Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒక్కసారి బంధాలు గాడితప్పితే… కథలో ఇక అన్నీ రోత ట్విస్టులే…

February 14, 2026 by M S R

.

వర్తమాన సమాజంలో… భార్యలు భర్తలను అక్రమ సంబంధాల మోజులోపడి, అడ్డువస్తారనే కోపంతో రప్ఫారప్పాడిస్తున్న వార్తలు రోజుకొకటి వింటున్నాం, చదవుతున్నాం… కన్న పిల్లల్ని కూడా కడతేర్చడానికి కూడా సందేహించడం లేదు… హత్య కేసుల్లో ఇరుక్కుని జైళ్లపాలవుతాం అని తెలిసీ ప్రియుళ్లు ఆ సంబంధాల మోజులో సిద్దపడిపోతున్నారు…

వాళ్లతో పోలిస్తే ఈమె కాస్త నయం… పేరు అనితాదేవి… ఉత్తరప్రదేశ్, అలీగఢ్… కూతురి పెళ్లికి అంతా సిద్ధం… కార్డులు పంచారు, పెళ్లిపనులు చేస్తున్నారు… పెళ్లి మరో తొమ్మిది రోజులు ఉందనగా… సదరు అనితాదేవి ఏకంగా తనకు కాబోయే అల్లుడితో కలిసి లేచిపోయింది… ఇంత త్వరగా వాడితో అంత ఆకర్షణ, బంధం ఎలా పెనవేసుకుందో గానీ…

Ads

కుటుంబం, మొగుడు, బిడ్డ, పరువు మన్నూమశానం ఏమీ ఆలోచించలేదు… సరే, పోయారు, అదీ పెళ్లికోసం సమకూర్చుకున్న రెండున్నర లక్షల డబ్బు, నగల్ని కూడా తనతో తీసుకుపోయింది… మొగుడు షాక్… కూతురు నోట మాట లేదు…

విషయం ఊరంతా పాకాక… ఆమె నా పెళ్లామే కాదు, అది చచ్చిపోయింది అనుకుంటా అని భర్త… నాకు తల్లే లేదు అనుకుంటాను అని ఆ బిడ్డ చెప్పుకున్నారు… జనమంతా నవ్వుతున్నారు… ఈలోపు పారిపోయిన అనిత ఓ ట్విస్ట్ ఇచ్చింది… ఏడాది తరువాత…

తను లేపుకొచ్చిన, లేదా తనను లేపేకొచ్చిన రాహుల్ మీద వైరాగ్యం వచ్చేసింది ఆమెకు ఏడాదిలోపే… డబ్బు, నగలు అయిపోయి ఉంటాయి… ఈలోపు మరిదితో రెగ్యులర్ టచ్‌లోకి వెళ్లింది, మరిది అంటే పాత భర్త తమ్ముడే… వాడూ వదినతో కనెక్టయిపోయాడు… రోజూ ఫోన్లు, చాట్లు చూసి రాహుల్‌కు డౌటొచ్చి నిలదీస్తే, అవును, నా మరిదితోనే ఉంటాను అని కొట్లాట స్టార్ట్ చేసింది…

నీతో కాపురం చేయాలని లేదని, మరిదితోనే ఉంటానని చెప్పేసింది … కేసులో నిందితుడు కాస్తా బాధితుడిగా పోలీసుల శరణుజొచ్చాడు… నా భార్య నన్ను మోసం చేసిందనేది తన ఫిర్యాదు… ఎవరు ఎవరిని మోసం చేసినట్టు..? అసలే అక్రమ సంబంధం అందులో ఇక ఉచ్చనీచాలు, మోసాలు విడిగా ఏముంటాయి..?

పోలీసులు పిలిచారు, అడిగారు… అవును, వాడితో ఉండను అని కుండబద్ధలు కొట్టేసింది… ఆమె ఇష్టం అది… పోలీసులు ఏం చేయగలరు..? నీ ఖర్మర భయ్ అని వదిలేశారు… ఈలోపు ఆమె మొదటి భర్త వేరే పెళ్లి చేసుకున్నాడు… పెళ్లి చెడిపోయిన బిడ్డ తండ్రి వద్దే ఉంటోంది… ఆమెకు పెళ్లి ఓ సమస్యే ఇప్పుడు…

ప్రస్తుతం ఆ మరిదితోనే ఉంటోందట… ఆ రాహుల్ గాడు నన్ను బాగా వేధించాడు, బయటికి రానివ్వడు, అందుకే వదిలేశాను అని చెబుతోందట ఊరివాళ్లకు… ఒకసారి సంబంధాలు గాడితప్పాక… ఇదుగో ఇలాగే ఉంటాయి కథలు… మోసగాళ్లు ఎవరు..? బాధితులు ఎవరు..? పోనీలెండి, ఆ పాత భర్త జోలికి మళ్లీ పోలేదు… అక్కడికి తను సేఫ్… బతికిపోయాడు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘మృత్యుంజయా… ఇంతకీ ఈ సినిమా కథేమిటి మహాశయా…’
  • కర్ణ-కృష్ణ సంభాషణ… కౌగిలించుకున్న రెండు సమాంతర రేఖలు…
  • రామ‘దాసుడి నుంచి ఓ పంచముఖ మహాబలిగా పరివర్తన… ఓ పాఠం…
  • అంతటి జయప్రదకు ఆ గంభీర బాధిత పాత్ర… పైగా చంపేశారు…
  • సో వాట్..? దివ్వెల మాధురి ఐతేనేం… టీటీడీకి అంత భయమా..? జడుపా..?
  • గెలిచాం సరే… కానీ ఈ సెమీస్ గెలుపుకీ ఓ పోస్ట్ మార్టం అవసరం…
  • అవును, మేమిద్దరమూ ఒకటే… విజయ్- త్రిష బంధం ఇక బహిరంగమే…
  • ఊగిపోయిన ముంబై… తలెగరేసి మరీ టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్స్‌లో ఇండియా…
  • టీ20 వరల్డ్ కప్..! కెప్టెన్ అనాలోచిత వైఖరే ఇండియాకు పెద్ద బలహీనత..!!
  • స్ట్రాటో ఫోర్ట్రెస్..! అమెరికా గగన వజ్రాయుధం యుద్ధరంగంలోకి..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions