.
చెప్పుకోవాలి… విదేశీ పరాయి మతాలు దేశాన్ని కబ్జా చేస్తున్న వేళ… హిందువుల్ని తరిమి తరిమి కొడుతున్న వేళ… హిందూ మతమే అస్థిత్వానికి ప్రమాదం ఎదుర్కుంటున్నవేళ… పహెల్గాం దురాగతాల నేపథ్యంలో… మమతా బెనర్జీ వంటి కుటిల, సెక్యులర్ నేతల రాజకీయాల నేపథ్యంలో…
చిన జియ్యర్ అంతకు తక్కువేమీ కాదు అని చెప్పుకోవడానికి సాహసించాలి… ఎవడైతేనేం..? గురు స్థానంలో నిలబడినవాడు తప్పు చేస్తే… శిష్యుడు, భక్తుడు నిలదీయాల్సిన సంక్షోభ వేళ… తప్పుపట్టాలి, తప్పు ఎంచాలి, తప్పని చెప్పాలి, తప్పు గురూ అని మందలించాలి… ఎందుకంటే, తనేమీ దేవుడు కాదు… ఆ లక్షణాలూ లేవు గనుక… గురు గౌరవాన్ని కూడా కాపాడుకోలేని, వర్తమాన సవాళ్లను అర్థం చేసుకోలేని అజ్ఞాని గనుక…
Ads
ఎస్, చెబుతున్నది చిన జియ్యర్ స్వామి గురించే… గురు దూషణకు శిక్షకూ సిద్ధమే… కానీ ఇలాంటి గురువులు ప్రస్తుత హిందూ సమాజానికి ప్రమాదకారులు… ఒకవైపు హిందూ సంఘటన ఈ మతానికి అత్యావశ్యమని అందరూ నెత్తీనోరూ మొత్తుకుంటుంటే… ఇలాంటి వైరసులు అసలైన ప్రమాదకరంగా మారుతున్నారు… తనను స్పాన్సర్ చేస్తున్న పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల పెద్దలకూ ఈ శాపం తగులుగాక…
ఏమంటాడంటే…? ఆది శంకరాచార్యుడు 32 ఏళ్ల వయస్సులో హిమాలయాలకు వెళ్లిపోయాడట… తరువాత మళ్లీ రాలేదట… (తన ఉద్దేశంలో అక్కడే పరమపదించాడని)… కానీ తను స్థాపించానని చెబుతున్న చతుర్మానయ పీఠాలు… అంటే, ద్వారక, పూరీ, జ్యతిర్మఠం, శృంగేరీ పీఠాలు తన స్థాపిత పీఠాలు కాదు…
విజయనగర సామ్రాజ్య స్థాపకులు హరిహర, బుక్కరాయల ఆధ్యాత్మిక సలహాదారుడు విద్యారణ్యుడు స్థాపించిన పీఠాలు ఇవి… లింక్.,.. ఇదుగో…
https://www.facebook.com/reel/1654789882605099
అసలు శంకరాచార్యుడే వైష్ణవుడు… పేరుకు ఎజెండా అదైత్వం…. అని ఏదేదో పేలాడు… (పేలాడు అనే పదం ఉద్దేశపూర్వకంగా వాడిందే)… ఇదే కాదు, రామేశ్వరంలో లింగస్థాపన రాముడి పని కాదు అంటాడు ఓసారి… సమ్మక్క- సారలమ్మల మీద పిచ్చి కూతలు కూస్తాడు మరోసారి…
ఎహె, మేకల్ని తింటే మేక లక్షణాలు వస్తాయని పేలుతాడు ఇంకోసారి… ఇదే కాదు, యాదగిరిగుట్టకు యాదాద్రి అనే పేరు పెట్టి, భద్రాద్రి, వేమాద్రి అనే పిచ్చి నామకరణాలు చేసినప్పుడే ఇదేదో తేడా కేసు అని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సింది…
శ్రీమాన్ కేసీయార్ తెలంగాణ సమాజం మీద రుద్దిన అనేకానేక అవలక్షణాల్లో చిన జియ్యర్ స్వామి అనే కేరక్టర్ కూడా ఒకటి… (రావణ జన్మభూమి, శూర్పణఖ జన్మభూమి అని కొక్కిరించిన కేరక్టర్ కదా… ఫలితం అనుభవించాడు)… ఇంకా చిన్న జియ్యరుడికే దేవుడు పాఠం చెప్పడం లేదు పాపం… (పాపం శమించుగాక)…
ధర్మపురి పోతాడు, లక్ష్మి, నర్సింహుల విగ్రహాలు వేర్వేరు ఉండాలి అంటాడు… యాదగిరిగుట్టలోనూ అదే చెబితే ఆ రెండచోట్ల పూజారులు కన్నెర్ర చేస్తే మళ్లీ అటువైపు వెళ్లలేదు…
తిరుమలలో వేయికాళ్ల మంటపం మీద ఏదో స్వార్థపు రాద్ధాంతం చేయబోయి, భంగపడి… తిరుమలకే రానని అలిగాడు… దేవుడి మీద అలగడం ఏమిట్రోయ్ అని ఆ దేవుడే కోపగించేసరికి, ఈమధ్య వెళ్లినట్టున్నాడు… ప్రతిదీ వివాదమే… మాట, చేత… ఎస్, వర్తమాన హిందూ మత సవాళ్లలో ప్రథమ ‘ఇంటి సవాల్’ ఇలాంటి వాళ్లే..!!
గురువైతేనేం..? ఏ ధర్మ ప్రచారకుడైతేనేం..? వర్తమాన సవాళ్ల నేపథ్యంలో... ఇంకా ఇంకా శైవ, వైష్ణవుల నడుమ విద్వేషాలు, విషాలు, దూరాలను పెంచే ఇలాంటి గురువులు ఉంటేనేం..? లేకపోతేనేం..!!
చివరగా… ద్వైతం ఓ మూఢభావన… అద్వైతం, విశిష్ట అద్వైతం ఆదర్శ మార్గాలు… నాటి ద్వైదీ మతాచరణల కాలం నుంచి, విద్వేషకాలం నుంచి హిందూమతం బయటికొచ్చి తరాలు గడుస్తున్నాయి… ఆస్తికులు అడమెంటుగా లేరు…
శైవం, వైష్ణవంతోపాటు పాటు గ్రామదేవతలను కూడా ఏ భేదభావం లేకుండా భక్తిగా పూజిస్తున్నరోజులివి... ఇలాంటి విద్వేషకుల్ని మనం ఆదరించాలా..?! అయిపాయ్...!! ఆ రామానుజుడు నిన్ను క్షమించుగాక..!!!
Share this Article