Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

స్వర్ణదేవాలయం తరహాలో టీటీడీ చట్టం తెస్తాడట చంద్రబాబు..?!

February 24, 2026 by M S R

.

నిన్న వాట్సప్ న్యూస్ గ్రూపుల్లో ఓ వార్త కనిపించింది… అదేమిటంటే..? అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం (హర్మిందిర్ సాహిబ్) నిర్వహణ తీరు, అక్కడ అమలయ్యే చట్టం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది కదా, అచ్చంగా అదే చట్టాన్ని టీటీడీలో అమలు చేయాలనే ఆలోచనతో సమగ్ర అధ్యయనం చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించాడని ఆ వార్త సారాంశం…

ఎస్, ఇదొక డైవర్షన్ టాక్టిస్… జగన్‌ను హిందూ ద్రోహిగా, వెంకన్న ద్రోహిగా, కోట్లాది హిందూ మతస్తుల ద్రోహిగా ‘జంతుకొవ్వు’ లడ్డూను పదే పదే ప్రచారంలోకి తీసుకొస్తుంటే చంద్రబాబే దోషిగా మారుతున్నాడు… అనాలోచిత ప్రచారం… పొలిటికల్ ఫాయిదా కోసం ఓ విఫల ప్రయత్నం, భ్రష్టం కూడా…

Ads

నిజంగా జగన్ అండ్ కో తిరుమలను ఎంత భ్రష్టుపట్టించారో జనం మొత్తం చూస్తోంది, వింటోంది, చదువుతోంది… సుప్రీం కనుసన్నల్లో సాగిన సీబీఐ సిట్ విచారణ జంతుకొవ్వును గాకుండా నెయ్యి గాని నెయ్యిని చూపించింది… హిందూ మతమనోభావాలను మరీ దెబ్బతినకుండా సంయమనం పాటించినట్టు అనిపించింది… గతంలో ఎన్డీడీబీ ల్యాబ్ జంతుకొవ్వు అవశేషాలు చెప్పినా సరే, సిట్ దాన్ని పక్కన పెట్టేసింది…

కానీ చంద్రబాబు వదలడం లేదు… పదే పదే జంతుకొవ్వు పేరిట జగన్‌ను ద్రోహి ద్రోహి అని చెబుతోంది… ఆ జంతుకొవ్వును మళ్లీ జనంలోకి తీసుకురావడం కోసమే మాజీ సీఎస్ దినేష్ కుమార్ కమిషన్ వేశారనేది బహిరంగ రహస్యం… పక్కా పొలిటికల్ మూవ్…

  • అలాగని జగన్ అండ్ కోకు ఎవడూ సర్టిఫికెట్ ఇవ్వనక్కర్లేదు… ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి… వీళ్ల బాస్ జగన్ తిరుమలను ఎంత భ్రష్టుపట్టించాలో అంత భ్రష్టుపట్టించారు… నెవ్వర్ ఇన్ ది హిస్టరీ… మతపిచ్చి ఢిల్లీ పాదుషాలు, అదే రేంజ్ టిప్పు సుల్తాన్‌కు కూడా చేతకానంత తీవ్రంగా..!!

కానీ ఎక్కడో ఓ ఫుల్ స్టాప్ పడాలి, కానీ చంద్రబాబు పడనివ్వడు… ఇప్పుడట, ఏకంగా టీటీడీకి అమృత్‌సర్ తరహా చట్టం తీసుకొస్తాడట… చంద్రబాబు మార్క్ రాజకీయాలు తెలిసినవాడెవడూ నమ్మడు… అబ్బో, చంద్రబాబు మరీ ఆదర్శప్రాయమైన వెంకన్న సేవ చేస్తున్నాడనే ఓ క్షుద్ర ప్రచారం కోసం ఈ ఎత్తుగడ… ఎందుకంటే..?

తిరుమల

కాస్త వివరంగా చెప్పుకుందాం…

1. స్వర్ణ దేవాలయం చట్టం (Sikh Gurdwaras Act, 1925) ఈ చట్టం బ్రిటీష్ కాలంలో సిక్కు గురుద్వారాల నిర్వహణ కోసం రూపొందించబడింది… దీని ప్రధాన ఉద్దేశం దేవాలయాలను స్వతంత్రంగా, రాజకీయ జోక్యం లేకుండా నిర్వహించడం…

  • ఎన్నికైన కమిటీ (SGPC)…: స్వర్ణ దేవాలయంతో పాటు ఇతర ముఖ్యమైన గురుద్వారాలను శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC) నిర్వహిస్తుంది… ఈ కమిటీ సభ్యులు సిక్కు ఓటర్ల ద్వారా ఎన్నికవుతారు… అంటే భక్తులే తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు…

  • రాజకీయ జోక్యం ఉండదు..: ప్రభుత్వానికి ఈ కమిటీలో లేదా దేవాలయ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చే అధికారం ఉండదు…

  • సేవా భావం (Seva)…: గురుద్వారాలో పనిచేసే వారు లేదా భోజనశాల (Langar) నడిపేవారు స్వచ్ఛందంగా సేవ చేస్తారు… ఇది ఖర్చును తగ్గించడమే కాకుండా ఆధ్యాత్మికతను పెంచుతుంది…

  • ఆర్థిక పారదర్శకత..: నిధుల వినియోగంపై పూర్తి స్థాయి ఆడిటింగ్ ఉంటుంది, భక్తులకు వివరాలు అందుబాటులో ఉంటాయి…

ttd


2. టీటీడీకి ఈ చట్టం సాధ్యమేనా..?  ప్రస్తుతం టీటీడీ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ చట్టం (Endowments Act) పరిధిలో ఉంది… దీని ప్రకారం ప్రభుత్వం బోర్డు సభ్యులను, ఛైర్మన్‌ను నియమిస్తుంది… స్వర్ణ దేవాలయ చట్టం తరహాలో మార్పులు చేయాలంటే ఈ మార్పులు అవసరం…

  • స్వయంప్రతిపత్తి (Autonomy)…: బోర్డు సభ్యుల నియామకంలో రాజకీయ జోక్యం ఉండకూడదు… కేవలం నిబద్ధత గల భక్తులు లేదా ఆధ్యాత్మిక వేత్తలకు మాత్రమే అవకాశం దక్కాలి…

  • నిధుల రక్షణ…: గురుద్వారా చట్టం ప్రకారం నిధులు కేవలం మతపరమైన, సామాజిక, సేవా కార్యక్రమాలకే వాడాలి… టీటీడీ నిధులు ఇతర ప్రభుత్వ అవసరాలకు మళ్లించకుండా గట్టి నిబంధనలు రావాలి…

  • పారదర్శకత…: టెండర్లు, నియామకాలు, దర్శన టిక్కెట్ల కేటాయింపులో లోపాలు లేకుండా, సిక్కు మోడల్ లాగా ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి…

  • నిర్వహణ మెరుగుదల…: స్వర్ణ దేవాలయంలో భక్తులకు కల్పించే సౌకర్యాలు, ముఖ్యంగా ఉచిత భోజనం (అన్నప్రసాదం) పంపిణీలో వారు పాటించే టెక్నాలజీ, క్రమశిక్షణ అవసరం…

 

tirumala



చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని చూసిన ఎవరికైనా ఇలాంటి మార్పులు టీటీడీలో తీసుకువస్తాడని ఆశించడం అసాధ్యం… అయితే, ఈ “స్వర్ణ దేవాలయ చట్టం” అధ్యయనం వెనుక ఉన్న రాజకీయ, గత నేపథ్యాన్ని తటస్థంగా విశ్లేషిస్తే కొన్ని ఆసక్తికరమైన కోణాలు కనిపిస్తాయి…

స్వర్ణ దేవాలయం (SGPC) తరహాలో పూర్తి స్వయంప్రతిపత్తి ఇవ్వడం అంటే, టీటీడీపై ప్రభుత్వానికి ఉండే పట్టును పూర్తిగా వదులుకోవడం… టీడీకి వచ్చే వేల కోట్ల ఆదాయం, దాని ద్వారా జరిగే సామాజిక కార్యక్రమాలపై ప్రభుత్వ ప్రభావం ఉంటుంది… పూర్తి స్వయంప్రతిపత్తి ఇస్తే ప్రభుత్వం ఆ ‘పవర్’ కోల్పోతుంది…

  • నియామకాలు…: బోర్డు మెంబర్ల పదవులు సాధారణంగా రాజకీయంగా కీలకమైన వారికి ఇచ్చే ‘బహుమతులు’…. వాటిని వదులుకోవడం ఏ రాజకీయ నాయకుడికైనా కష్టమే…

laddu

ప్రచారం కోసమేనా? (Political Strategy)

గత కొంతకాలంగా టీటీడీలో లడ్డూ కల్తీ వ్యవహారం, అన్యమతస్థుల నియామకాలు వంటి వివాదాలు తీవ్రమయ్యాయి… ఈ తరుణంలో “మేము వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నాం, రాజకీయం లేని బోర్డును తెస్తున్నాం” అని చెప్పడం ద్వారా హిందూ ఓటు బ్యాంకును, భక్తుల విశ్వాసాన్ని కాపాడుకోవడం ఒక వ్యూహం కావచ్చు…

మరోవైపు వెంకన్న ఫోటోలను కూడా చట్టసభల్లోకి తీసుకొచ్చి రచ్చ చేయడం ద్వారా కూటమి, వైసీపీ రెండూ ఇంకా ఇంకా తిరుమల పవిత్రతను కాలరాచే ప్రయత్నాలు చేస్తున్నాయి… ఎవడికైనా వాడి పొలిటికల్ ఫాయిదాయే ముఖ్యమైపోయింది… మధ్యలో హెరిటేజ్ పెరుగు, నెయ్యి సరఫరా వంటి ఆరోపణలతో వైసీపీ డైవర్షన్ టాక్టిస్ ప్రయోగిస్తున్నా హిందువులు మాత్రం ఎవరూ నమ్మడం లేదు…

అసలు విషయానికి వద్దాం… బీఆర్ నాయుడిని పట్టుకొచ్చారు… అన్యమతస్తులను తరిమేస్తాం అన్నారు… ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు… ఎఐ వ్యవస్థ తీసుకొచ్చి దర్శనాల్ని తక్కువ వ్యవధిలో కల్పిస్తాం అన్నారు… జీరో ఆచరణ… చంద్రబాబు తరహా రాజకీయంలో ఇవేమీ జరగవు…

laddoo

రాజకీయం… అది ఎవరైనా సరే, తిరుమల మీద ఆధిపత్యాన్ని వదులుకోవడానికి ఇష్టపడదు… మరీ ప్రత్యేకించి చంద్రబాబు వంటి ప్యూర్, టిపికల్ పొలిటిషియన్ అస్సలు వదులుకోడు… నిజంగా తను ఈ మార్పులు చేయగలిగితే, అంటే స్వర్ణదేవాలయం తరహా రాజకీయ జోక్యాలు లేని గుడినిర్వహణను తీసుకురాగలిగితే మొత్తం హిందూ ధార్మిక వ్యవస్థ తనకు జేజేలు పలుకుతుంది…

నీకు నిజంగా చేతనవుతుందా మిస్టర్ చంద్రబాబూ..?! కనీసం, నీ సంకల్పంలో నిజాయితీ ఉందా..?!  టెండర్లు, నియామకాలు, కొనుగోళ్లు, దర్శనాలు, వీవీఐపీల అడుగులకు మడుగులు... అన్నింట్లోనూ సర్వభ్రష్టమే కదా...

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • స్వర్ణదేవాలయం తరహాలో టీటీడీ చట్టం తెస్తాడట చంద్రబాబు..?!
  • ఎల్ మెంచో..! ఓ సాధారణ తోట కూలి నుంచి భీకరమైన ‘డ్రగ్ డాన్’ దాకా..!!
  • ఆపరేషన్ సిందూర్ విజయం… విరిగిన పాకిస్థాన్ అణు వెన్నెముక…
  • మిత్రమా బొగ్గుల శ్రీనివాస్… ఇందుకే నేను స్పందించలేదు…
  • శెభాష్ రెడ్డీ..! ఎందరో ఎంతో సంపాదిస్తారు, సొసైటీకి తిరిగి ఇచ్చేవాడో తోపు..!!
  • మావోయిస్టు లొంగుబాట్లకు తెలంగాణ పోలీసుల ఫినిషింగ్ టచ్..!!
  • ఓడినందుకు కాదు బాధ..! ఓడిన తీరే సగటు ఫ్యాన్‌కు మంటెక్కించింది..!!
  • 1961 లో ఎన్టీయార్… 1990 లో చిరంజీవి… అదే జగదేకవీరం… అతిలోక సుందరం…
  • బయటికి కనిపించని రంగుల మాయాలోకం… ముంబై నైట్ లైఫ్…
  • కాలం మారిపోతోంది..! భారతీయ వైవాహిక వ్యవస్థలో ఓ నిశ్శబ్ద విప్లవం..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions