Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సూర్యకుమార్ కెప్టెన్సీ వైఫల్యాలు కాటేయకపోతే… గెలుపు మనదే…

March 8, 2026 by M S R

.

దేశమంతా ఓ ఫీవర్ ఇప్పుడు… టీ20 వరల్డ్ కప్… మోదీ స్టేడియంలో జరగబోయే ఫైనల్స్ మ్యాచు కోసం కోట్లాది ఇండియన్ ఫ్యాన్స్ అంతా రెడీ అయిపోతున్నారు… రెడీ కావడం రకరకాలు…

క్రికెట్ సెలబ్రిటీలు మాత్రమే కాదు, సినిమా, పాలిటిక్స్, ఇండస్ట్రీస్ తదితర అనేక రంగాల సెలబ్రిటీలు కూడా మోదీ స్టేడియానికి ఆల్రెడీ చేరుకుంటున్నారు… పట్టణాలు, నగరాల్లో హోటళ్లు, బార్లల్లో ప్రత్యేక స్క్రీన్లు గట్రా రెడీ…

Ads

కానీ ఏమాటకామాట అందరిలోనూ ఓ భయం, ఓ సందేహం… ఈ సూర్యకుమార్ అనే కేరక్టర్, తనకు తోడుగా ఓ గౌతమ్ గంభీర్ అనే మరో కేరక్టర్ ఏం చేస్తారోనని…

నో డౌట్… ఇప్పుడున్న టీమ్‌లో కొందరు ఫామ్‌లో ఉన్నారు, కొందరు ఫామ్ తప్పి కొట్టుకుంటున్నారు… అసలు ఫామ్ తప్పిన కెప్టెన్ సూర్యెకుమార్… బ్యాటింగులో ఫూర్ ఫామ్… తనకున్న చరిత్ర ఏమిటి, తను ఆడుతున్నది ఏమిటి..?

ఓ బ్యాటర్‌గా కొడతాడో, పడిపోతాడో పక్కన పెడితే… కెప్టెన్‌గా దారుణమైన ఫెయిల్యూర్… అసలు అదే ప్రధాన ఆందోళన… (గెలిచినా ఓడినా ఇదే తన లాస్ట్ మ్యాచ్ అంటున్నారు, థాంక్ గాడ్…)

ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్స్, బ్యాటర్‌ను బట్టి బౌలర్‌ను దింపడం తనకేమీ చేతకావడం లేదు… అసలు రెగ్యులర్ బౌలర్‌ను వదిలి శివమ్ దూబే వంటి ధారాళ పరుగుల దానకర్ణుడికి పదే పదే, చివరకు లాస్ట్ ఓవర్ కూడా ఇవ్వడం అంటే క్రికెట్ క్రీడా ప్రపంచం ఆశ్చర్యపోలేదు, నవ్వింది… ఫాఫం అన్నట్టుగా.,.

వరుణ్ చక్రవర్తి టాప్ వన్ టీ20 బౌలర్, కానీ ఏం సుఖం… ఫామ్‌లో లేడు… ఎదుటి టీమ్ వద్దంటున్నా సరే, పర్లేదు బ్రదర్ రన్స్ తీసుకొండి అన్నట్టు బౌల్ చేస్తున్నాడు… ఈరోజు తనూ ఆడతాడు…

అర్షదీప్ వైడ్స్, నోబాల్స్… బౌలింగ్ బేసిక్స్ కూడా మరిచిపోతున్నాడో అన్నట్టుగా బాల్స్ వేస్తున్నాడు ఈమధ్య… టాప్ స్టార్ బుమ్రా ఒక్కడే బాధ్యతతో బౌల్ చేస్తున్నాడు, తననేమో సూర్యకుమార్ సరిగ్గా వాడుకోడు.., వివక్ష అని కాదు, వాడుకునేే విచక్షణ, తెలివిడి లేకపోవడం…

బ్యాటర్లలో సూర్యకుమార్ తనే ఓ ఫెయిల్ కేరక్టర్… తోడుగా అభిషేక్ శర్మ అనే మరో ఫెయిల్యూర్ కేరక్టర్… అసలు వీళ్లతో ఆ న్యూజిలాండ్‌ను ఎలా గెలుస్తారు అనేదే సగటు ఇండియన్ ఫ్యాన్ ఆందోళన… ఉన్నంతలో…

సంజూ శాంసన్ వోకే… ఫామ్‌లో ఉన్నాడు… ఇషాన్ కిషన్, తనదైన రోజు వస్తే దేవుడు కూడా ఆపలేడు… తిలక్ వర్మ గుడ్, బాధ్యత తెలిసినవాడు… ఎటొచ్చీ కాసేపు నిలబడాల్సింది సూర్యకుమార్, హార్డిక్ పాండ్యా… బ్యాటింగు వరకూ శివమ్ దూబే వోకే…

అక్సర్ పటేల్ మొన్నటి మ్యాచులో బ్రహ్మాండమైన క్యాచులు పట్టాడు… అసలు క్యాచులు, ఫీల్డింగు అంటే రింకూ సింగ్… ఇలా బోలెడు ప్లస్సులు, తోడుగా మైనస్సులు… అందుకే సగటు ఇండియన్ ఫ్యాన్‌లో ఆందోళన…

న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ గనుక రెచ్చిపోతే..? అసలే ఫిన్ అలెన్ టైప్ విధ్వంసులు… అందుకని ఆట రసవత్తరంగానే ఉండబోతోంది.., ఏకపక్షం ఏమీ కాదు… ఎంజాయ్ చేద్దాం…!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మీడియా వార్ కాదు… ఇగో వార్… టీవీ5 Vs ఎన్టీవీ… నాయుడు Vs చౌదరి…
  • ఆట ఆడితే, ఆడిస్తే కోట్లు జలజలా రాలాలె… మేం అస్సలు ఆడం పో…
  • యుగాంతం..! విశ్వ వినాశనం దిశలో అమెరికా- రష్యా ప్రాక్సీ వార్..!!
  • మీరు క్రికెట్ ప్రేమికులా..? ఐతే తప్పకుండా ఓసారి చదవాల్సిందే…
  • ‘కోడి మెడ’..! ఒవైసీ చేతికి చిక్కుతుందా..? బెంగాల్ ముఖచిత్రమేంటి..?!
  • పాపం కమలహాసన్..! త్యాగమో, వైరాగ్యమో, సన్యాసమో… హిట్ వికెట్..!
  • సదరు ప్రవచనకర్తకు అస్సలు నచ్చని 2 వార్తలు..! అవేమిటంటే..?!
  • సారా కొంటేనే రేషన్ పంపిణీ… వ్యభిచారానికి చట్టబద్ధత… ఇంకా..?
  • ఐటీ హబ్ మాత్రమే కాదు… ‘మంచి’రేవులకు భక్తి పర్యాటక వైభోగం…
  • జగదానంద కారకా… జయ జానకీ ప్రాణనాయకా… శుభ స్వాగతం…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions