Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గీ బూతులు, గీ పాటలు… అరె, గిట్ల తయారయ్యారేందిర భయ్…

February 20, 2026 by M S R

.

నిన్న ఓ వార్త చదివిన… అదేదో సినిమా… మేన్షన్ హౌజ్ మల్లేష్ అట… హెడింగ్ ఏంటో తెలుసా.,.? మింగలేక మంగళారం… నిజమే, మీరు చదివింది నిజమే… అదే హెడింగ్… ఆ సినిమా పాట టైటిల్ కూడా అదే…

శ్రీనాథ్ మాగంటి హీరో అట… ఇంతకుముందు ఏమైనా చేశాడా, తన నేపథ్యం ఏమిటో తెలియదు… ఎవరో బాల సతీష్ దర్శకత్వం అట… సరే, ఎవరైతేనేం గానీ… ఫస్ట్ సింగిల్, టీజర్లకు మస్తు రెస్పాన్స్ వచ్చింది అని రాస్తూ… మింగలేక మంగళారం లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారని రాసుకొచ్చాడు విలేఖరి…

Ads

ఎవరో సురేష్ బొబ్బలి సంగీత దర్శకత్వం అట… పాడిందేమో బిత్తిరి సత్తి అట… తను గాయకుడైపోయాడు… తనెలా పాడిండు, ఆ ట్యూన్ ఎలా ఏడ్చిందనేది పక్కన పెడితే… ఇక్కడ ఆ పాట టైటిల్ చూడండి ఓసారి…

మింగలేక అనే పదాన్ని అసలు టీావీ షోలల్లో, వర్తమాన సినిమా సర్కిళ్లలో ఏ పదానికి ప్రత్యామ్నాయంగా వాడుతున్నారో వాటిని రెగ్యులర్ ఫాలో అయ్యేవాళ్లకు తెలుస్తుంది… దీన్ని హైపర్ ఆది భాష అంటారు…

— మంగళవారం అనే ముతక బూతు సామెత తెలుసా మీకు..,? అదుగో దాన్ని నేరుగా అనలేక ఇలా ‘మింగలేక మంగళారం’ అని రాసిపడేశారు, పాడి పడేశారు… అవును, పాడి పాడేశారు… ఏం టేస్టుర భయ్ మీది…

మీకన్నా మా యాటిట్యూడ్ స్టార్, కాబోయే మెగా సూపర్ బంపర్ బర్నింగ్ స్టార్ చంద్రహాస్ నయం కదా… కనీసం గుంజీ గుంజీ తరువాత… గు- దగ్గర, పగులదెం- దగ్గర మాటలు మింగాడు, బూతుగా వినిపించకుండా…

ఎవరో తరుణ్ సైదుల్ అట రాసింది… మొత్తం పాట ఏమిటో తెలుసా..? ఎవడో హీరో కావచ్చు, లేదా మరొకడు కావచ్చు… ఏదో పొటెన్సీ సమస్యో లేక స్థంభన సమస్యో లేక శీఘ్రస్ఖలనం సమస్యో… అదీ సందర్భం.,. ఇక లిరిక్స్ మొత్తం అదే మార్మిక భాషలో వినిపిస్తయ్… ఆ అద్భుతమైన లిరిక్స్ ఇక్కడ రాసే సాహసం చేయడం లేదు గానీ…

అర్థమైనవాడికి అర్థమైనంత మహదేవా అని..! అసలు పాటే ఇలా ఉంటే, ఇక సినిమా కథ ఏ బ్రహ్మాండమైన అభిరుచితో సాగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు… అవునూ, గీ బూతులు, గీ పాటలతో గిట్ల తయారయ్యారేందిర భయ్..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమో… కేసీయార్‌ను కూడా ఇలా చూస్తామేమో… డెస్టినీ వదలదు…!!
  • BBB..! BJP- BRS Bhai Bhai..!! ఏమైనా డౌటా..? పదండి వివరాల్లోకి వెళ్దాం…!!
  • కవిత బాటలోనే కనిమొళి..? ఉదయనిధి వారసత్వంపై అసహనం..!!
  • మైండ్‌లెస్ ట్రోలింగ్..! సౌత్ టాప్ స్టార్ల ‘వేషాలు’ మరిచిపోయారా..?!
  • అప్పుడు ముత్తాత… 92 ఏళ్ల తరువాత ఇప్పుడు మునిమనమడు…
  • మళ్లీ అదే 1956 కథ..? అప్పట్లో బ్రిటన్… ఇప్పుడు అమెరికా..! సీన్ రివర్స్..!!
  • సౌందర్య గణితం..! జయప్రద మొహం కొలతలపై ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్..!!
  • కలికాలం..! మనం కన్నవాళ్లను, మనల్ని కన్నవాళ్లనూ నమ్మలేం..!!
  • తెలంగాణ జాతిపిత ఎవరో క్లారిటీ వచ్చేసింది… ఇక రచ్చ ఆపేయండి…
  • రోహిణి సింధూరి..! చీట్… నో క్లీన్ చిట్…! శుద్ధపూస ఏమీ కాదట..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions