Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కోటా యూనివర్సిటీలో కర్మకాండల కోర్సు..! పట్టభద్ర పంతుళ్లు..!!

February 2, 2026 by M S R

.

రాజస్థాన్ నుంచి ఓ ఆసక్తికరమైన వార్త. చదువు అంటే కేవలం కంప్యూటర్లో కోడింగ్ రాయడమే కాదు, మన పురాణాల్లోని ‘కోడ్’ను డీకోడ్ చేయడం కూడా అని కోటా వర్సిటీ నిరూపిస్తోంది.

ఏమిటీ కోర్సు? ఎందుకీ ఉత్సాహం? సాధారణంగా డిగ్రీ అంటే బీఏ, బీకాం అనుకుంటాం. కానీ రాజస్థాన్‌లోని వర్ధమాన్ మహావీర్ ఓపెన్ యూనివర్సిటీ (VMOU) మాత్రం ‘కర్మకాండ’ కోర్సు అంటోంది. 12వ తరగతి పాసైతే చాలు.. చేతిలో నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఉంటే చాలు.. మీరు కూడా శాస్త్రీయంగా ‘కర్మకాండ’ నేర్చుకోవచ్చు. అడ్డంకులు లేవు, వయసు పరిమితులు లేవు. అసలు విషయం ఏమిటంటే.. సీట్లు అపరిమితం! అంటే నేర్చుకోవాలన్న తపన ఉండాలే కానీ, వర్సిటీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.

Ads

కర్మకాండల కోర్సు

షోడశ సంస్కారాలు…సిలబస్ అంశాలు మన హిందూ ధర్మంలో పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు 16 రకాల సంస్కారాలు (షోడశ సంస్కారాలు) ఉన్నాయి. నామకరణం నుంచి వివాహం వరకు అన్నీ ఒక పద్ధతి ప్రకారం జరగాలి. ఈ రోజుల్లో చాలామందికి మంత్రం అర్థం కాదు, తంత్రం తెలియదు. పంతులు గారు ఏదో చెబుతారు, మనం ఏదో చేస్తాం. కానీ ఈ ఆరు నెలల కోర్సు పూర్తి చేస్తే, ఆ మంత్రాల వెనుక ఉన్న పరమార్థం ఏమిటో బోధపడుతుంది. పెళ్లిలో ఏడు అడుగుల ప్రాముఖ్యం ఏమిటో, హోమంలో వేసే సమిధల విశిష్టత ఏమిటో శాస్త్రీయంగా తెలుస్తుంది.

కుల మతాలకతీతంగా సంప్రదాయ విజ్ఞానం ఈ కోర్సులో ఉన్న మరో గొప్ప విషయం ఏమిటంటే.. ఇక్కడ కుల ప్రస్తావన లేదు. మత నిబంధన లేదు. సంప్రదాయం మీద గౌరవం ఉండి, నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉన్న ఎవరైనా ఇందులో చేరవచ్చు. డిజిటల్ యుగంలో సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయన్న ఆందోళన ఉన్న తరుణంలో, యూనివర్సిటీ స్థాయిలోనే ఇలాంటి కోర్సులు రావడం విశేషం.

‘సంస్కారాల’ చదువు చదువు అంటే కేవలం ఉద్యోగం కోసం చదివేదే కాదు… మన ఆచారాలు, అందులో దాగిన మనవైన సంస్కారాలు నేర్చుకోవడం, నేర్పడం కూడా చదువేనని ఈ కోర్సు గుర్తు చేస్తోంది. సంప్రదాయం అంటే చాదస్తం కాదు, అది మన జీవన విధానం. కోటా వర్సిటీ వేసిన ఈ అడుగు రేపు మరిన్ని యూనివర్సిటీలకు మార్గదర్శకం కావచ్చు. రేప్పొద్దున మన ఇంటి వేడుకలో ఈ కర్మకాండ కోర్స్ పూర్తి చేసిన ఒక యువ గ్రాడ్యుయేట్ మంత్రాలు చదువుతూ, వాటి అర్థాలు వివరించవచ్చు…… -పమిడికాల్వ మధుసూదన్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కోటా యూనివర్సిటీలో కర్మకాండల కోర్సు..! పట్టభద్ర పంతుళ్లు..!!
  • పొలిటికల్ పంకిలంలోకి… కేంద్ర సర్వీసు అధికారులూ లాగబడుతున్నారు..!!
  • మృత్యువును ఎదిరిస్తూ… 11 రోజులు… ఓడ చుక్కానిపై వలస సాహసం..!!
  • భారీ దాడులతో పాకిస్థాన్ విలవిల…! ఎందుకు బెలూచిస్థాన్ కీలకం..?
  • ఆడ దెయ్యాలు వికృత రూపంతో, వికట ధోరణిలోనే ఉండిపోవాలా..?!
  • GaN … హైటెక్ సెమీ కండకర్ట్ రూపకల్పన… రక్షణరంగంలో మరో విజయం…
  • కమాన్, అంతరిక్షంలోనే తేల్చుకుందాం… అగ్రదేశాల ఎఐ హోరాహోరీ…
  • హనుమంతుడు నేర్పిన ‘కార్పొరేట్ కమ్యూనికేషన్స్’ పాఠాలు…
  • ఏం కష్టమొచ్చిందో గానీ… అందరితోనూ కన్నీరు పెట్టిస్తున్న ఫోటో…
  • విశ్వం విస్తరిస్తోంది సరే, కానీ ఏ ఖాళీలోకి..? అసలు గురుత్వాకర్షణ నిజమేనా..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions