Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గుంజి గుంజి… వేదికపైనే పరమ వికారం… సాహిత్యమా..? రోత పైత్యమా..?

February 3, 2026 by M S R

.

ఓ తాజా పాట… సినిమా పేరు బరాబర్ ప్రేమిస్తా… ఫాఫం ఆ టైటిలే సదరు దర్శక నిర్మాతల అభిరుచిని వ్యక్తం చేస్తున్నట్టుగా ఉంది కదా… అందులో ఓ పాట గురించి చెప్పుకుందాం… చంద్రబోస్ రాసిన నాటునాటు పాటకు ఆస్కార్ ఇచ్చారు కదా… ఈ బరాబర్ ప్రేమిస్తాలో గుంజి గుంజి పాటకు నాలుగైదు ఆస్కార్లు పక్కా అనిపిస్తోంది…

ఇవ్వకపోతే ఆస్కార్ నుంచి గుంజి, రాడ్డు తీసేట్టున్నాారు సదరు పాట రచయిత, సింగర్, సంగీత దర్శకుడు… అదిలా స్టార్టవుతుంది… (ఈ పాటను పరిచయం చేస్తున్నందుకు క్షమించాలి పాఠకులు…)

Ads

ఎవడురా ఎవడురా అంత పోటుగాడు… ఇక్కడి వరకూ పర్లేదు, మన వర్తమాన తెలుగు సినిమా సాహిత్యపు ఘన ప్రమాణాల్లోనే ఉంది… పోనీ, ఉందనుకుందాం… రండిరా రండిరా దింపుతాను రాడ్డు అంటాడు వెంటనే సదరు హీరో… యాటిట్యూడ్ స్టార్ అట, పేరు చంద్రహాస్ అట… సంగీతం ధ్రువన్, సింగర్ ధ్రువన్, గీత రచయిత ర్యాపర్ రోల్ రైడా… ఆ సెన్సేషనల్ పాటలోకి వెళ్దాం…

సరే, రండి, రాడ్డు అనేది కూడా మన వర్తమాన సోషల్ మీడియా భాషలోకి వచ్చిచేరిన ఉత్తమ సంప్రదాయమే కాబట్టి అదీ ఆమోదించేద్దాం… పోనీ, ఆమోదనీయమే అనుకుందాం… టచ్ చేసి చూడు, మీ పుచ్చ పేలదా అంటాడు వెంటనే… అదీ మన తెలుగు హీరోల ప్రస్తుత పాత్రలకు తగినట్టే దివ్యంగా ఉంది…

నాకడ్డొస్తే మీ గుడ్డలూడవా..? పగలతోటి పగలకొట్టె వేటలింక మొదలు… మడతపెట్టి, మెడలుపట్టి, దించుతూనే హడలు… నీయక్క, కొడితే ముక్కులకెళ్లి రక్తమొస్తది… గుంజి గుంజి గుంజి పగలపగల కొట్టనా… వాడ్ని పట్టి పట్టి పట్టి బొక్కలిరగగొట్టనా…

నేనొచ్చి ఒకటి పీకితే రగడ రగడ రగడ… నా గ్యాంగులోన నా కాలి తగడ తగడ ……. ఇదే పోకడ, ఇంకా రాసే ఓపిక లేదు, అది వదిలేద్దాం… లిరికల్ వీడియో చాలా రోజులైంది యూట్యూబులో రిలీజ్ చేసి… ఐతే కథ, కథనం అయిపోలేదు, అసలు విషయంలోకి వెళ్దాం…

ఈ సినిమాకు సంబంధించిన ట్రెయిలర్ రిలీజ్ ఈవెంట్ కావచ్చు… ఈ వీడియో చూడండి, ఆ పాటను ఎంత రోతగా పాడుతున్నాడో… గుంజి గుంజి గు- పగులదెం- …. పట్టి పట్టి పట్టపగలు దెం- … అర్థమైంది కదా మన నిర్మాతలు, మన దర్శకుల టేస్ట్ ఏ రేంజులోకి పడిపోయిందో… ఇది సాహిత్యమా, రోత పైత్యమా…

జేడీ చక్రవర్తి విస్తుపోయి వింటున్నాడు… పక్కనున్న ఎవరో పెద్దాయన నవ్వుకుంటున్నాడు… ఎవరో ముగ్గురు మహిళలు ఈ దెం- భాష వింటూ ఇంగ్లిషులో అర్థాలు చెప్పుకుంటున్నారు… ఒకామె పరమానందంతో చప్పట్లు కొడుతోంది… అసలు పాటను ఇలా మార్చి, వేదిక మీద ఈ బూతు, ఈ రోత, ఈ వెగటు పైత్య ప్రదర్శన సింగర్ తప్పా..?

ఈవెంట్ నిర్వాహకులే అలా పాడించారా..? లేక సినిమాలో ఇదే పాట ఉండబోతోందా..? ఈ దెం- భాషాభిరుచి ఎవరిదో గానీ… సోషల్ మీడియాలో ఆల్రెడీ బూతులు మొదలయ్యాయి… దీని బాధ్యులను గుంజి గు- పగుల దెం-… పట్టి పట్టి పట్టపగలు దెం- అంటూ..!! అన్నట్టు ఈ చంద్రహాస్ ఈటీవీ ప్రభాకర్ కొడుక కదా..? తనేమంటాడో ఈ అద్భుత గీతాలాపనపై..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గుంజి గుంజి… వేదికపైనే పరమ వికారం… సాహిత్యమా..? రోత పైత్యమా..?
  • అమెరికా ట్రేడ్ డీల్ – జియో పాలిటిక్స్ – చమురు- హైదరాబాద్ రియల్ ఎస్టేట్..!!
  • ట్రంపు తనే దిగొచ్చాడా..? దింపబడ్డాడా…? ఎందుకు..? ఎలా..? ఏమిటి..?
  • వెండితో బహుపరాక్..! ‘ఫ్యూచర్ ఆప్షన్స్’ కూడా పడిపోతున్నయ్..!!
  • అయోధ్య రామమందిర భవ్య నిర్మాణం ఇంకా ‘పూర్తి కాలేదు’..!!
  • కోటా యూనివర్సిటీలో కర్మకాండల కోర్సు..! పట్టభద్ర పంతుళ్లు..!!
  • పొలిటికల్ పంకిలంలోకి… కేంద్ర సర్వీసు అధికారులూ లాగబడుతున్నారు..!!
  • మృత్యువును ఎదిరిస్తూ… 11 రోజులు… ఓడ చుక్కానిపై వలస సాహసం..!!
  • భారీ దాడులతో పాకిస్థాన్ విలవిల…! ఎందుకు బెలూచిస్థాన్ కీలకం..?
  • ఆడ దెయ్యాలు వికృత రూపంతో, వికట ధోరణిలోనే ఉండిపోవాలా..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions