Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రతిష్టంభన..! తగ్గని గవర్నర్…! తలైవా కథ సుప్రీం కోర్టు వైపు..?

May 8, 2026 by M S R

.

తమిళ ప్రజలు డీఎంకేను తిరస్కరించారు… అన్నాడీఎంకేను ఆమోదించలేదు… అదేసమయంలో టీవీకే విజయ్‌కు పూర్తి అనుకూలతనూ కట్టబెట్టలేదు… ఇక చదరంగం ప్రారంభమైంది… మెజారిటీ కోసం విజయ్ డీఎంకే భాగస్వామ్య పక్షాల సహకారం తీసుకుంటే… మళ్లీ పరోక్షంగా డీఎంకే పెత్తనమేనని బీజేపీ భావిస్తోందా..? అందుకే పీటముడి బిగిసిందా..?

డీఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ బయటికి వచ్చి విజయ్‌కు జై అంటోంది… అది చెప్పినట్టు తమిళనాడు ప్రభుత్వం ఆడుతుందని ఆశ… లెఫ్ట్, మరో పార్టీ కూడా విజయ్‌కు సపోర్ట్ చేసినా అభ్యంతరం లేదని స్టాలిన్ అంటున్నాడు… అంతేకాదు, విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వాలని, మేం అడ్డుకోమనీ స్పష్టత ఇస్తున్నాడు…

Ads

అంటే బలనిరూపణ సమయంలో గైర్హాజరయినా ఆశ్చర్యం లేదు… కానీ విజయ్ ప్రభుత్వం పరోక్షంగా డీఎంకే ‘బయటి నుంచి మద్దతు’ పొందుతున్నట్టుగా ఉంటుంది పరిస్థితి… తను అసలే స్టాలిన్, వెరీ సీనియర్, తెలివైన ఆటగాడు… సో, అస్థిరత… అనిశ్చితి… ఒకరకంగా ప్రతి కీలక బిల్లుకూ, బడ్జెట్ ఆమోదానికి కూడా డీఎంకే సహకారం తప్పనిసరి… మళ్లీ డీఎంకే కూటమి మాటే చలామణీ అయ్యే సిట్యుయేషన్… అన్నాడీఎంకే కూటమి సభ్యురాలిగా బీజేపీకి అది నచ్చదు… నచ్చడం లేదు…

యుద్ధం, రొమాన్స్ మాత్రమే కాదు… రాజకీయాల్లోనూ ఏదీ తప్పు కాదు, ఎవరి ఆట వాళ్లు ఆడతారు… ఇదీ అంతే… తమిళనాడులో ఇప్పుడు జరుగుతున్నది కేవలం ఒక ప్రభుత్వం ఏర్పాటు మాత్రమే కాదు, రాబోయే దశాబ్ద కాలం రాజకీయ సమీకరణాల పునాది… నిజానికి VCK, కాంగ్రెస్, లెఫ్ట్ గనుక విజయ్ (TVK)కి మద్దతు ఇస్తే, అది ఆయనకు ఒక రకంగా ‘ముళ్ల కిరీటం’ లాంటిదే… దీని వెనుక ఉన్న అసలు చిక్కుముడులు ఏమిటంటే..?

ఒకవేళ డీఎంకే కూటమిలోని పార్టీల మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, ప్రతి బిల్లుకు, ప్రతి నిర్ణయానికి ఆయన వారిపై ఆధారపడాల్సి ఉంటుంది… బయట నుంచి మద్దతు ఇచ్చినా, లోపల చేరినా… డీఎంకే కనుసన్నల్లోనే ఆ పార్టీలు నడుస్తాయి కాబట్టి, విజయ్ తన ‘సొంత మార్కు’ చూపించలేడు…

డీఎంకే, అన్నాడీఎంకే గనుక ఒక్కటై నన్ను ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటే… టీవీకే 108 సభ్యులమూ రాజీనామాలు చేస్తామని విజయ్ అంటున్నాడు… ఇదీ చిక్కుముడి… విజయ్ ‘సింగిల్ లార్జెస్ట్ పార్టీ’గా ఉన్నప్పటికీ గవర్నర్ ద్వారా ఒత్తిడి పెంచడం వెనుక ఉన్నబీజేపీ వ్యూహం… తను డీఎంకే ‘ఇన్ డైరెక్ట్ ఫోల్డ్’లోకి వెళ్లకుండా నిరోధించడం… అవసరమైతే రాష్ట్రపతి పాలన వైపు తీసుకుపోవడం…

గవర్నర్ గనుక తన ధోరణికి తను అలాగే కట్టుబడి ఉంటే… కథ సుప్రీంకోర్టుకు చేరుతుంది… కపిల్ సిబల్, సింఘ్వీ వంటి లాయర్లు తమ వాదనలను పదును పెడతారు… గవర్నర్ తరఫున ఎలాగూ సొలిసిటర్ జనరల్ సరేసరి…

ఒకవేళ రాష్ట్రపతిపాలనే వస్తే మొత్తం టీవీకే ఎమ్మెల్యేలను కాపాడుకోవడం విజయ్‌కు కష్టం కావచ్చు కూడా… అందుకే అన్నాడీఎంకేలో చీలిక అనేది విశేష ప్రాధాన్యం సంతరించుకుంది… సో, ద్రవిడ రాజకీయాల నడుమ ఓ సినిమా నటుడి కొత్త పార్టీ తన అస్థిత్వాన్ని ఎలా కాపాడుకోగలదనేదే అసలు ప్రశ్న… ఇప్పుడప్పుడే జవాబు దొరికే సూచనలైతే లేవు… డెడ్‌లాక్ అంటే ప్రతిష్ఠంభన… ఆట ఢిల్లీ ఆడుతోంది కాబట్టి..!! 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్రతిష్టంభన..! తగ్గని గవర్నర్…! తలైవా కథ సుప్రీం కోర్టు వైపు..?
  • ‘‘తమిళ గవర్నర్ తప్పు లేదు… స్పష్టత కోరడం న్యాయసమ్మతమే’’
  • సీఎం సాబ్, నీ కడుపు సల్లంగుండ..! మెచ్చుకునే నిర్ణయం చెప్పావు..!!
  • విజయ్ వెనుక మాస్టర్ బుర్ర…! పళనిస్వామిపై పగ తీర్చుకున్నాడు..!!
  • మగవాదం..! ‘‘సుమతీ శతకం’’పై ఓ సైకలాజికల్ అనాలిసిస్…!!
  • ఐ-ప్యాకప్…! సోషల్ మాఫియాపై పార్టీల భ్రమలు ఎగిరిపోయాయ్…!!
  • ఎన్నో ఆత్రేయ పాటల్లో- పదాల్లో ఉర్దూ గజల్ స్థాయి అభివ్యక్తి..!
  • Next Telangana..! ఆశ సహజమే..! ఓసారి తమిళ ఫలితంతో పోలిస్తే..?!
  • శోభన్‌బాబును చంపేస్తే ప్రేక్షకులు ఊరుకుంటారా..? ఛఫో అనేశారు..!
  • తలైవా… Time to Lead…! నాడు జయలలిత గేటు ముందు విజయ్..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions