.
Subramanyam Dogiparthi …. 1988 లో విడుదలయిన హిందీ సినిమా ఇన్సాఫ్ కీ పుకార్ సినిమాకి రీమేక్ తమిళంలో , తెలుగులో తీసారు . హిందీలో ధర్మేంద్ర , జితేంద్ర , అనితారాజ్ , భానుప్రియ ప్రధాన పాత్రల్లో నటించారు . తమిళంలో రజనీకాంత్ , ప్రభు , సీత , గౌతమి నటించారు .
మన తెలుగులో ఈ సినిమాను గురుశిష్యులు టైటిలుతో తీసారు . 1990 లో రిలీజయింది . కృష్ణంరాజు , రాజేంద్రప్రసాద్ , సుమలత , ఖుష్బూ ప్రధాన పాత్రల్లో నటించగా ఇతర పాత్రల్లో రామకృష్ణ , గొల్లపూడి మారుతీరావు , సుధాకర్ , కోట శ్రీనివాసరావు , హేమసుందర్ , మహర్షి రాఘవ , మాడా ప్రభృతులు నటించారు .
Ads
ఫస్ట్ హాఫ్ అంతా అందరూ దొంగలే సినిమాలో జంట చిల్లర దొంగల్లాగా జైలు పక్షులు కృష్ణంరాజు , రాజేంద్రప్రసాద్ సందడి చేస్తారు . జైల్లో ఉండగా ఓ అమాయకుడు మహర్షి రాఘవను వాళ్ళ సెల్లోనే కలుస్తారు . అతను చేయని హత్యా నేరంలో ఇరికించి విలన్లు జైలుకు పంపుతారు . క్లైమాక్సులో అతను తన స్వంత తమ్ముడే అని కృష్ణంరాజుకు తెలుస్తుంది .
అతన్ని కాపాడతామని హామీ ఇచ్చి గురుశిష్యులు విలన్ల వెంట పడతారు . సెకండ్ హాఫ్ లో విలన్లు ఈ ఇద్దరు గురుశిష్యుల కుటుంబాలకు నష్టం చేసినవారే అని గుర్తిస్తారు . ఇద్దరు కలిసి విలన్లను చట్టానికి అప్పచెప్పి తాము ప్రేమించిన అమ్మాయిలను పెళ్లి చేసుకోవటంతో సినిమా శుభాంతం అవుతుంది .
తమిళ , తెలుగు సినిమాలకు ఇళయరాజా సంగీత దర్శకుడు . ఆత్రేయ పాటల్ని వ్రాయగా బాలసుబ్రమణ్యం , చిత్ర పాడారు . గురుశిష్యులు జైల్లో పాడే కుర్చీ కోసం కుస్తీ పడితే జనమంతా పిచ్చోళ్ళేరా అనే పాట బాగుంటుంది .
గణేష్ పాత్రో వ్రాసిన డైలాగులు హాస్యభరితంగా ఉంటాయి . గొల్లపూడి డైలాగులు రాజకీయాల మీద విసుర్లతో ఉంటాయి . బ్లాక్ మనీ , వైట్ మనీలతో పాటు రెడ్ మనీ అని ఓ కొత్త పదాన్ని పరిచయం చేస్తారు గణేష్ పాత్రో . రెడ్ మనీ అంటే దుర్మార్గపు మనీ, నెత్తుటి డబ్బు అన్న మాట . కానీ కృష్ణంరాజు ఇమేజ్‌కు ఆ పాత్ర కేరక్టరైజేషన్ సెట్ కాలేదనిపిస్తుంది. ఏదో పల్లీ బఠానీ సినిమా…
- అన్నట్టు గురుశిష్యులు పేరుతో అక్కినేని, కృష్ణ సినిమా కూడా ఒకటి (1981) ఉన్నట్టుంది… అందులో సుజాత, శ్రీదేవి హీరోయిన్లు… (Sun Nxt లో ఉంది)…
యస్ పి ముత్తురామన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . కృష్ణంరాజు కామెడీ + ఏక్షన్ హీరోగా నటించిన సినిమా . ఆయన అభిమానులు చూసి ఉండకపోతే ట్రై చేయవచ్చు . It’s an action comedy movie .
నేను పరిచయం చేస్తున్న 1243 వ సినిమా… #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
Share this Article