Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మతిస్థిమితం తప్పిన హత్యలు- ప్రతీకారం… ఘటనాఘటన సమర్థత…

March 4, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. It’s a good family , emotional and sentimental action movie . సినిమా పేరు ఘటన… సరస్వతి ఫిలింస్ డివిజన్ వారే కధను తయారు చేసుకున్నట్లు టైటిల్సులో క్రెడిట్ ఇచ్చారు . చిక్కని కధను , తగ్గ స్క్రీన్ ప్లేని తయారు చేసుకున్నారు దర్శకుడు తరణి .

సినిమాలో ఇద్దరు షీరోలు ఉన్నారు . ఒకటి యమున , రెండు లక్ష్మి . కోట శ్రీనివాసరావు క్రూయెల్ విలనీ బాగుంటుంది . అతనికి తోడుగా మా గుంటూరు వాడు ప్రదీప్ శక్తి కూడా బాగా చేసాడు . హీరోగా రాంకీ తన నటనను ప్రదర్శిస్తానికి వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు .

Ads

కధ టూకీగా . యమున , నారాయణరావు అన్నాచెల్లెళ్ళు . ఆ ఊరి చైర్మన్ కోట శ్రీనివాసరావు . సినిమాలో కూడా అయన పేరు కోట శ్రీనివాసరావే . ఎన్నికల్లో తనకు పోటీకి వస్తాడని ఓ అహింసావాదిని బెనర్జీ చేత హత్య చేయిస్తాడు . అప్పుడే అక్కడకొచ్చిన నారాయణరావు ఆ హత్యను చూస్తాడు .

అతన్ని చంపేయటానికి ప్రయత్నిస్తున్నప్పుడు వచ్చిన ఇనస్పెక్టరు విజయకుమార్ని కూడా చంపేసి ఆ నేరం యమున మీద మోపుతారు . విచారణ సమయంలో ఆమెకు మతిస్థిమితం లేదని హాస్పిటల్లో చేరుస్తారు . చనిపోయిన ఇనస్పెక్టర్ భార్య లక్ష్మి జైలర్ . కోట చెంచా బెనర్జీ జైలు నుండి పారిపోతాడు . అతన్ని పట్టుకోవటానికి జైలర్ లక్ష్మి చేయని ప్రయత్నం ఉండదు .

యమునని తన రక్షణలో ఉంచుకుంటుంది లక్ష్మి . యమునని ఓ కోటీశ్వరుడు రాంకీ ప్రేమించి బలవంతంగా తాళి కట్టేసి , ఆమెను మెప్పించి ఒప్పించుకుంటాడు . సాక్ష్యాలను తారుమారు చేసి లాయర్ రాంకీ ప్రయత్నాలను భంగం చేసి వాళ్ళందరూ బయటపడతారు .

యమునకు మతిస్థిమితం లేదని కోర్ట్ మరోసారి తీర్పిచ్చి హాస్పిటలుకు రిఫర్ చేస్తుంది . ఎలాగూ మతిస్థిమితం లేదని కోర్టే చెప్పింది కాబట్టి దానిని ఆసరాగా తీసుకుని కోర్టు ప్రాంగణంలోనే కోటను , ప్రదీప్ శక్తిని షూట్ చేసి తన పగ తీర్చుకుంటుంది . కోర్ట్ మతిస్థిమితం లేనప్పుడు చంపింది కాబట్టి నేరం కాదని విడుదల చేస్తుంది .

మతిస్థిమితం లేదని డాక్టర్ సర్టిఫికెట్ ఉంటే ఏం చేసినా ఏం కాదని అందరికీ తెలిసిందేగా ! ఈ సినిమాలో కూడా అదే జరుగుతుంది . చట్టంలోని లొసుగుని అడ్డం పెట్టుకుని హీరోయిన్/షీరో యమున బయటపడటంతో సినిమా శుభాంతం అవుతుంది .

సినిమాలో సుధాకర్ పాత్ర హాస్యాన్ని బాగా అందిస్తుంది . కౌబాయ్ , జేమ్స్ బాండ్ , కరాటే ఫైటర్ , సూపర్ మేన్ గెటప్పుల్లో కోటను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజుతుంటాడు . ఇతర పాత్రల్లో కుయిలీ , అన్నపూర్ణ , సిహెచ్ కృష్ణమూర్తి , శివాజీ రాజా , వంకాయల  ప్రభృతులు నటించారు .

సినిమా బాగా ఉండటానికి మరో కారణం పాటలు , డాన్సులు . రాంకీ తన మిత్రబృందంతో ఈజీ గోయింగ్ & డబ్బు చేసిన కుర్రాడిగా రెండు బృంద గీతాలు ఉంటాయి . ఆడరా పాడరా , మఛ్ఛారే మజారే అంటూ సాగుతాయి ఆ రెండు . మరో రెండు డ్యూయెట్లు యమున , రాంకీ మీద బాగుంటాయి . మాటిస్తాలే మనసిస్తాలే పాటలో కాస్ట్యూమ్స్ , చిత్రీకరణ బాగుంటాయి . మరో డ్యూయెట్ ప్రియతమా తొలకరి వలపులలోనా . విధి చేతిలో బొమ్మలు సుడీగాలిలో నావలు విషాద గీతం కూడా బాగుంటుంది .

పాటల్ని ఆత్రేయ , వేటూరి వ్రాసారు . బహుశా ఆత్రేయ ఆఖరి సినిమాల్లో ఇది కూడా ఒకటి అనుకుంటా . సత్యమూర్తి డైలాగులు బాగుంటాయి . బి కృష్ణారెడ్డి నిర్మాత . సినిమా యూట్యూబులో ఉంది . చూడతగ్గ సినిమాయే . చూసి ఉండకపోతే ట్రై చేయండి . నటులందరూ బాగా చెసారు . Overall a good movie … (ఇదే పేరుతో మరో తెలుగు సినిమా కూడా ఉంది)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • లేడీ-D @ నిదా ఖాన్…! నాసిక్ మత స్కాం బట్టబయలైంది ఇలా..!!
  • మన అన్ని వ్యవస్థల్లోకీ జొరబడిన ‘టెర్రరిజం’… బహుపరాక్…
  • కొత్త సీన్..! ఈసారి తమిళేతరుల హవా..! ప్రత్యేకించి తెలుగు కులాలు..!!
  • ఆమె కథలో ఎన్ని ట్విస్టులో… ప్రతి ఫేకుగాడికీ ఆ పేరిప్పుడు లోకువ…
  • ఒక పోచారం… ఒక జీవన్‌రెడ్డి… జవాబుల్లేని కొన్ని ప్రశ్నలు…
  • అంజలి కడమ్..! హఠాత్తుగా తెరమరుగు… ఈరోజుకూ అజ్ఞాతమే…!!
  • ఐప్యాక్..! వ్యూహకర్తలు కారు… పక్కా స్కామర్లు… కోట్లకుకోట్ల దందాలు..!!
  • పూలు విసిరితే బాంబు అనుకుని… దళపతి భయంతో పరుగో పరుగు…
  • బీఆర్ఎస్ సైద్ధాంతిక శూన్యం..! కీలక బిల్లులపై ‘అనివార్య నిశ్శబ్దం..!
  • “మోదీ సరికొత్త గణితం..! 3 బిల్లులు – దేశ రాజకీయాల ‘గేమ్ ఛేంజర్’ ప్రణాళిక..!”

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions