.
ఈరోజు మొదటి కథనంలో శృతి ద్వివేదీ అని ఓ జ్యోతిష్కురాలి జోస్యం అజిత్ పవార్ విమాన ప్రమాదం విషయంలో ఎలా నిజమైందో చెప్పుకున్నాం కదా… ఇక్కడ సదరు జ్యోతిష్కురాలి గురించి కొన్ని అంశాలు చెప్పుకోవాలి… ఇంట్రస్టింగు…
శృతి ద్వివేది స్వీయపరిచయం చాలా వింతగా ఉంటుంది, అందుకే చెప్పుకోవాలి… తన ట్వీట్టర్ (ఎక్స్ ప్రొఫైల్) లో Psychic, Astrologer, Tarot Reader, Psycho kinetic, wiccan, Hoodoo Expert అని రాసుకుంది… Media personality అని కూడా..! నవ్వొచ్చింది…
Ads
నిజంగానే నవ్వు ఎందుకు వచ్చిందో అర్థం కావాలంటే ఆ పదాలు ఒకసారి చదివితే చాలు… ఇవేం విద్యలో చాలామందికి తెలియదు… మరీ సైకిక్ పేరున్న రెండు విద్యలు ఏమిటో మిస్టరీ… అవే కాదు, ఆమె విద్యలు, విద్వత్తే ఓ మిస్టరీ…
శృతి ద్వివేది పేరు విన్నప్పుడు ఆమె కేవలం జ్యోతిష్యురాలే కాదు, వివిధ రకాల నిగూఢ విద్యల్లో (Esoteric Sciences) ప్రావీణ్యం ఉన్న వ్యక్తిగా ఆమె ప్రొఫైల్ కనిపిస్తుంది… ఆమెకు ఉన్న ఆ విభిన్న నైపుణ్యాల వెనుక ఉన్న అర్థాలు ఏమిటో తెలుసుకోవడానికి కాస్త కష్టపడాల్సి వచ్చింది… ఎఐ కూడా తడబడింది పలుసార్లు… ఓసారి చూద్దాం…

ఆమె సుమారు 20 ఏళ్లకు పైగా జ్యోతిష్య రంగంలో ఉంది… గ్వాలియర్ లేదా హరిద్వార్ వంటి ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న ప్రాంతం నుండి వచ్చి, ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో అప్పుడప్పుడు హల్‌చల్ చేస్తుంటుంది… ‘ఇండియా టుడే’, ‘న్యూస్ 18’ వంటి ప్రధాన మీడియా సంస్థల్లో ఆమె రెగ్యులర్ గెస్ట్… ఆమె కేవలం అంచనాలు చెప్పడమే కాదు, స్పిరిచువల్ మీడియంగా కూడా వ్యవహరిస్తుంది…
-
Psychic (సైకిక్)…: బాహ్య ఇంద్రియాలకు అందని విషయాలను పసిగట్టే శక్తి. అంటే ఒక వ్యక్తిని చూడగానే వారి ఎనర్జీని బట్టి వారి గతం లేదా మనసులో ఏముందో గ్రహించడం… దీనికి ఎటువంటి జాతక చక్రాలు అవసరం లేదు…
-
Astrologer (జ్యోతిష్కురాలు)…: గ్రహ గతులు, నక్షత్రాల స్థితిని బట్టి భవిష్యత్తును అంచనా వేసే శాస్త్రం… ఆమె వేద జాతకం (Vedic Astrology) రమల్ జ్యోతిష్యం (Ramal Jyotish) లో నిపుణురాలు…
-
Tarot Reader (టారో రీడర్)…: 78 కార్డుల డెక్ ద్వారా ఎదుటి వ్యక్తి అడిగే ప్రశ్నలకు సమాధానాలు వెతకడం. కార్డుల మీద ఉండే బొమ్మలు, చిహ్నాలను బట్టి గైడెన్స్ ఇస్తారు…
-
Psycho-kinetic (సైకో-కైనెటిక్)…: ఇది కొంచెం అరుదైనది… మనసు శక్తితో వస్తువులను కదల్చడం లేదా ప్రభావితం చేయడం అని అర్థం…. అయితే, స్పిరిచువల్ కాంటెక్స్ట్‌లో దీనిని “మైండ్ ఓవర్ మ్యాటర్” (సంకల్ప బలంతో పరిస్థితులను మార్చడం) అనే అర్థంలో వాడుతుంటారు…
-
Wiccan (విక్కన్)…: ఇది ఒక రకమైన ప్రకృతి ఆరాధన, మంత్ర విద్య (Witchcraft)… ప్రకృతిలోని శక్తులను (గాలి, నీరు, నిప్పు వంటివి) ఉపయోగించి సానుకూల మార్పులు తీసుకురావడం…. దీనిని “వైట్ మ్యాజిక్” అని కూడా అంటారు….
-
Hoodoo Expert (హుడూ ఎక్స్‌పర్ట్)…: ఇది ఆఫ్రికన్-అమెరికన్ మూలాలు ఉన్న ఒక రకమైన జానపద మాంత్రిక విద్య… మూలికలు, వేర్లు, నూనెలను ఉపయోగించి ఆధ్యాత్మిక చికిత్స లేదా రక్షణ కల్పించడం దీని ప్రత్యేకత…
శృతి ద్వివేది తనను తాను ఒక “స్పిరిచువల్ గైడ్”గా చెప్పుకుంటుంది… ఆమె అప్రోచ్ ఆధునిక, సంప్రదాయ పద్ధతుల కలయికలా ఉంటుంది… అయితే, సైకో-కైనెటిక్స్ లేదా హుడూ వంటి విద్యలు చాలా వరకు వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి… విక్కన్, హుడూ విదేశీ నమ్మకాలు… సైన్స్ పరంగా వీటికి రుజువులు లేకపోయినా, ఆమె చెప్పే “స్విచ్ వర్డ్స్” (Switch Words) లేదా రెమెడీస్ చాలా మందికి మానసిక ప్రశాంతతను ఇస్తాయని ప్రచారం జరుగుతోంది…

ఆమె సక్సెస్‌ఫుల్ జోస్యాలుగా ప్రచారంలో ఉన్నవి… 1. 2019 మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం, 2. నరేంద్ర మోదీ విజయం (2014 & 2019), 3. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుదల కాలంపై అంచనాలు, 4. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు- వైవాహిక చిక్కులు, 5. ఇప్పుడు చర్చల్లో ఉన్నది: అజిత్ పవార్ మరణం…
వేణుస్వామి జ్యోతిష్కుడు, పరిహార పూజల్ని వామాచార పద్ధతిలో చేస్తాడు... కానీ ఈమె పరిచయం చాలా డిఫరెంటుగా ఉంది... ఓసారి స్థూలంగా చదివితే ఆమె మంత్రగత్తె ప్లస్ ఆమె జ్యోతిష్కురాలు ప్లస్ ఆమె ఓ మిస్టీరియస్ స్పిరిట్యుయల్ గైడ్..!!
- చెప్పనేలేదు కదూ… ఆమె ప్రొఫైల్‌లో మరో పదం మీడియా పర్సనాలిటీ… ప్రముఖ నేషనల్ చానెళ్లలోకి చర్చలకు వస్తుంటుంది కదా… అంటే ఇక మీడియా పర్సనాలిటీ అయిపోయినట్టేనా..? భలేదానివమ్మా..!! పాత యండమూరి అయితే నీ విద్యలే కథాంశంగా తులసి, తులసిదళం తరహాలో వేపమండలు ఒకటి రాశేసేవాడేమో..!!
Share this Article