.
ఫామ్ హౌజు నుంచి ఫోన్ ట్యాపింగు విచారణ కోసం నందినగర్ ఇంటికి బయల్దేరిన కేసీయార్… అదుగో తుర్కపల్లి, ఇదుగో అల్వాల్… అబ్బో జనం, ఇదుగో జనప్రభంజనం అంటూ పింక్ కూలీ మీడియా ప్రత్యక్ష ప్రసారం… అవునండీ, అది ఏబీఎన్ రాధాకృష్ణ భాషే…
ఆ భాష మీద ఏడ్చేవాళ్లకు తెలియనిది ఏమిటంటే.,.? ఇదే కేసీయార్ మహాకూటమి అడ్డంగా ఫెయిలై, ఇంటి నుంచి బయటికి రాకుండా… (సేమ్, తన పనే అది కదా, ఇప్పుడు ఫామ్ హౌజ్ వదిలి బయటికి రానట్టు) ఉన్న స్థితిలో ఇంటర్వ్యూకు పిలిస్తే… రాధాకృష్ణ, నువ్వు ఓరేయ్ అని పిలుస్తుంటే, కేసీయార్ చాలా హంబుల్‌గా మీరు అని మాట్లాడుతున్నాడు ఆ వీడియోలో… ఇప్పుడు హఠాత్తుగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కులపత్రిక అట, యాంటీ తెలంగాణ అట…
Ads
తను తెలంగాణ వ్యతిరేకి అనేది నిజమే అనుకుందాం… మరి ఇదే కేసీయార్ ఇలాంటి సెటిలర్ల కాళ్లలో ముళ్లు విరిగితే హరీష్ రావుతో కూడి పళ్లతో ముళ్లు తీశారు కదా, సెటిలర్లు అందరూ మావాళ్లే అన్నాడు కదా కేసీయార్…?
ఇద్దరూ జాన్ జిగ్రీ… ఆంధ్రజ్యోతిలో అగ్నిప్రమాదం అనగానే ఆగమేఘాల మీద వెళ్లాడు కేసీయార్, నీకేం కావాలో కోరుకో అన్నాడు… కొండగట్టు ప్రమాదంలో 60 మంది చచ్చిపోతే వెళ్లడు, అంతెందుకు రెండేళ్లుగా తెలంగాణలో ఏ విపత్తు, ఏ ప్రజాసమస్య వచ్చినా హౌజు కదలడు, కిమ్మనడు… ఇదోరకం వింత ప్రజాజీవితం..? జనం ఏవగించుకునేలా…
పైగా అడుగడుగునా నిరసన అట… కేసీయార్‌ను టచ్ చేస్తే తెలంగాణకు టచ్ చేసినట్టేనట… ఓ తిక్క బాష్యం… మరి తెలంగాణ ఇచ్చిన సోనియా ఏమైంది..? కోట్ల ఉద్యమకారులు ఏమయ్యారు..? బీజేపీ ఏమైంది? వేల జేఏసీలు ఏమయ్యాయి…? నీ కుటుంబ కక్కుర్తి సంపాదన, నీ దిక్కుమాలిన దొరతనానికి బలైపోయిన వాళ్ల మాటేమిటి..? తెలంగాణ అంటే కేసీయారా..? మరి రేవంత్ రెడ్డి ఆంధ్రుడా..? కిషన్ రెడ్డి ఆంధ్రుడా..?
ఇప్పుడు ఫోన్ ట్యాపింగు విచారణకు వెళ్తుంటే అనేకచోట్ల జనసమీకరణ, నినాదాలు, బలప్రదర్శనలు… మరి ఈ ఖడ్గ తిక్కన కాళేశ్వరం విచారణకు వెళ్తుంటే ఏమైపోయారు జనం..? ఓ మిత్రుడు వెక్కిరించినట్లు ఈ తిక్కన గల్వాన్‌లో పోరుకు పోతున్నాడా..? కార్గిల్‌లో యుద్ధానికి వెళ్తున్నాడా..? తీరా చూస్తే, ఇంటికి తిరిగి వెళ్లాక మళ్లీ కనిపిాంచడు… ది గ్రేట్ తను సాధించిన తెలంగాణ జనం ఏమైపోయినా సరే… దొర గుణం..!!

పింక్ హౌండ్స్ ఏమిటేమిటో అరుస్తారు..? పడనివాళ్లపై ముద్రలూ వేస్తారు..? ఎవరో ‘ముచ్చట’ స్టోరీలు షేర్ చేసుకుంటే… దాన్ని ఫేక్ న్యూస్ గ్యాంగ్ అంటారుట… కామెర్ల కళ్లకు అందరూ పచ్చగానే కనిపిస్తారు… కాళేశ్వరం విచారణకు లేని హడావుడి… మరి ఈ ఫోన్ ట్యాపింగు విచారణ దగ్గర హంగామా ఏమిటి..? అదీ అరకొర, ఎక్కడా పెద్ద ప్రభావం లేనట్టు..?
ఎందుకంటే..? ఈరోజుకూ ప్రజాజీవితంలో లేని నాయకుడికి విశ్వసనీయత గానీ, ధిక్కార తెలంగాణ అభిమానించే పోరాటగుణం లేదు కాబట్టి..! ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ భాషలో చెప్పాలంటే..?
‘‘వరుసగా పరాభవాలు, పరాజయాలు… పంచాయితీ ఎన్నికలు, జుబ్లీ హిల్స్ ఎన్నిక ఫలితాలతో కంగు తిని… మళ్లీ ఇప్పుడు పుష్కరకాలం తరువాత తెలంగాణ సెంటిమెంటును పండించాలి, చంద్రబాబును బూచిగా చూపాలి అనే ఎత్తుగడ… అందుకే పదే పదే రేవంత్- చంద్రబాబు సంబంధాలు, ఏదో బాబు చెప్పగానే రేవంత్ తెలంగాణ ప్రయోజనాలు బలిపెడుతున్నట్టు గాయిగత్తర…
ఎవరి రాజకీయ జీవితం వాళ్లదే… ఆంధ్రా తెలంగాణ పంచాయితీలు ఇప్పట్లో తేలవు, తెమలవు… గురువు లేదు, శిష్యుడు లేడు… కానీ పదే పదే రేవంత్ మీద చంద్రబాబు ముద్ర వేసుకుని పబ్బం గడుపుకోవాలని ఖడ్గతిక్కన బ్యాచ్ ప్రయత్నిస్తే పింక్ పుట్టి నిండా మునుగుతుంది, బహుపరాక్…!! రేప్పొద్దున మోడీ చేరదీసినా సరే, ఫాయిదా హంబగ్..!!
Share this Article