.
భవిష్యత్తు వెలుగులు…: ఆకాశం నుంచి కరెంటు vs భూమిపై సూర్యుడు! ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ‘విద్యుత్ కొరత’… దీనికి చెక్ పెట్టేందుకు జపాన్, చైనా రెండు వేర్వేరు మార్గాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నాయి… ఒకటి అంతరిక్షం నుంచి శక్తిని తేవాలని చూస్తుంటే, మరొకటి భూమిపైనే సూర్యుడిని సృష్టించే పనిలో ఉంది…
1. జపాన్ ‘ఓహిసామా’ (OHISAMA) ప్రాజెక్ట్…: ఆకాశం నుంచి విద్యుత్! జపాన్ శాస్త్రవేత్తలు సైన్స్ ఫిక్షన్ సినిమాలను తలపించేలా అంతరిక్షం నుంచి వైర్‌లెస్ పద్ధతిలో భూమికి విద్యుత్తును పంపి చరిత్ర సృష్టించారు… తాజాగా దాని ప్రయోగం సఫలమైనట్టు తాజా వార్తలు చెబుతున్నాయి… కాకపోతే చిన్న స్థాయిలో…
Ads

ఈ మ్యాజిక్ ఎలా జరుగుతుంది..?
-
అంతరిక్షంలో సోలార్ ప్యానెల్స్…: భూమికి సమీప కక్ష్యలో ఉండే సాటిలైట్ తన సోలార్ ప్యానెల్స్ ద్వారా సూర్యరశ్మిని గ్రహిస్తుంది…
-
మైక్రోవేవ్ బీమింగ్…: సేకరించిన విద్యుత్తును ‘మైక్రోవేవ్’ కిరణాలుగా మార్చి భూమి మీద ఉన్న రిసీవర్ స్టేషన్‌కు పంపుతుంది…
-
ప్రయోజనం…: మేఘాలు ఉన్నా, వర్షం పడినా, చివరకు రాత్రి సమయాల్లో కూడా (సాటిలైట్‌కు ఎప్పుడూ ఎండ తగులుతుంది కాబట్టి) నిరంతరాయంగా కరెంటు అందుతుంది… నో పవర్ కట్స్, అపారమైన సౌరవిద్యుత్తు, ఎంత కావాలంటే అంత…

2. చైనా ‘ఆర్టిఫిషియల్ సన్’ (HL-2M Tokamak…): భూమిపైనే సూర్యుడు! జపాన్ ఆకాశంలో ఉన్న సూర్యుడిని వాడుకుందాం అంటుంటే, చైనా మాత్రం “మేమే ఒక సూర్యుడిని తయారు చేస్తాం” అంటోంది.
ప్రక్రియ…: కేంద్రక సంలీనం (Nuclear Fusion), ఏమిటిది? సూర్యుడి గర్భంలో శక్తి ఎలా పుడుతుందో, అదే పద్ధతిని భూమి మీద ఒక రియాక్టర్‌లో సృష్టించడమే ఈ ప్రయోగం…
-
ఉష్ణోగ్రత…: ఇది దాదాపు 150 మిలియన్ డిగ్రీల సెల్సియస్ వేడిని పుట్టిస్తుంది… ఇది అసలైన సూర్యుడి కేంద్రభాగం కంటే 10 రెట్లు ఎక్కువ…!
-
ప్రయోజనం…: ఒక్క కేజీ ఇంధనంతో టన్నుల కొద్దీ బొగ్గు ఇచ్చేంత శక్తిని పొందవచ్చు… పైగా ఇందులో ప్రమాదకరమైన అణు వ్యర్థాలు (Nuclear Waste) ఉండవు…
ముగింపు…: మనకేంటి లాభం? ఈ రెండు ప్రయోగాలు గనుక పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే…
-
కాలుష్యం ఉండదు…: బొగ్గు, పెట్రోల్ వాడకం తగ్గి భూమి పచ్చగా మారుతుంది…
-
చౌక విద్యుత్…: విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుంది….
-
చీకటి లేని లోకం…: ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా విద్యుత్ సరఫరాకు ఆటంకం ఉండదు…
అయితే, ఇవి సామాన్యుడికి అందుబాటులోకి రావడానికి మరో 15 నుండి 20 ఏళ్లు పట్టవచ్చునేమో… కానీ, భవిష్యత్తులో మన ఇంటి యాంటెన్నా నేరుగా ఆకాశం నుంచి కరెంటును రిసీవ్ చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు! జపాన్ వైర్‌లెస్ పవర్ ట్రాన్స్‌మిషన్ ఉద్దేశం అదే… అంతేకాదు, పెద్ద టవర్లు, కరెంటు తీగెలు, స్టేషన్లు గట్రా అవసరం ఉండకపోవచ్చు… టెలికామ్‌లాగే టెలిపవర్..!!
మరీ దీర్ఘకాలంలో... కొన్ని దేశాల చమురు బలుపు ఉండదు... ఇంకొన్ని దేశాల చమురు దరిద్రమూ ఉండదు... జియో పాలిటిక్స్‌తో మనిషి జీవనశైలే గణనీయ మార్పుకు లోనవుతుంది...
-
#TechNewsTelugu
-
#SpaceSolarPower
-
#ArtificialSun
-
#JapanTech
-
#ChinaScience
-
#FutureEnergy
-
#WirelessPower
-
#GreenEnergy
-
#NuclearFusion
-
#Innovation
Share this Article