.
బరాబర్ ప్రేమిస్తా సినిమా ఈవెంటులో టీవీ నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ పాడిన గుంజి గుంజి అనే బూతు పాట మీద సొసైటీ ఎంత ఏవగించుకుని రియాక్టవుతున్నదో చూస్తున్నాం కదా… దీనికి మరో ట్విస్టు ఏమిటంటే..?
తను సారీ చెప్పడట… ఓ వీడియో రిలీజ్ చేశాడు… వితండవాదం ఏమిటంటే..? గతంలో తనను అనేక బూతులతో తిట్టారట చాలామంది… తన మనోభావాలు దెబ్బతిన్నాయట… కానీ రియాక్ట్ కాలేదట, క్రిటిసిజంలా తీసుకున్నాడట…
Ads
సొసైటీ వాడిన పదాల్లో కేవలం రెండు మాత్రమే తీసుకుని అలా పాడాడట… సమర్థించుకుంటున్నాడు… ఇది మరీ ఎక్స్‌ట్రీమ్… నువ్వు నచ్చని ట్రోలర్స్ నిన్ను ఏదో తిడితే, సొసైటీ మీద ప్రతీకారం చూపించడానికి ఆ బహిరంగ వేదిక మీద ఆ బూతులు పాడావా..? ఇదేం వితండవాదం..? ఇది తన అసలు యాటిట్యూడ్‌ను బయట పెడుతోంది…
ఆ పాట, ఆ బూతులు మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నందుకు సారీ… కానీ ఎందుకు ఇది రాస్తున్నామో తెలియాలి కాబట్టి… ‘‘గుంజి గుంజి గుంజి గు- పగలదెం- , పట్టి పట్టి పట్టి పట్టపగలు దెం-’’ అర్థమైంది కదా…
https://www.facebook.com/reel/1535008107579203
ఇది బూతు పురాణం కాదట… ఒరిజినల్ సాంగ్‌లో లేనిది, తనే ఓ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ఇలా చేశాడట… జర్నలిస్టు, సోషల్ యాక్టివిస్టు, సెన్సార్ బోర్డు మెంబర్ దేవికారెడ్డిని ఎవరో అడిగారు, మీరేం చేస్తున్నారు అని…
‘‘సినిమా పాటలో గనుక అలాంటి పదాలు ఉంటే ఏ పరిస్థితుల్లోనూ బోర్డు సభ్యులు అంగీకరించరు… రెఫ్యూజ్ చేస్తారు… కానీ తను పాడిన పాట ఒరిజినల్ సాంగులో ఈ పదాలు లేవని తనే చెబుతున్నాడు కదా… కానీ ఓ మహిళగా మాత్రం చంద్రహాస్ పాట, పదాలు, ధోరణి మాత్రం అభ్యంతరకరమే’’ ఇది ఆమె వివరణ…

ఇంకా చంద్రహాస్ ఏమంటాడంటే… తన పాట విని అక్కడున్న జర్నలిస్టులు కూడా అభినందించారట, క్లాప్స్ కొట్టారట, అది ఆ జర్నలిస్టుల మెచ్యూరిటీ అట… అక్కడికి వచ్చిన పెద్ద పెద్దవాళ్లు కూడా మెచ్చారట… అదేమిటో వాళ్ల విజ్ఞతకెే వదిలేయొచ్చుగానీ… చంద్రహాస్ తన వీడియోలో బిగ్‌టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్టు వేములపల్లి అశోక్‌ను బెదిరిస్తున్నాడు… ఐదారుసార్లు ప్రస్తావించాడు… (ఈ బూతు పాట వ్యతిరేకిస్తూ అశోక్ ఓ ఫేస్‌బుక్ వీడియో పెట్టాడు…)
‘‘24 గంటల్లో నాకు అపాలజీ చెప్పకపోతే, నీకు ఉంటుందీ… చూసుకో’’ అంటున్నాడు చంద్రహాస్… అనేకమంది చంద్రహాస్ ధోరణిని తిట్టిపోశారు, నెటిజనం దాదాపు మొత్తంగా ఏవగించుకుంది… దీన్ని చంద్రహాస్ తన ధోరణిని జనం అసహ్యించుకుంటున్నారనే కోణంలో గాకుండా బెదిరింపులకు దిగాడు… అదీ మెయిన్ స్ట్రీమ్ మీడియాను…
ఈ సినిమా నిర్మాతో, దర్శకుడో ఈ నెగెటివిటీ మీద స్పందించారో లేదో తెలియదు… బహుశా మంచి పబ్లిసిటీ వస్తుందిలే అనుకుని సంబరపడుతున్నారో కూడా తెలియదు… ఆ ఈవెంటు గెస్టులు జేడీ చక్రవర్తి, జయంత్ పరాన్జీ, ఆది సాయకుమార్ ఏం ఫీలవుతున్నారో కూడా తెలియదు… (ప్రమోషన్ల కోసం ఇలాంటి ధోరణి సరికాదు అని, సంస్కారం కూడా కాదు అని జేడీ చక్రవర్తి స్పందించినట్టు ఓ వార్త)…
అవునూ, సిటీ పోలీసులు గానీ, వుమెన్ కమిషన్ గానీ ఏమైనా గమనిస్తున్నాయా..?! ఇదంతా ఇండస్ట్రీలో కామనే అని లైట్ తీసుకున్నాయా..? అన్నట్టు, ప్రభాకర్, నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నాను అని గతంలో చెప్పినట్టు, నీ బిడ్డను ఇలాగే పరిచయం చేసినట్టు గుర్తు... ఆ బిడ్డ ఇతనే కదా..! గర్వపడు..!!! తెలుగులో జుగుప్స అనే పదం ఉంది, నీకు తెలుసో లేదో...

Share this Article