Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కాంగ్రెస్‌లో నిమజ్జనం..? కర్మ ఎదురుతన్నడం అంటే ఇదే మరి..!!

June 11, 2026 by M S R

.

టీఎంసీలో మమతను వ్యతిరేకిస్తున్న చీలికవర్గం ఎంపీలు గానీ, ఎమ్మెల్యేలు గానీ పార్లమెంటులో లేదా అసెంబ్లీలో ప్రత్యేకవర్గంగా గుర్తించబడలేరు, సొంత పార్టీ ప్రకటించలేరు, అలా చేస్తే అనర్హత పాలవుతారు, వెరసి బీజేపీలో విలీనమే దిక్కు… (టూథర్డ్ నంబర్ ఉన్నా సరే)… ఇది ఇంతకుముందు కథనంలో చెప్పుకున్నాం కదా…

మరి మమత వెంట మిగిలిపోయే ఆ అరకొర ఎంపీలు, ఎమ్మెల్యేల గతేమిటి..? మస్తు సంపద ఉంది పార్టీ దగ్గర అధికారికంగానే… కానీ అభిషేక్ బెనర్జీ పార్టీని ఇంకా భ్రష్టుపట్టిస్తాడననే భయం ఉంది… ఇక పార్టీని సువేందు అధికారి వేటాడతాడనీ తెలుసు… బయటికి వెళ్తే జనం తంతున్నారు… సో, మమత మీద ఒత్తిడి… కాంగ్రెస్‌లో కలిసిపోదాం…

Ads

ఇండి కూటమి మీటింగు పేరిట ఢిల్లీ వెళ్లిన మమతకు కూడా సోనియా చెప్పింది ఇదే… ఉద్దరించింది చాలు, కాంగ్రెస్‌లో నీ పార్టీని నిమజ్జనం చేసెయ్ అని… అభిషేక్ బెనర్జీకి మంచి పార్టీ పదవి ఇస్తామనీ ఆఫర్ ఇచ్చింది… సో, తేల్చుకోవాల్సింది మమతే…

అదే జరిగితే… బెంగాల్‌ను మరో బంగ్లాదేశ్‌గా మార్చిన ఓ తాటకి పార్టీ నిలువునా చీలి, ఓ ముక్క బీజేపీలో, మరో ముక్క కాంగ్రెస్‌లో కలిసిపోతున్నట్టు లెక్క… ఏ ప్రవాహం నుంచి ఓ పాయగా బయటికొచ్చి రాజకీయం చేసిందో, ఆ పాయను మమత తనే మళ్లీ ప్రధాన నదిలోకి కలిపేస్తున్నట్టు లెక్క… కర్మ ఎదురుతన్నడం అంటే ఇదే…

దీనివల్ల మమతకు ఫాయిదా ఏమిటి..? సోనియాకు ఫాయిదా ఏమిటి..? కాంగ్రెస్ టీఎంసీ బాపతు ముస్లిం వోట్లతో పుంజుకుంటుందని సోనియా ఆశ… సువేందు వేట నుంచి ఓ జాతీయ రక్షణ దొరుకుతుందని మమత ఆశ… (ఆల్రెడీ అభిషేక్ అండ్ గ్యాంగ్ మీద కేసులు, వేటలు మొదలయ్యాయి…) అయితే సోనియా ఆశ నెరవేరకపోచ్చు… సీపీఎం మళ్లీ యాక్టివేట్ అయిపోవచ్చు… ఆ విశ్లేషణ గణాంకాలు మళ్లీ వేరు…

మమతా బెనర్జీతో పాటు కాంగ్రెస్‌లోకి వెళ్లగల లోక్‌సభ ఎంపీలు:  అభిషేక్ బెనర్జీ, మహువా మోయిత్రా, సుదీప్ బందోపాధ్యాయ్, కళ్యాణ్ బెనర్జీ, కీర్తి ఆజాద్… రాజ్యసభ ఎంపీలు: సాగరిక ఘోష్, డెరెక్ ఓ బ్రైన్, డోలా సేన్… అఫ్‌కోర్స్, వీళ్లు వస్తామన్నా బీజేపీ మాత్రం దగ్గరకు రానివ్వదు, కాంగ్రెసే శరణ్యం…

విలీనానికి మమత ఏయే షరతులు పెట్టిందనేది ఊహాగానాలే తప్ప, దేనికీ నిర్ధారణ లేదు… ఎఐసీసీ ఉపాధ్యక్షురాలుగా పదవి, ప్లస్ రాజ్యసభ సభ్యత్వం, రాజ్యసభలో పార్టీ లీడర్‌ను చేయాలనే షరతులు అట… అవసరం మమతది, సో, సోనియా పెద్దగా అంగీకరించకపోవచ్చు… బేషరతుగా వచ్చి నిమజ్జనం అయిపో అని చెప్పి ఉంటుంది…

(కాంగ్రెస్, టీఎంసీ కలయిక... తెలంగాణలోని మా ఏరియాల్లో ఓ మాటను గుర్తుచేస్తాయి... ఉసికె ముడి, పెండ మూడి కలిసినట్టు... అదెవరికీ ఫాయిదా కాదు, కాకపోతే పాత గూండారాజ్ సీపీఎంకు మళ్లీ కాస్త ప్రాణం పోసినట్టు...)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వర్తమాన రాజకీయాల్లో విజయశాంతి ‘ఆశయం’ నెరవేరేనా..?
  • కాంగ్రెస్‌లో నిమజ్జనం..? కర్మ ఎదురుతన్నడం అంటే ఇదే మరి..!!
  • ప్రత్యేక వర్గం, సొంత కుంపటీ కుదరవు… బీజేపీలో విలీనమే దిక్కు…
  • మోడీ తరువాత ఎవరు..? ఓ కొత్త బ్లూ ప్రింట్ సిద్ధమైపోతోందా..?!
  • ఈ ‘జాగీర్దారు’ ఇంకా గోకుతూనే ఉన్నాడు తెలంగాణ సమాజాన్ని..!!
  • ఈయన్ని ఇంకాస్త డిఫరెంటుగా, లోతుగా అర్థం చేసుకుందాం ఇలా…!
  • భేష్ సింగరేణి… తవ్వి వదిలేయలేదు… పచ్చగా ప్రకృతికి తిరిగి అప్పగింత…
  • టైమ్ ట్రావెల్… ఇండియన్ సినిమాలో ఈ కథతో ఇదే తొలిసారి…
  • ఫాఫం విష్ణుప్రియ..! చివరకు ఆ చీప్ జబర్దస్త్ షోలోనూ సెటైర్లు..!!
  • హక్కుల బాలగోపాల్ స్మృతి… ఒక వాస్తవిక గణితం…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions