Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మన సోషల్ మీడియాలోనే కాదు… అమెరికా సెనేటర్లలోనూ ‘అజ్ఞానులు’…

May 16, 2026 by M S R

.

అమెరికా అంటే నాగరిక సమాజం… బాగా చదువుకుంటారు… కాస్త హేతుబద్ధంగా ఆలోచిస్తారు… సంస్కారమో మన్నోమశానమో ఏడుస్తుంది అనుకుంటామా..? వాళ్లంత ఎడ్డి మొహాలు ప్రపంచంలో ఇంకెవరూ ఉండరు అనిపిస్తుంది కొన్ని ఉదాహరణలు చూస్తే…! అఫ్‌కోర్స్, వాళ్ల రాజకీయ నాయకులైతే మరీనూ… సరే, వార్తలోకి వెళ్దాం ఓసారి…

వీసా దేవాలయంపై అమెరికా సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు: భగ్గుమంటున్న భారతీయులు… హైదరాబాద్ శివార్లలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం చిలుకూరు బాలాజీ దేవాలయం మరోసారి అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది… అయితే ఈసారి అది ఆధ్యాత్మిక కారణాలతో కాదు, అమెరికా సెనేటర్ చేసిన విమర్శల వల్ల… అమెరికాలోని మిస్సోరి రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ సెనేటర్ ఎరిక్ ష్మిట్, చిలుకూరు ఆలయాన్ని ఉద్దేశించి చేసిన “వీసా కార్టెల్” (వీసా మాఫియా) వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి…

Ads

అసలేం జరిగింది? … అమెరికాలో హెచ్-1బీ (H-1B) వీసాల వల్ల స్థానిక అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోతున్నారనే చర్చపై స్పందిస్తూ, ఎరిక్ ష్మిట్ సోషల్ మీడియా వేదికగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు… భారతీయులు వీసా ప్రక్రియను ఒక “కార్టెల్” లాగా వాడుకుంటున్నారని ఆరోపిస్తూ, హైదరాబాద్‌లోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని ప్రస్తావించాడు…

“హైదరాబాద్‌లో వీసా కార్టెల్‌కు ఒక ప్రత్యేక ఆలయం ఉంది… అక్కడ వేలాది మంది భారతీయులు తమ పాస్‌పోర్టులతో ప్రదక్షిణలు చేస్తూ అమెరికా వీసాల కోసం మొక్కుకుంటున్నారు… ఈ వ్యవస్థ గెలవడానికి అమెరికా కార్మికులు పోటీ పడాల్సి రావడం దురదృష్టకరం…,” అని అంటున్నాడు…

భారతీయుల ఆగ్రహం: ‘ఇది జాత్యహంకారమే’… సెనేటర్ వ్యాఖ్యలపై ప్రవాస భారతీయులు, నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు… ఒక ప్రజాప్రతినిధి హోదాలో ఉండి ఒక మతాన్ని, భక్తుల నమ్మకాన్ని కించపరచడం సరికాదంటున్నారు…

  • నమ్మకం vs టెక్నాలజీ..: భక్తులు తమ కోరికలు నెరవేరాలని దేవుడిని ప్రార్థించడం హిందూ సంప్రదాయంలో భాగమని, అది వీసా ఆఫీసర్ నిర్ణయాన్ని ప్రభావితం చేయదని నెటిజన్లు లాజిక్‌ను గుర్తు చేస్తున్నారు…

  • క్రైస్తవ ప్రార్థనలు తప్పు కాదా?…: “క్రైస్తవులు తమ కోరికల కోసం చర్చిలో ప్రార్థించడం ఎలా సహజమో, భారతీయులు గుడికి వెళ్లడం కూడా అలాగే. దీన్ని ‘మాఫియా’తో పోల్చడం సెనేటర్ అజ్ఞానానికి నిదర్శనం” అని ఆగ్రహం వ్యక్తం చేస్తుేన్నారు…

  • రాజకీయ ఎత్తుగడ..: అమెరికాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ, స్థానిక ఓటర్లను ఆకర్షించేందుకు ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో భారతీయులను లక్ష్యంగా చేసుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు…

ఇండియాలోని పర్వర్టెడ్ యాంటీ హిందూ సెక్షన్లలాగే ఈ సెనేటర్ కామెంట్..? ఓ డ్రగ్ కార్టె‌ల్‌కూ భక్తికీ తేడా తెలియని మూర్ఖుడు అక్కడి సెనేటర్… తనను ఎన్నుకున్న వాళ్లు సిగ్గుపడాలీ అంటారా… అవున్లెండి, యథా ట్రంపూ తథా సెనేటరూ… ఇక్కడ మరొకటి చెప్పుకోవాలి, మన వెధవలు రోమ్‌లో రోమన్‌లాగా ఉండరు కదా… రకరకాల సోషల్ అన్‌రెస్ట్ క్రియేట్ చేసే డీజేలు, హీరో వర్షిప్పులూ, ఊరేగింపులు, చెత్తా ప్రదర్శనలు కూడా స్టార్ట్ కావడంతో లోకల్ అమెరికన్లకు మండుతోంది… సహజం…

చిలుకూరు ఆలయ ప్రత్యేకత …. చిలుకూరు బాలాజీ ఆలయాన్ని దశాబ్దాలుగా ‘వీసా గాడ్’ (Visa God) ఆలయంగా పిలుచుకుంటారు… అమెరికా లేదా ఇతర దేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు, ఉద్యోగులు ఇక్కడ 11 ప్రదక్షిణలు చేసి మొక్కుకోవడం, వీసా వచ్చాక 108 ప్రదక్షిణలు చేయడం ఒక ఆచారంగా మారింది… ఈ ఆలయంలో ఎటువంటి హుండీ ఉండదు, విరాళాలు స్వీకరించరు… కేవలం భక్తి, క్రమశిక్షణకు మాత్రమే ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది…


అమెరికా వంటి ప్రజాస్వామ్య దేశంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి, వేరే దేశంలోని మతపరమైన ఆచారాలను తప్పుబట్టడం దౌత్యపరంగా కూడా చర్చనీయాంశమైంది… వీసా నిబంధనలపై విమర్శలు చేసే హక్కు ఉన్నప్పటికీ, నమ్మకాలను కించపరచడం సరికాదన్నదే మెజారిటీ భారతీయుల వాదన…

నిజానికి ఏటా ఇండియా నుంచి వీసా కోసం అప్లయ్ చేసుకునేవాళ్ల సంఖ్యతో పోలిస్తే చిలుకూరుకు వచ్చి ప్రదక్షిణలు చేసే భక్తులు, విశ్వాసుల సంఖ్య జస్ట్, నథింగ్… ఐనా వాడు ఎందుకు ఏడ్చాడు..? మనవాళ్లు అంతగా వాళ్లను ఇరిటేట్ చేస్తున్నారు కాబట్టి… మనవాళ్లకు ఎక్కడెలా బతకాలో సోయి లేదు కాబట్టి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మన సోషల్ మీడియాలోనే కాదు… అమెరికా సెనేటర్లలోనూ ‘అజ్ఞానులు’…
  • SRH vs RCB … భారీ పూనకాలు లోడింగ్… ఇదేం క్రేజురా బాబోయ్…
  • సూర్యను ఆవహించిన ‘కాంతారా’..! ఆ దేవుడు కనిపిస్తాడు… అదే కరుప్పు..!!
  • ‘‘నీకు తైవాన్ కావాలి, సరే… నాకు ఇరాన్ కావాలి, డీల్ ఓకేనా..?’’
  • అసలు ఈ ‘చదివింపులు భోజనం’ తెలుగునాట ఉందా చినరాయుడూ?
  • అన్నీ సమకూర్చాం… కానీ అమ్మానాన్నల్లో ఏమిటీ ఆ అసంతృప్తి..?!
  • Jr NTR – Bunny…! తెలుగు జోసెఫ్ విజయ్ ఎవరు కాగలరు..?
  • ‘‘మేనత్త చోర్- మేనల్లుడు చోర్..! ఎటు కదిలినా ఇవే నినాదాలు..!!
  • లాయర్ టూ ఐరన్ మ్యాన్..! అస్సాం సీఎం కొడుకు అరుదైన విజయం..!
  • త్రిషపై సింగర్ సుచిత్ర అక్కసు ఉత్త మీనింగ్‌లెస్..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions