… మిక్స్‌డ్…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అఖిల్ నటనలో కాస్త మెరుగుదల- ఓ సాదాసీదా తెలుగు సినిమా లెనిన్!!
  • కంగనా రనౌత్… ‘క్వీన్’ కమ్-బ్యాక్ ఆశలపై ‘లీగల్’ మేఘాలు!
  • ఒకసారి పేకముక్కల్లో ఇరుక్కుంటే… జీవితం ఎప్పుడూ ఫుల్ కౌంటే..!!
  • దీపిక పడుకోన్ సరే- హీరోల ‘చిల్లర ఖర్చుల’పై ఎవరైనా నోరెత్తగలరా..?!
  • విజయ్ బాటలో జూనియర్! జూలై 18న ఏం చెప్పబోతున్నాడు?!
  • నిఖార్సుగా, నిజాయితీగా, బేషరతుగా ప్రేమించేవారు ఎవరైనా ఉంటారా?
  • ఏదో ఒకటి గోక్కోవడం అనసూయకు అలవాటే కదా… ఇదీ అదే..!!
  • కేసీయార్ క్షుద్ర జర్నలిజం! అసలు నీరో ఎవరు పెద్ద దొరవారూ!?
  • సర్సర్లే గానీ పాయల్… ఆ కంటెంట్ లేకపోతే సబ్‌స్క్రిప్షన్లు వస్తాయంటావా!?
  • బీఆర్ఎస్ నిధులపై కవిత పేల్చిన పొలిటికల్ కరప్షన్ బాంబు!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions