Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చైనాలో ఏదో అంతర్గత సంక్షోభం… సైనిక తిరుగుబాటు కుట్ర విఫలం…

January 28, 2026 by M S R

.

Pardha Saradhi Upadrasta …. చైనాలో విఫలమైన సైనిక తిరుగుబాటు? గన్‌ఫైట్? షీ జిన్‌పింగ్‌పై అరెస్ట్ ప్లాన్,  షాకింగ్ వివరాలు

పశ్చిమ బీజింగ్‌లోని జింగ్‌సీ హోటల్ (Jingxi Hotel) కేంద్రంగా జరిగిన ఈ ఘటన ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.

Ads

కెనడాలో నివసిస్తున్న చైనా రచయిత్రి షెంగ్ ష్యూయే (@ShengXue_ca) వెల్లడించిన వివరాల ప్రకారం — 2026 జనవరి 18 రాత్రి, చైనా అత్యున్నత జనరల్ జాంగ్ యౌషియా (Zhang Youxia) , లియూ జెన్‌లీ కలిసి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను అరెస్ట్ చేయాలనే సైనిక తిరుగుబాటు ప్లాన్ సిద్ధం చేశారు.

కూప్ ఎలా ఫెయిల్ అయ్యింది?
ఆపరేషన్‌కు 2 గంటల ముందే ప్లాన్ లీక్ అయింది, ఆ రోజు షీ జిన్‌పింగ్ జింగ్‌సీ హోటల్‌లో ఉన్నాడు, లీక్ సమాచారం అందుకున్న వెంటనే షీ అక్కడి నుంచి బయటకు వెళ్లి, కౌంటర్ అరెస్ట్ ఆపరేషన్ ఆదేశించాడు.

 గన్‌ఫైట్ నిజమేనా?
కొన్ని వర్గాల కథనం ప్రకారం —
– జింగ్‌సీ హోటల్ వద్ద జాంగ్ వర్గం ముందుగా పంపిన సిబ్బంది, షీ ఏర్పాటు చేసిన భద్రతా దళాల మధ్య తీవ్ర కాల్పులు జరిగాయి.

 ఫలితం: షీ వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో 9 మంది మృతి, జాంగ్ యౌషియా వర్గానికి చెందిన డజన్ల కొద్దీ మంది మృతి

అరెస్టులు & క్లీన్ స్వీప్
జాంగ్ యౌషియా, లియూ జెన్‌లీ అరెస్ట్, వారి కుటుంబ సభ్యులందరినీ వెంటనే అదుపులోకి తీసుకున్నారు, షీ తల్లి, సోదరి భద్రత కోసం షెన్‌జెన్ గెస్ట్ హౌస్ పూర్తిగా లాక్‌డౌన్

 ఎందుకు కూప్? ఎందుకు ఇప్పుడు?
విశ్లేషణ: షీ జిన్‌పింగ్ చేపట్టిన నిరంతర సైనిక శుద్ధి (purge) నమ్మకం లేని పాలన ప్రతి ఒక్కరూ టార్గెట్ అవుతారన్న భయం, చివరకు తానే ముందుగా దాడి చేయాల్సిన పరిస్థితి.

 ఇది నాలుగో హత్యా ప్రయత్నమా?
పలు వర్గాల ప్రకారం — ఇంతకుముందు 3 సార్లు షీపై దాడి ప్రయత్నాలు, 2013లో జౌ యోంగ్‌కాంగ్ కేసు తర్వాత షీ 20 రోజులు ప్రజల్లో కనిపించకపోవడం కూడా అదే కారణమన్న వాదనలు. 2024 లో కూడా షి ఆరోగ్యంపై వదంతులు వినపడ్డాయి.

 ఇప్పుడు చైనా ముందు రెండు దారులు మాత్రమే?
1️⃣ షీ జీవితాంతం అధికారంలో ఉండేలా మరింత క్రూర నియంత్రణ
2️⃣ లేదా రాజకీయ–మానసిక ఒత్తిడితో ఆకస్మిక నిష్క్రమణ
🌏 విశ్లేషకుల మాటల్లో — ఇది కేవలం కూప్ కాదు. చైనా కమ్యూనిస్టు వ్యవస్థలో అంతర్గత విరుగుడు.

 ఇది ప్రపంచ శక్తి రాజకీయాల్లో టైమ్ బాంబ్ లాంటి పరిణామం.
చైనా నుండి వార్తలు అంత తొందరగా, సులభంగా బయటకు రావు, అక్కడ మీడియా స్వేచ చాలా తక్కువ, మీడియా అంతా ప్రభుత్వం చేతిలోనే వుంటుంది. ఏది బయటకు చెప్పాలో, చెప్పకూడదో ప్రభుత్వమే నిర్ణయిస్తుంది,

ఇప్పటిదాకా వచ్చిన వార్తలు సోషల్ మీడియా లో వివిధ హాండిల్స్ ద్వారా వచ్చిన వార్తలే. Zhang Youxia అరెస్ట్, దర్యాప్తు వివరాలను చైనా రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది, అవినీతి, బంధు పక్షపాతం అనే కారణాలు మాత్రం చెప్పింది…………. ఇవన్నీ నిజమో కాదో కాలమే సమాధానం చెప్పాలి లేదా అసలు బయటకు రాకపోవచ్చు…. — ఉపద్రష్ట పార్ధసారధి

#PardhaTalks #ChinaCoup #ZhangYouxia #XiJinping #Gunfight #JingxiHotel #BreakingNews #PowerStruggle #MilitaryPurge #WorldPolitics

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చైనాలో ఏదో అంతర్గత సంక్షోభం… సైనిక తిరుగుబాటు కుట్ర విఫలం…
  • వార్త అంటే… కొన్నిసార్లు జనానికి తెలియకూడని సమాచారం కూడా…
  • రేవంత్ రెడ్డి కొత్త చదువు ఎందుకు స్పెషల్..? ఏమిటి ఈ కొత్త పాఠాలు..!!
  • ఆ ఎలుకల చెవుల్లో కోరికలు చెప్పుకోవాలి… తరువాత గణేషుడికి చేరతాయి…
  • 500 ఏళ్ల అబద్ధం… తిమ్మరుసును రాయలు శిక్షించనే లేదు… 
  • సింగిల్ కాలమ్ దాటని కథ… నో, నో… పోస్టుకు ఎక్కువ- కథకు తక్కువ…
  • ‘సింహస్వప్నం’… పేరుకు జగపతిబాబు హీరో… కృష్ణంరాజుదే హవా…
  • చేదు వాస్తవం- నిష్ఠుర నిజం… కేసీయార్ పాలన తీరుతోనే ‘సింగరేణి చీకట్లు’…
  • ట్రంపు ఎంత గోకుతున్నా మోడీ ఎందుకు మౌనంగా ఉన్నాడంటే..?
  • ఒక అచ్యుతానందన్… ఒక శిబూ సోరెన్… పద్మాల్లో మోదీ మార్క్ పరిణతి..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions