Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సిద్ధరామయ్యపై క్షుద్రపూజలు, చేతబడి చేయించింది ఎవరు..?

April 23, 2026 by M S R

.

రాజకీయాల్లో క్షుద్ర విమర్శలు సాధారణమైపోయాయి… కడుక్కునే బాధ్యత ఎదుటోడి పని అనుకుంటూ, నోటికొచ్చిన ఏదో బురద ఆరోపణలు జల్లడం కామన్ కదా ఇప్పుడు… మరీ తెలంగాణ రాజకీయాల్లో ఎక్కువ అయిపోయాయి, ఏపీ పాలిటిక్సులో కాస్త మోతాదు ఎక్కువ, అవేమో బూతులు, నిందల మసాలాలు… కర్నాటక కాస్త డిఫరెంట్ కదా… ఈ క్షుద్ర విమర్శలు క్షుద్ర పూజల దాకా వెళ్లిపోయాయి…

నవ్వేవాడు నవ్వనీ, నాకేల చింత అన్నట్టుగా ఉంటాయి అక్కడ రాజకీయ విమర్శలు… కేఎన్ రాజన్న అని ఓ మాజీ మంత్రి ఉన్నాడు… ‘‘ఎప్పుడూ చురుకుగా, దూకుడుగా ఉండే మా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఎవరో చేతబడి చేయించారు, అందుకే ఏడాదిగా స్తబ్దుగా మారిపోయాడు, తన వర్గం మీద దాడులు జరుగుతున్నా స్పందన లేదు, నిస్సహాయంగా మారడానికి- తన సహజ ధోరణికి భిన్నంగా మారిపోవడానికి మంత్రతంత్రాలు, చేతబడే కారణం’ అని చెప్పుకొచ్చాడు…

Ads

ఏముంది..? ఇది డీకే శివకుమార్ మీద విమర్శ… సిద్ధరామయ్యను ఆ కుర్చీ దింపేసి, డీకేను కూర్చోబెట్టాలని కొన్నాళ్లుగా కాంగ్రెస్‌లో అంతర్గతంగా బోలెడు కుంపట్లు, కుట్రలు చూస్తూనే ఉన్నాం కదా… 77 ఏళ్ల సిద్ధరామయ్య తను దిగడు, ఎవడినీ ఎక్కనివ్వడు… ఇదుగో ఇలాంటి క్షుద్ర విమర్శల్ని తన వర్గం వాళ్లతో ఎక్కుపెట్టిస్తాడు… అసలు మంత్రగాడు సిద్ధరామయ్యే…

వచ్చే నెలలో ఇక రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తథ్యం, దానికీ ఈ చేతబడే కారణం అంటున్నాడు రాజన్న… నిజానికి సిద్ధరామయ్య నాస్తికుడు, హేతువాది, ఈ మంత్రతంత్రాలు గట్రా నమ్మడు అంటారు కదా… తనను కూడా లోబర్చుకుని, నిర్వీర్యం చేసిన ఆ చేతబడి పేరేమిటో..? బహుశా డీకే శివకుమార్ కాష్మోరాను ప్రయోగింపజేసి ఉంటాడా… అనే జోకులూ పేలుతున్నాయి…

నిజానికి సిద్ధరామయ్య నాస్తికత్వం కూడా గందరగోళమే… తనను తాను ఒక హేతువాదిగా (Rationalist), సెక్యులర్ వ్యక్తిగా ప్రకటించుకున్నాడు… మూఢనమ్మకాలను వ్యతిరేకిని అని చాటడానికి… చామరాజనగర్ సందర్శిస్తే పదవి పోతుందనే నమ్మకాన్ని తోసిపుచ్చుతూ ఆయన పలుమార్లు గతంలో అక్కడికి వెళ్లాడు… మళ్లీ తనే ఓ సందర్భంలో ‘నేను పూర్తి స్థాయి నాస్తికుడిని కాదు, దేవుడికి వ్యతిరేకిని కాను, కానీ దేవుడి పేరుతో సాగే మూఢనమ్మకాలకు, దోపిడీకి వ్యతిరేకిని’ అని చెప్పుకొచ్చాడు…

తన ఇష్టదైవం ‘సిద్ధరామేశ్వరుడు’ అనీ, అయితే ఆ భక్తి ఓ ప్రదర్శనలాగా ఉండదనీ, ఎక్కువగా బసవేశ్వరుని ‘కాయకవే కైలాస’ (పనే దైవం) సిద్ధాంతాన్ని, సమానత్వాన్ని విశ్వసిస్తాడనీ ఆయన అనుచరగణం చెబుతూ ఉంటుంది… నిజానికి మూఢనమ్మకాలు తనకూ ఉన్నాయి… ఓసారి ఏదో బహిరంగసభలో నిమ్మకాయలతో కనిపించాడు… జేబులో మంత్రించిన నిమ్మకాయలుంటాయని ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు…

పదేళ్ల క్రితం తనకు అధికారిక వాహనంగా ఫార్చూనర్ కొన్నప్పుడు, దానిపై కాకి వాలిందని, దాన్ని వదిలేసి, మరో కొత్త కారు కొని, నిమ్మకాయలు కట్టించాడు, టైర్ల కింద వేసి తొక్కించాడు… తను ‘మూఢ నమ్మకస్తుడే’… ఆ నమ్మకంతోనే డీకే కొట్టాలని అనుకున్నాడా..?

  • ఒకటి మాత్రం మెచ్చుకోవచ్చు… అదే సిద్ధరామయ్య కర్ణాటకలో “మూఢనమ్మకాల వ్యతిరేక బిల్లు” (Anti-Superstition Bill) తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏ ముత్యాలూ కడగబడలేదు… కాళేశ్వరం పిక్చర్ ఔర్ బహుత్ బాకీ హై…
  • సిద్ధరామయ్యపై క్షుద్రపూజలు, చేతబడి చేయించింది ఎవరు..?
  • జేడీ చక్రవర్తి చెప్పిన ఓ కథలో ఆ ముసలి గాడిద ఎవరై ఉంటారబ్బా..?!
  • … చివరకు అలాంటి పాకిస్థాన్ కూడా ఈమెకు సలాం కొట్టింది…
  • తోపులు కాదు, తుప్పాసులు… కోట్లకుకోట్లు పెట్టి కొన్నాను కదరా…
  • ఈమె నోరువిప్పితే… ట్రంపు ఫ్యామిలీ బజారున పడటం ఖాయమేనా…
  • ప్చ్, కష్టం బ్రో… భార్య వేసే ‘గూగ్లీ’ని ఏ భర్త కూడా సిక్స్ కొట్టలేడు..!
  • సరిగ్గా పోల్చాలంటే ఎస్‌.జానకి మీసాలు లేని కిశోర్‌ కుమార్‌..!!
  • నెల రోజుల ముఖ్యమంత్రి … చరిత్ర క్షమించలేదు…
  • నేరగాడి ప్రేమ కథ… ఈ రోతగాడి జీవితంలో మరో ఇంట్రస్టింగ్ పార్శ్యం…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions