.
కలర్స్… అప్పట్లో మాటీవీలో వచ్చేది ఈ షో… స్వాతిరెడ్డి యాంకర్… సరదాగా చిట్‌చాట్ తరహా ప్రోగ్రామ్… ఈమె యాంకరింగ్ అప్పట్లో చాలామందికి నచ్చాయి… బక్క పలచగా, కాస్త ఇంగ్లిష్ యాక్సెంట్‌తో మాటలు యూత్‌కు కనెక్టయ్యాయి…
స్వాతిరెడ్డి (కలర్స్ స్వాతి) తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, టెలివిజన్ యాంకర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది… పుట్టింది రష్యన్ నగరమైన వ్లాదివోస్టాక్‌లో… తండ్రి ఇండియన్ నేవీలో పనిచేసేవాడు…
Ads
ఆమె చదువు ఎక్కువగా ముంబై, విశాఖపట్నంలో జరిగింది. (ఆమె రూట్స్ తూగో జిల్లా)… ‘డేంజర్’ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది. కానీ అష్టాచెమ్మాలో మహేశ్ బాబు పేరుకు ఫ్యాన్‌గా చేసింది… ‘‘ఆ పేరులో ఎంత జోష్ ఉంది, ఎంత వైబ్ ఉంది’ అనే డైలాగ్ పాపులర్… ర్వాత ‘గోల్కొండ హైస్కూల్’, ‘స్వామి రా రా’, ‘కార్తికేయ’ వంటి చిత్రాలు చేసింది… డబ్బింగ్ కూడా చెప్పేది… అమ్మ చెప్పింది సినిమా డబ్బింగుకు నంది అవార్డు వచ్చింది…
తమిళ, మలయాళ సినిమాలూ చేసింది… మలయాళంలో ఆమెన్ పెద్ద హిట్టు… మధ్యతరగతి అమ్మాయిగా, అందరికీ తెలిసిన అమ్మాయిగా ఆమెకు ఉన్న ‘నెక్స్ట్ డోర్ గర్ల్’ ఇమేజ్ ప్రేక్షకులకు ఆమెను బాగా దగ్గర చేసింది…
హఠాత్తుగా 2018లో మలయాళీ పైలట్ వికాస్ వాసును ప్రేమించి పెళ్లి చేసుకుంది… ఇండొనేషియా జకార్తాలో ఉండసాగింది, నో మూవీస్, నో పబ్లిక్ లైఫ్… చాలామంది తారలకు పెళ్లి తరువాత ఎదురయ్యే ఆంక్షలే కదా ఇవి… రెండు మూడేళ్లకే, అంటే 2020-2021 ప్రాంతంలో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు ప్రారంభమయ్యాయి…
ఆ సమయంలోనే ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ నుండి భర్త ఫోటోలను తొలగించింది. అప్పుడే అందరూ ఊహించారు, ఆ పెళ్లి పెటాకులయ్యాయని!… ఆమె తిరిగి ఇండియాకు వచ్చేసి ‘పంచతంత్రం’, ‘మంత్ ఆఫ్ మధు’ లాంటి సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. అంటే ఆమె దాదాపు 4 నుండి 5 సంవత్సరాలుగా మొదటి భర్తతో తెగతెంపులు… దూరంగా ఉంటోంది… కానీ అధికారికంగా విడాకులు వచ్చేవరకు ఆగినట్టుంది…
మీడియా మీట్లలో ఏమైనా అడిగినా అవాయిడ్ చేసేది… ఇప్పుడు మంత్ ఆఫ్ మధు డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని పెళ్లి చేసుకుంది… శ్రీకాంత్‌కు ఇది మొదటి పెళ్లా..? స్వామికి పిల్లలున్నారా? ప్రశ్నలకు క్లారిటీ లేదు కానీ చాన్నాళ్లుగా శ్రీకాంత్, స్వాతి మధ్య బంధం ఉంది… ఇండస్ట్రీలో చాలామంది తెలుసు… పెళ్లి చేసుకుంటారనీ తెలుసు… మంత్ ఆఫ్ మధు సినిమాతోనే శ్రీకాంత్- స్వాతి పరిచయం, ప్రణయం బలపడి, పరిణయం దాకా వచ్చింది…ఆమే తమ పెళ్లి గురించి తన ఇన్‌స్టా ఖాతాలో వెల్లడించింది… ఇదీ కథ!!
Share this Article