Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లేడీ గెటప్పులో ఈ నరేష్… తల్లి విజయనిర్మలకన్నా అందంగా…

March 30, 2026 by M S R

.

దోగిపర్తి సుబ్రహ్మణ్యం …. మాయాబజార్ సినిమాలోని పాటలు మూడు సినిమాలకు టైటిల్స్ అయితే దాన వీర శూర కర్ణ ‌సినిమాలోని చారిత్రాత్మక పాట చిత్రం భళారే విచిత్రం 1991 జూలైలో వచ్చిన ఈ చిత్రం భళారే విచిత్రం సినిమాకు టైటిల్ అయింది .

యన్టీఆర్ సినిమా పాట కదా ! తగ్గట్లుగానే 24 సెంటర్లలో వంద రోజులు ఆడింది . కేవలం 33 లక్షల బడ్జెట్టుతో తీయబడిన ఈ చిన్న సినిమా సుమారు నాలుగు కోట్లు వసూలు చేసిందని ఓ ఇంటర్వ్యూలో నరేషే చెప్పారు .
ఇంత ఘనవిజయం సాధించిన ఈ సినిమాకు మాతృక బెంగాలీ భాషలోని ఒక నవల . పేరు జై మా కాళీ బోర్డింగ్ . అదే పేరుతో బెంగాలీ భాషలో సినిమా కూడా వచ్చింది . మరాఠీలో , తమిళంలో , కన్నడంలో రీమేక్ అయింది . అన్ని భాషల్లోనూ సక్సెస్ కావటం చాలా విశేషం .

Ads

ఈ సినిమా నరేష్ , బ్రహ్మానందం సినిమా .‌ వాళ్ళిద్దరికి చాలా పేరు వచ్చింది . ముఖ్యంగా బ్రహ్మానందానికి . నీ యంకమ్మ అనే మాట తెలుగు నాట ఊతపదం అయిపోయింది . మాయాబజార్ సినిమాలో గిల్పం , హై హై నాయకా వంటి మాటల్లాగా . బ్రహ్మానందం మేనరిజం కూడా . దేవత విగ్రహం , బొమ్మ , ఫొటో ఏది కనిపించినా దండం పెట్టంకోవటం , ముద్దులు పెట్టుకోవటం , సాష్టాంగ ప్రణామాలు చేయటం కూడా ప్రేక్షకులకు బాగా రీచ్ అయింది .

ఇంక నరేష్ .మన హీరోలు అందరూ ఆల్మోస్ట్ స్త్రీ పాత్రలు వేసినవాళ్ళే . ఇంక యన్టీఆర్ , కాంతారావులు అయితే బృహన్నల పాత్రను కూడా యమా అందంగా వేసారు . అయితే ఈ సినిమాలో నరేష్ కొన్ని సీన్లలో అచ్చు ఆయన తల్లి విజయనిర్మలలాగానే కనిపిస్తారు . బహుశా నరేషే ఎక్కువ అందంగా కనిపించాడు .
చాలా చిన్న కధ . క్లైమాక్సును బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు . నలుగురు స్నేహితులు బ్రహ్మచారులు కావటం వలన అద్దె ఇల్లు దొరక్క వీధిన పడతారు . ఎక్కడకు పోయినా బ్రహ్మచారులకు ఇవ్వం అనటంతో వేషాలు వేసి ఓ కుటుంబాన్నే తయారు చేస్తారు .

భార్యగా నరేష్ , భర్తగా శుభలేఖ సుధాకర్ , మామగారిగా బ్రహ్మానందం , తమ్ముడుగా మహర్షి రాఘవ . అనుకోకుండా నరేష్ లైనేసే రాజీవి ఇంట్లోనే అద్దెకు దిగుతారు . అక్కడి నుండి తమ తమ నాటకాలు బయటపడకుండా ఉండేందుకు పడే తిప్పలే సినిమా అంతా .

ఈలోపు బ్రహ్మానందానికి బిందు ఘోష్ , రాఘవకు జయలత , శుభలేఖ సుధాకరుకు తులసి జోడీలవుతారు . పాపం నరేషుకు శ్రీమంతం కూడా జరుగుతుంది . క్లైమాక్సులో ఇంటి ఓనర్ అన్న ఆస్తి కొరకు ఆమె మీద దాడి చేయటం , నలుగురు స్నేహితులు వాళ్ళతో ఫైట్ చేసి ఇంటి ఓనర్ మనసు గెలుచుకుని నలుగురు ఇంటి వాళ్ళు అవటంతో సినిమా శుభాంతం అవుతుంది .

ఇంటి ఓనరుగా అత్తిలి లక్ష్మి , ఆమె విలన్ అన్నగా కోట శ్రీనివాసరావు , అతని కొడుకుగా జయప్రకాష్ రెడ్డి , ఇతర పాత్రల్లో గిరిబాబు , రావి కొండలరావు , రాధాకుమారి , మా గుంటూరు ప్రదీప్ శక్తి , చిట్టి బాబు  తదితరులు నటించారు .

Shakespeare Twelfth Night అని ఒక నాటకాన్ని వ్రాసారు . ఆ నాటకాన్ని Comedy of Errors అంటారు . ఈ సినిమాని కూడా అలాగే Comedy of Errors గా పరిగణిస్తారు . అలాంటి సీన్లు చాలా ఉన్నాయి సరదాగా . లేడీస్ వాష్ రూంలోకి ఒకామె లేడీ వేషంలో ఉన్న నరేషుని లాక్కోనిపోవటం , వెంటనే ఆమె పరుగెత్తుకుంటూ బయటకు రావటం వంటి కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి .

విద్యాసాగర్ సంగీత దర్శకత్వంలో పాటలన్నీ థియేటర్లో బాగా ఉంటాయి . బ్రహ్మచారులం కర్మవీరులం అంటూ సాగే నలుగురు మిత్రుల వీధి పాట , మద్దెల దరువేయే అనే నరేష్ , అతని బృందం జానపద నృత్య గీతం బాగుంటాయి . నవ్వుకునే మన యవ్వనమే పాట నాలుగు జంటల మీద బాగుంటుంది .

మహాశయా మత్తుగా మెత్తగా హత్తుకో డ్యూయెట్ నరేష్ , రాజీవి మీద బాగా చిత్రీకరించబడింది . నరేష్ శ్రీమంతం పాట కూడా బాగా చిత్రీకరించబడింది . తోటపల్లి మధు డైలాగులను బాగా వ్రాసారు . నీ యంకమ్మా మరి ఆయన ఇన్వెన్షనో , బ్రహ్మానందం ఇన్వెన్షనో తెలియదు .ఎందుకంటే బ్రహ్మానందం విద్యార్ధిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి మాటల్ని ఇన్వెంట్ చేస్తుండేవాడు .

రాజీవి ఈ సినిమా ద్వారానే అరంగేట్రం చేసింది . బలరామ కృష్ణులు సినిమాలో కూడా నటించింది తర్వాత . (రెండుమూడు సినిమాల తరువాత ఆమె ఏమైపోయిందో ఎవరికీ తెలియదు)… ఫుల్ లెంగ్త్ కామెడీ అయిన ఈ సినిమాకు దర్శకుడు పి యన్ రామచంద్రరావు . పాటల్ని వేటూరి వ్రాయగా బాలసుబ్రమణ్యం , చిత్ర , శైలజ పాడారు .

తరచూ ఏదో ఒక టివి చానల్లో వస్తూనే ఉంటుంది . యూట్యూబులో కూడా ఉంది . ఇంతకుముందు చూసి ఉన్నా ఖాళీగా ఉన్నప్పుడు కాసేపు నవ్వుకోవడానికి ఉపకరిస్తుంది . An excellent hilarious entertainer .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మా ఇడ్లీపై పడ్డారేంట్రా బాబూ… మా తిండి కూడా మమ్మల్ని తిననివ్వరా…
  • లేడీ గెటప్పులో ఈ నరేష్… తల్లి విజయనిర్మలకన్నా అందంగా…
  • ఏదో ఒకరోజు… తప్పకుండా వస్తుంది… అప్పుడు ‘గుర్తింపు’ తథ్యం…
  • జాతి రథసారథులు… టాప్-100 వ్యక్తుల జాబితా, పరిచయాలు…
  • నో కేసీయార్… నో జగన్… టాప్-25 జాబితాలో రేవంత్ రెడ్డి…
  • స్వామి పర్వర్షన్‌‌కు తోడుగా కిష్వర్ పైత్యం… మోడీని గోకుతున్నారు…
  • శిఖరాగ్రం నుండి శూన్యం వరకు… రేమండ్స్ విజయపథ్ ‘డెస్టినీ’…
  • శెట్టి గ్యాంగ్ కకావికలు… డబుల్ హేపీతో రష్మిక పకపకలు…
  • బ్రహ్మర్షి విశ్వామిత్ర … ఆకట్టుకోని ఎన్టీయార్ సొంత సినిమా…
  • మీడియా వార్ కాదు… ఇగో వార్… టీవీ5 Vs ఎన్టీవీ… నాయుడు Vs చౌదరి…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions